ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా ఇప్పుడు మరో పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఏపీలోని పేద డ్రైవర్ల కోసం వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీం కింద ప్రభుత్వం అర్హులైన ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఆర్ధిక సాయం కింద 10 వేల రూపాయలను అందించనున్నారు. ఇక ఈ పథకాన్ని వర్చ్యువల్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 13 వ తేదీన విశాఖలో పర్యటించే సందర్భంలో దీన్ని విడుదల చేయనున్నారు. ఇకపోతే సీఎం పర్యటనకు సంబందించిన వివరాలను సీఎం కార్యాలయం వెల్లడించింది. సీఎం 13 న ఉదయం 10 .30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11 . 05 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ కి వెళ్లి అక్కడి స్టాల్స్ ని సన్దర్దిస్తారు. తరువాత వైఎస్సార్ వాహనామిత్ర ఫోటో ఎగ్జిబిషన్ ని తిలకిస్తారు. ఆ వెంటనే వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులతో ఫోటో సెషన్ జరుగుతోంది. లబ్ధిదారుల ప్రసంగాలు 11 .40 గంటల నుంచి 11 . 45 గంటల వరకు ఉంటాయి. తర్వాత 11 .47 గంటల వరకు వాహనామిత్ర అంశంపై వీడియో ప్రదర్శన ఉంటుంది. 12 .17 గంటల వరకు సీఎం జగన్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 .20 నుంచి వైఎస్సార్ వాహనామిత్ర లబ్దిదారులకు చెక్కులు సీఎం చేతులమీదుగా పంపిణి చేస్తారు. ఆ తర్వాత విమానాశ్రయానికి 12 .30 నిమిషాలకు బయల్దేరుతారు. 12 . 55 గంటల నుంచి 1 .15 గంటల వరకు లోకల్ గా ఉండే నేతలతో భేటీ అవుతారు. ఇక ఫైనల్ గా గన్నవరానికి 1 .20 గంటలకు బయల్దేరుతారు. ఇక కొత్త వాహనాలు కొన్నవారు కూడా ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయానికి అర్హులే.. ఇప్పటికే అర్హుల జాబితా ఫైనల్ అయ్యింది. అలాంటి వారికి 10 వేల రూపాయల సాయం అందించనుంచి జగన్ ప్రభుత్వం. ఐతే దీనికి కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. అవేంటంటే మరో పథకంలో ఉండి లబ్ది పొందేవారు, అలాగే ప్రభుత్వ పింఛన్ పొందుతున్న వారు ఈ స్కీంకి అనర్హులు. అలాగే ఇన్కమ్ టాక్స్ కట్టేవాళ్ళు కూడా అనర్హులే. జాబితాలో పేరున్న వారు వారి ఆటో, టాక్సీతో ఫోటో దిగి వాలంటీర్ ద్వారా అప్ లోడ్ చేసిన వారిని మాత్రమే కొత్తవారిని ఫైనల్ చేశారు. వీళ్లందరి ఖాతాల్లో 13 న ఆర్ధిక సాయాన్ని జమ చేయనున్నారు.
