అంతర్జాతీయ సంస్థ బ్లూమ్ బెర్గ్ సంస్ధ వరల్డ్ బిలియనీర్స్ జాబితాను విడుదల చేసింది.ఎప్పట్లాగానే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 227.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే నెంబర్ వన్ కుబేరుడిగా కొనసాగుతున్నారు.కాగా…. రిలయన్స్ గ్రూపు షేరు విలువ రివ్వున దూసుకెళ్లడంతో ముఖేశ్ అంబానీ నికర సంపదలో పెరుగుదల చోటుచేసుకుంది. వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో అంబానీ 8వ స్థానానికి ఎగబాకారు. ఈ క్రమంలో ఆయన మరో భారత కుబేరుడు గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ముందంజలో ఉన్నారు . అంతేకాదు, ఆసియా సంపన్నుల జాబితాలో అంబానీ అగ్రస్థానం చేజిక్కించుకున్నారు. ఈ జాబితాలో అంబానీ 8వ స్థానంలో ఉండగా, అదానీ 9వ స్థానంలో నిలిచారు. బ్లూమ్ బెర్గ్ టాప్-10 జాబితాలో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం…
ఎలాన్ మస్క్- 227.5 బిలియన్ డాలర్లు మొదటి స్థానంలో ఉండగా,,,జెఫ్ బెజోస్- 149.4 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో,బెర్నార్డ్ ఆర్నాల్ట్- 138.3 బిలియన్ డాలర్లతో మూడవ స్థానం,బిల్ గేట్స్- 123.6 బిలియన్ డాలర్లతో నాలుగవ స్థానంలో ఉండగా,వారెన్ బఫెట్- 114.1 బిలియన్ డాలర్లతో 5 వ స్థానంలో,లారీ పేజ్- 106.4 బిలియన్ డాలర్లతో 6 వ స్థానంలో,సెర్గీ బ్రిన్- 101.9 బిలియన్ డాలర్లతో 7వ స్ధానంలో,ముఖేశ్ అంబానీ- 99.7 బిలియన్ డాలర్లతో 8 వస్ధానం,గౌతమ్ అదానీ- 98.7 బిలియన్ డాలర్లతో 9 వ స్ధానంలో ఉండగా,స్టీవ్ బామర్- 96.8 బిలియన్ డాలర్లతో 10 వ స్ధానంలో వున్నారు.