‘సర్కారువారి పాట’మూవీతో విజయం అందుకున్న మహేష్ బాబు త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు .త్రివిక్రమ్ తో సినిమా అయిపోగానే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో మహేశ్ నటించనున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చే మూవీ ఆఫ్రికన్ అడవి నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఉంటుందని రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరోపక్క రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’మూవీ సక్సెస్ సంబరాల అనంతరం తన తర్వాతి సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనుల్లో నిమగ్నం కానున్నారు..
ఈ క్రమంలో మహేశ్‌బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘రాజమౌళితో సినిమా విషయమై కొన్ని ఆలోచనలపై ఇప్పటికే చర్చించామని కూడా తెలిపారు. ప్రస్తుతానికి దేనిపైనా స్పష్టత రాలేదని,పూర్తి డిటైల్స్ అందాకా… ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం అన్నారు. కాకాపోతే తన కల సాకారమవుతోందని,తామిద్దరం కలిసి పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకున్నామని ఎట్టకేలకు అది త్వరలోనే సాధ్యం కానుందని మహేష్ వెల్లడించారు.