రాష్ట్రంలో వలసకూలీల పరిస్థితి చాల దయనీయంగా ఉంది ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వలసకూలీలు సరైన ఆహారం దొరక్కపోవడం ఆరోగ్యం పై శ్రద్ద లేకపోవటంతో అనారోగ్య సమస్యలతో అర్దాంతరంగా తనువు చాలిస్తున్నారు మరికొంత మంది ఉన్న వూరిలో తీవ్రమైన కరువు సమస్య దానికి తోడు ప్రభుత్వ పథకాలు సరైన రీతిలో అందకపోవటంతో పేదరికంతో బతుకీడుస్తూ జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు.
రాయలసీమ ప్రాంతం కరువుకు ఆలవాలం ?
రాయలసీమ ప్రాంతంలో కరువు సమస్య తీవ్రంగా ఉంది ప్రధానంగా వెనకబడిన కులాల వారు ఈ కరువు ధాటికి తట్టుకోలేక పొరుగు రాష్ట్రమైన బెంగళూరుకు వలసలు వెళ్ళటం , మరికొంత మంది సొంత రాష్ట్రంలోనే విజయవాడ గుంటూరుకు వలస వెళ్లాల్సిన పరిస్థితి. కర్నూల్ జిల్లాలో సుమారు 2 లక్షల మంది ఉపాధి కోసం ఊరు విడిచి వెళ్లినట్టు తెలుస్తుంది. పిల్లల చదువులను మధ్యలో వదిలేసి వారిని తమతో పాటె తీసుకువెళ్లి కూలి పనులలో పెడుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. స్కూల్ డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో రాయలసీమ ప్రాంతం ప్రధానమైంది. కడప జిల్లాకు సంబంధించి అనేక వెనకబడిన కులాలు యాదవ నాయీ బ్రాహ్మణ పదమశాలి నూరబాషా దూదేకుల సరొగ ఉప్పర లాంటి కులాలు బతుకు తెరువు కోసం పొరుగురాష్ట్రాల బాట పడుతున్నాయి. కర్నూల్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా కూర్మి కులాలు వాల్మీకి బోయ కురుబ తొగట కుంచి వక్కలిగ కులాలు వలసల్లో ప్రధానంగా ఉన్నాయి. అనంతపురం రజక కురుబ తొగట కులాలు చిత్తూరుకి సంబంధించి వన్యకుల క్షత్రియ పాలకరి ముద్దలైయార్ ఈడిగ లాంటి వెనక బడిన కులాలు వలసకు పోతున్నారు.
ఉత్తరాంధ్ర వ్యధలు అన్ని ఇన్ని కావు ?
రాష్ట్రంలో వెనకబడిన కులాలు ఎక్కువగా ఉన్న జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం వినాశాఖపట్నం వీటిని ఉత్తరాంధ్ర జిల్లాలుగా పిలుస్తున్నారు. ఇందులో గవర, కళింగ ,మత్స్యకార పోలినాటి వెలమ, కొప్పువెలమ, నగరాలు, నాగవంశీయులు ప్రధానంగా ఉన్నారు. మొత్తం బీసీ కులాల అభివృద్ధి ఏంటో ఈ జిల్లా లెక్కలు తీస్తే అర్థమైపోతుంది. అంతటి బీసీ ప్రాధాన్యత జిల్లాలో వలసలు చూస్తే కన్నీళ్లు ఆగకమానవు ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా నుండి నాలుగు లక్షల మంది వలస కూలీలు ప్రతి సంవత్సరం ఉపాధి కోసం పొరుగు రాష్ట్రం పోతున్నారు. ఇందులో మత్స్యకార కుటుంబాలు చాల తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. ఉన్న ఊరిలో జెట్టీలు లేక ఫిషింగ్ హార్బర్లు లేక గుజరాజ్ వెస్ట్ బెంగాల్ లాంటి ఊర్లకు వలస వెళ్లాల్సిన పరిస్థితి.
ఎందుకు సామజిక న్యాయ భేరి యాత్రలు ?
ఏం సాధించారని సామాజిక న్యాయభేరి యాత్రలు బీసీ మంత్రులు చేస్తున్నారో అర్ధం కానీ పరిస్థితి రాష్ట్రం మొత్తం బీసీ కులాల్లో చాల మంది పేదరికంతో మగ్గుతూ సరైన ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు పోతున్నారంటే ప్రభుత్వం ప్రకటిస్తున్న రైతు నేస్తం అమ్మఒడి వైస్సార్ చేయుట పించేన్లు ఇవన్నీ ఏమైపోతున్నాయి ఇంత డబ్బు ప్రభుత్వం ఏం చేస్తుంది పేదరికం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న తీరుగా ఉన్నపుడు కాగితాల్లో అభివృద్ధి గారడీ ఇంకెంతకాలం చేస్తారు ఓట్ల విషయంలో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత మరి వారి అభివృద్ధికి ఎందుకు ఇవ్వటం లేదు. తాత్కాలిక ఉపశమనాలుగా ఉన్న ఈ ప్రభుత్వ పథకాలు కూడా సరిగా పేదలకు అందటం లేదనేది సుస్పష్టం. ఇక దీర్ఘకాలిక అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎందుకు పరిశ్రమలు పెట్టడం లేదు వారికీ ఉపాధి ఎందుకు చూపించటం లేదు ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు.
ప్రభుత్వ బీసీ కార్పొరేషన్స్ – దారి మళ్లుతున్న నిధులు ?
బీసీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించకుండా పేదలకు ఖర్చు చేయాలని అదేవిధంగా కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలని కుల సంఘాలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టని పరిస్థితి. చేతి వృత్తిదారులను గుర్తించి వారి అభివృద్ధి కోసం పనిచేయాలి వాస్తవానికి బీసీ కార్పొరేషన్స్ అందుకోసమే సృష్టించినా వాటి పని తీరు మాత్రం బాలేదనే విమర్శలు వస్తున్నాయ్
మరి ప్రభుత్వం చెప్తున్నట్టు సరైన లెక్కలను తీసి నిధులు ఖర్చు చేసి ఉంటే ఈ వలసలు ఆగి ఉండాలి వాస్తవంలో ఈ వలసలు ఎక్కువయ్యాయి. అంటే దానర్థం పథకాల అమలులో లోపాలు ఉన్నట్టే కదా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కార్పొరేషన్స్ పటిష్ఠపరిచి పేదలకు న్యాయం చేయాలనీ కులసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.