Connect with us

Hi, what are you looking for?

Andhra News

వరద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలు

జాతీయ విపత్తు కేంద్ర బృందం ఆధ్వర్యంలో వ‌ర‌ద‌లు, విపత్తు జరిగిన సమయంలో ఏవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై ప్ర‌జ‌ల‌కు డా.బి.ఆర్ అంబేద్కర్,ఐ.ఎ.యస్.,మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించారు. నదిలో ఈత రానివారు బోటులో షికారు చేసే సమయంలో లైఫ్ జాకెట్స్ లేకపోతే జరిగే ప్ర‌మాదాల‌పై అవగాహన కల్పించారు. ప్రమాదవశాత్తు నదిలో పడిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రతలు, ప్రథ‌మ చికిత్స గురించి తెలిపారు. అదేవిధంగా గుండెపోటు వచ్చినప్పుడు ఏవిధమైన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స తీసుకోవాలి దానిపై అవగాహన కల్పించారు.
వరదనీటిలోకి ప్రవేశించవద్దు. మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండాల‌న్నారు. విద్యుద్ఘాతానికి గురికాకుండా విద్యుత్ స్తంభాలు మరియు పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండండి. ఓపెన్ డ్రెయిన్స్ లేదా మ్యాన్‌హూల్స్ ను గుర్తించి ఆ ప్రదేశంలొ కనిపించే విధంగా చిహ్నాలు, ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి. వరద నీటిలో నడవకండి లేదా డ్రైవ్ చేయవద్దు, రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు గుర్తుంచుకోండి.

తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినండి. మీ ఆహారాన్ని ఎప్పుడూ ప్లేట్/కవర్ తో మూసి ఉంచండి. వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు త్రాగాలి.మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక మందులను వాడండి.

వరదల తరువాత ..

మీ పిల్లలను నీటిలోకి గాని మరియు వరద నీటి సమీపంలోకి ఆడటానికి పంపకండి. దెబ్బతిన్న విద్యుత్ వస్తువులను ఉపయోగించవద్దు, వాటిని తనిఖీ చేయండి. అధికారులు సూచించిన వెంటనే కరెంట్ కు సంబందించిన ప్రధాన స్విచ్లులను మరియు ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఆపివేయండి. తడిగా ఉంటే విద్యుత్ పరికరాలను తాకవద్దు. విరిగిన విద్యుత్ స్తంభాలు మరియు తీగలు, పదునైన వస్తువులు మరియు శిధిలాలను నిశితంగా పరిశీలించండి. వరద నీటిలో కలిసిన ఆహారాన్ని తినవద్దు. మలేరియా వంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలను వాడండి. వరద సమయంలో పాము కాటు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాముకాటుకు ప్రధమ చికిత్స తెలుసుకోండి. నీటి మార్గాలు / మురుగునీటి పైపులు దెబ్బతిన్నట్లయితే టాయిలెట్ లేదా కుళాయి నీటిని వాడకండి. నీరు త్రాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖ సలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు.

మీరు ఖాళీ చేయవలసి వస్తే …

మంచం మరియు టేబుళ్లపై మీ ఫర్నిచర్ మరియు ఇతర ఉపకరణాలను పెట్టండి. మీ కరెంట్ మరియు గ్యాస్ కనెక్షన్ ను ఆపివేయండి. ఎత్తైన భూ ప్రదేశం / సురక్షిత ఆశ్రయానికి వెళ్లండి. మీ వద్ద ఉన్న అత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె, విలువైన వస్తువులు మరియు ముఖ్యమైన పత్రాలు లను తీసుకొని వెళ్ళండి. లోతైన, తెలియని జలాల్లోకి ప్రవేశించవద్దు, నీటి లోతును తెలుసుకొనుటకు కర్రను ఉపయోగించండి. అధికారులు చెప్పినప్పుడు మాత్రమే ఇంటికి తిరిగి వెళ్ళండి. కుటుంబ సమాచార ప్రణాళికను రూపొందించుకోండి. తడిసిన ప్రతిదాన్ని శుభ్రపరచండి మరియు క్రిమిసంహారకం చేయండి.

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Alluri Seetharama Raju

Daftar Situs Slot Bonus New Member  100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Uncategorized

Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....

Uncategorized

Su Kaçak Tespiti Nasıl Yapılır Beşiktaş su kaçak tespiti Beşiktaş su kaçak tespiti yapan Uzman, kalorifer borularında meydana gelen su kaçaklarını iki farklı yöntemle...

Lingual Support by India Fascinates