ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష టీడీపీ (TDP) పావులు కదుపుతోంది. మహానాడు (Mahanadu) తర్వాత గెలుపు ఖాయమన్న దీమాతో ఉన్నారు. మహానాడు సక్సెస్ కావడం, బాదుడే బాదుడు కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో ఎన్నికల వరకు అదే వ్యూహాన్ని అమలు చేయాలని టీడీపీ భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ వ్యూహాలను మరింత పదను పెట్టాలని చూస్తోంది. ముఖ్యంగా నారా లోకేష్ త్వరలోనే పాదయాత్ర చేపడతారంటూ తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్రలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా లోకేష్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మహానాడు ఇచ్చిన జోష్ తో దేనికైనా రెడీ అనేలా లోకేష్ అంటున్నట్లు సమాచారం.
2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత వచ్చే ఎన్నికల్లో అయిన తమ సత్తా చూపించాలని తెలుగు తమ్ముళ్లు (TDP) తహాతహాలాడుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ (AP CM YS JAGAN) ప్రభుత్వంలో పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికి ప్రజా క్షేత్రంలోకి దిగాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు. 2019 నుంచి అప్పుడప్పుడు బాబు ప్రజల్లోకి వచ్చినా లోకేష్ మాత్రం ప్రజల్లో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ నాయకులను అరెస్ట్ లు చేసినప్పుడు.., ఇతర కార్యక్రమాల్లో కూడా లోకేష్ గత కొద్ది రోజులుగా చురుగ్గా పాల్గోంటున్నారు.
ఇప్పటికే రాజధాని అంశం, రాష్ట్రం ఆర్ధికంగా దెబ్బతినటం, నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అన్ని వస్తువుల ధరలు పెరుగుదల వీటితోపాటు ప్రభుత్వ తీసుకున్న కొన్ని నిర్ణయాలపట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూల ఓటుగా మార్చుకోవడానికి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు.. ఇదిలా ఉంటే మహానాడులో లోకేష్ చేసిన కామెంట్స్ పార్టీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పార్టీ పదవుల విషయంలో కఠిన నిర్ణయాలు తప్పవని చెప్పిన సంగతి తెలిసిందే. వరుసగా మూడేళ్లు ఒకే పదవిలో ఉండరాదని లోకేష్ అభిప్రాయపడ్డారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తాను తప్పుకొని వేరే వాళ్లకు అవకాశమిస్తానని లోకేష్ అన్నారు. అలాగే వరుసగా మూడేళ్లు ఓడిపోయిన నేతలకు కూడా టికెట్ ఇవ్వారదన్నారు. పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని లోకేష్ చెప్పడంతో.. ఆయనే పార్టీ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకుంటున్నారని చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ గెలిస్తే.. ఇప్పటివరకు తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టొచ్చని లోకేష్ భావిస్తున్నారు. అందుకే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను విరించడమే కాకుండా.. తాము వస్తే ఏం చేస్తామో వివరించాలని చూస్తున్నారట. మరి లోకేష్.. నిజంగానే పాదయాత్ర చేస్తారా..? లేదా..? అనేది వేచి చూడాలి…