తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ తెలంగాణ శాఖ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే… కె.లక్ష్మణ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నిక సంఘం ప్రకటించింది. రిటర్నింగ్ అధికారి నుంచి లక్ష్మణ్ డిక్లరేషన్ అందుకున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా కె.లక్ష్మణ్ వెల్లడించారు. తాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి పార్లమెంటు సభ్యునిగా రాజ్యసభకు ఎన్నికయ్యాను అంటూ ఆయన ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. . తనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లకు లక్ష్మణ్ అంటూ ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలిపారు.