మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.. ముఖ్యంగా వానాకాలంలో ఈ నాలుగు రకాల కూరగాయలను తీసుకోకూడదట.! అవేంటంటే.!? మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యానికి సహాయకారిగా ఉంటుంది. అంతేకాని ఎలాంటి పద్ధతులు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఆహారం తీసుకుంటే కలిగే నష్టాలపై అప్రమత్తంగా ఉండాల్సిందే. దీంతో ఆహారం తీసుకోవడంలో మనం ఎంతో జాగ్రత్త వహించాల్సిందే. వర్షాకాలంలో మనం ఇంకా కొంచెం అప్రమత్తతతో ఉంటే మంచిదే. వర్షాకాలంలో ఆకుకూరలు తీసుకుంటే నష్టమే ఎక్కువ. ఒకవేళ తీసుకోవాలని అనుకున్నా ఆకుకూరలను దాదాపు అర గంటకు పైగా ఉడిచించి తీసుకుంటే మనకు ఎలాంటి నష్టం ఉండదని తెలుసుకుంటే మంచిది.
కూరగాయల్లో వంకాయకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో తెలిసిందే. ఆహా ఏమి రుచి అనరా మైమరచి అంటూ వంకాయను తింటుంటారు. వంకాయను మాత్రం ఈ కాలంలో తీసుకోకపోవడమే శ్రేయస్కరం.
ఎందుకంటే వంకాయలో వానకాలంలో వంకాయ తనను తాను రక్షించుకునేందుకు అనేక రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. దీంతో దురద, దద్దుర్లు, వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయి. అందుకే వంకాయను దూరం ఉంచితేనే ప్రయోజనం కలుగుతుందని గుర్తించాలి. ఇంకో రకం కాయ క్యాప్సికం. దీన్ని కూడా వేసవి కాలంలో ఎక్కువగా తీసుకుంటాం. కానీ వర్షాకాలంలో దీని జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఇందులో గ్లూకోసినోలేట్స్ రసాయనాలు విడుదల కావడంతో నమిలినప్పుడు విషతుల్యంగా మారుతుంది. దీంతో వాంతులు, విరేచనాలు, అజీర్తి, శ్వాస సమస్యలు ఏర్పడతాయి. మనం ఇష్టంగా తినే మరో కూరగాయ కాలీఫ్లవర్. ఇది కూడా తీసుకుంటే అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. అందుకే దీన్ని కూడా దూరం పెడితేనే ప్రయోజనం. వర్షాకాలంలో బెండకాయ, దోసకాయ, సొరకాయ, బీన్స్ వంటి కూరగాయలు పుష్కలంగా తినొచ్చు. కాబట్టి ఆ నాలుగు కూరగాయలను ముట్టుకోకుండా మిగతావి తీసుకుని మన దేహాన్ని బలంగా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం కోసం అన్ని రకాల కూరగాయలు తీసుకోవాలి. కానీ కాలానుగుణంగా చూసుకుని మనకు రక్షణ ఇచ్చే వాటిని తీసుకుంటే ప్రయోజనం కలుగుతుందని తెలుసుకోవాలి.