ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము గన్నవరం విమానాశ్రయానికి రాగానే బీజేపీ, వైసీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆమె మంగళగిరిలో సీకే కన్వెన్షన్ సెంటర్‌లో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ప్రచార కార్యక్రమానికి వెళ్లారు. అనంతరం విజయవాడ గేట్‌వే హోటల్‌లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమానికి హాజరయ్యారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. విమానాశ్రయంలో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్ స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయంలో ద్రౌపతిముర్ముకు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. ఆమె అంతకుముదు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు. ఈ గౌరవంతో ఆ బ్యాంకు అధికారులు, సిబ్బంది విమానాశ్రయానికి వచ్చారు. ద్రౌపతిముర్ము పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమె ప్రచారంలో తెలుగునాట కవులు, విశిష్టతను ప్రముఖంగా ప్రస్తావించారు. అనంతరం రాత్రి 8.20 గంటలకు ప్రత్యేక విమానంలో ఆమె తిరుగు ప్రయాణమయ్యారు.
రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గారికి మద్దతు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ,ఆమెను ఘనంగా సన్మానించింది.ఎమ్మెల్యేగా,మంత్రిగా,గవర్నర్ గా విశేష సేవలు అందించిన ముర్ము గారిని టిడిపి ఎమ్మెల్యేలు,ఎంపీలు, నేతలకి టిడిపి జాతీయ అధ్యక్షుడు @ncbn గారు పరిచయం చేశారు. (1/2) pic.twitter.com/jG6MSUUFIW
— Telugu Desam Party (@JaiTDP) July 12, 2022
ద్రౌపది ముర్ముకే వైసీపీ మద్దతు
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థి ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం దక్కిందన్నారు. వైసీపీ మొదటి నుంచి సామాజిక న్యాయం కోసం పాటుపడుతుందన్నారు. సామాజిక న్యాయాన్ని ఆచరణలో చేసి చూపించిన ప్రభుత్వం వైసీపీ అని సీఎం జగన్ అన్నారు. అందరూ ముర్ముకే ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు.
‘‘మొదటి సారిగా గిరిజన మహిళ రాష్ట్రపతి అవుతున్నారు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన రాష్ట్ర ప్రభుత్వం మనది. అందులో భాగంగానే మరో అడుగు ముందుకు వేస్తూ ద్రౌపది ముర్ముగారిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఉంది.’’– సీఎం pic.twitter.com/d2VoNcFgvq
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 12, 2022
సామాజిక భాద్యత గా బిజెపి భావిస్తోంది- సోమువీర్రాజు
రాష్ట్ర పతి అభ్యర్థి ని శ్రీ మతి ద్రౌపది ముర్ము గారిని బలపర్చడానికి 42పార్టీ లు మద్దతు ఇచ్చాయి అని, ముందు కు వచ్చిన పార్టీ లనిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు తెలిపారు. ప్రపంచంలో భారతదేశం పరిణితి చెందిన దేశం అన్నారు. బ్రిటన్ లో ప్రజాస్వామ్య వ్యవస్థ చర్చ జరుగుతోందని, సామాజిక భాద్యత గా బిజెపి భావిస్తోందన్నారు. ద్రౌపది ముర్ము కు బలపర్చడానికి .
తెలుగు దేశం పార్టీ ముందుకు రావడంతో సోమువీర్రాజు చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
It is an honour for @BJP4Andhra to welcome NDA’s Presidential Candidate Smt Draupadi Murmu avl in Gannavaram airport today.
ఈరోజు గన్నవరం విమానాశ్రయంలో NDA రాష్ట్రపతి అభ్యర్థి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి స్వాగతం పలకడం @BJP4Andhraకి దక్కిన గౌరవంగా భావిస్తున్నాము.@blsanthosh pic.twitter.com/o3oFym0jkG
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) July 12, 2022