ప్రజారాజ్యాం అధినేత చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా వెళ్లే ముందు తిరుపతి ఎమ్మెల్యే స్థానానికి ఆయన రాజీనామా చేశారు. అలా తిరుపతికి చిరంజీవికి ప్రజా రాజ్యానికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. పవన్ కల్యాణ్ కి కూడా తిరుపతిపై ఎప్పటినుంచో గురి ఉంది. ఇటీవల తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా పవన్ ఆ ఫలితం కనపడుతుందని అనుకున్నారు కానీ సాధ్యపడలేదు. ఇప్పుడు మళ్లీ తిరుపతి వార్తల్లోకెక్కింది. తిరుపతి జనసేన కమిటీ పవన్ కల్యాణ్ తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరింది. అక్కడితో ఆగలేదు. ఆయన పోటీ చేస్తే బంపర్ మెజార్టీ ఖాయమని ధీమాగా చెబుతోంది. ఏకంగా లక్ష మెజార్టీతో తమ అభినేతను గెలిపించుకుంటామంటున్నారు నూతన కమిటీ నేతలు.
2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ తిరుపతి విభాగం కీలక తీర్మానం చేసింది. తిరుపతిలో పవన్‌కల్యాణ్ సొంత సామాజిక వర్గానికి మెజార్టీ ఉంది. ఆ ఓట్లన్నీ గుంప గుత్తగా ఆయనకే పడితే గెలుపు గ్యారెంటీ. అయితే సామాజిక వర్గంలో కూడా పార్టీల వారీగా ఓట్లు చీలిపోతాయనేది బహిరంగ రహస్యం. కానీ నేరుగా పవన్ పోటీ చేస్తే కచ్చితంగా ఈసారి అందరూ ఆయననే బలపరిచే అవకాశముందనేది జనసేన స్థానిక నేతల అభిప్రాయం. దీంతో వారంతా కలసి ఈ తీర్మానం చేశారు. గతంలో చిరంజీవి పోటీ చేసినప్పుడు కూడా అదే జరిగిందని, ఇప్పుడు పవన్ పోటీ చేస్తే కచ్చితంగా అందరూ జనసేనకే ఓటు వేస్తారని నమ్మకంగా చెబుతున్నారు.
గతంలో తిరుపతిలో ప్రజారాజ్యం విజయాన్ని జనసేన నేతలు సెంటిమెంట్ గా భావిస్తున్నారు. చిరంజీవి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కారణం అయిన తిరుపతి నియోజకవర్గం నుంచే ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని, ఆ సెంటిమెంట్ కొనసాగుతుందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ భీమవరం, గాజువాక రెండు చోట్ల బరిలో నిలిచారు. కానీ రెండు చోట్ల ఆయన ఓడిపోయారు. ఈసారి మాత్రం ఒకేచోట నిలబడాలని అనుకుంటున్నారు. ఇటీవల ఉత్తరాంధ్రలో పవన్ పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తిరుపతి జనసైనికులు మాత్రం పవన్ కల్యాణ్ తమ ప్రాంతానికి రావాలని, కచ్చితంగా గెలిపించుకుంటామని అంటున్నారు.
జనసేన అధినేత వపన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్న జనసేన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యకర్తలు తిరుపతి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయాలని కోరుతున్నారు. ఈ మధ్య జరిగిన తిరుపతి సభలో పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని అక్కడి కేడర్ ఉత్సాహంగా తెలిపింది. ఇక.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు. దురదృష్టం కొద్దీ రెండు చోట్ల ఓడిపోయారు. భీమవరం నుంచి… గాజువాక నుంచి పోటీ చేసి, రెండు చోట్ల ఓడిపోవడంతో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు. జనసేన తరపున రాజోలు నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. ఆయన కూడా వైఎస్ఆర్‌సీపీతో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో జనసేన పార్టీకి ఎమ్మెల్యే లేకుండా అయిపోయినట్లయింది. స్వయంగా అధినేత రెండు చోట్ల ఓడిపోవడంతో పవన్ ఫ్యాన్స్ డీలా పడ్డారు. ఇతర పార్టీలు కూడా ముందు పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలవాలని సవాల్ చేస్తూ వస్తున్నాయి.
ఈ సారి పవన్ కల్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే గతంలో ఓడిపోయిన స్థానాల కంటే… సేఫ్ ప్లేస్ ఎంచుకోవాలని భావిస్తున్నారు. తిరుపతిలో గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి విజయం సాధించారు. పవన్ కల్యాణ్‌కు చిరంజీవికి అక్కడ ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. ఈ సారి తిరుపతిలో పోటీ చేస్తే గెలుపు ఖాయమన్న నమ్మకంతో జనసేన వర్గాలు ఉన్నాయి. తమ ఆకాంక్షను శ్రేణులు పవన్ కల్యణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
జనసైనికుల గట్టిగా పట్టుబడితే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తిరుపతి నుంచి పోటీచేసే అవకాశాలలు లేకపోలేదు. ఇక్కడి నుంచి అయితే గెలుపు సునాయాసం అవుతుందనేది పార్టీ కేడర్, అభిమానుల వాదన. ఇప్పటికే స్థానికంగా పార్టీని బలోపేతం చేశామని.. దీనికి తోడు పవన్ మేనియో తోడైతే విజయం పెద్ద విషయం కాదంటున్నారు. అందుకే తమ మనసులో మాటను బయటపెట్టారు.. అధినేత ఊ అంటారా, ఊహూ అంటారా అన్నది చూడాలి. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యతిరేక ఓటును చీలనిచ్చేది లేదన్న జనసేనాని.. ఆ దిశగా పొత్తులకు వెళితే తిరుపతి స్థానం పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. మరి పవన్ తిరుపతివైపు చూస్తారా లేదా అన్నది చూడాలి.