‘‘నటిగా ఉండటమనేది సవాళ్లతో కూడిన ప్రయాణం. మేమెన్నో ఎత్తు పల్లాలు చూస్తాం. ఈ ప్రయాణమే తరచూ మా గమ్యాన్ని నిర్ణయిస్తుంది. గతకాలం నాకు పరీక్షా సమయం లాంటిది. ప్రపంచానికి నా అత్యుత్తమ ప్రదర్శనను అందించడానికి నేను నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని నాకు అర్థమైంది’’ అని ఆ పోస్ట్‌లో ఎమోషనల్‌గా రాసుకొచ్చింది కీర్తి సురేష్.
జయాపజయాలు చిత్రసీమలో సర్వ సాధారణం. ఈ రెండింటినీ సమంగా స్వీకరించగలిగిన వాళ్లే సుదీర్ఘ కాలం కొనసాగగలుగుతారు. ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్మడమే కాదు.. ఆచరణలో చూపే నటి కీర్తి సురేష్. ‘మహానటి’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత వరుసగా చేదు ఫలితాలు రుచి చూడాల్సి వచ్చింది.
ఎట్టకేలకు ఇటీవల వచ్చిన ‘చిన్ని’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలతో ఆకట్టుకుంది. అందుకే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దక్కిన ఈ విజయాల పట్ల ఎమోషనల్‌గా స్పందించింది కీర్తి. ఈ మేరకు తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో ఓ లేఖను పంచుకుంది. ప్రస్తుతం కీర్తి తెలుగులో చిరంజీవితో ‘భోళా శంకర్’లో, నానితో ‘దసరా’ చిత్రాల్లో నటిస్తోంది.