Connect with us

Hi, what are you looking for?

Andhra News

జగన్ నవరత్నాలపై పవన్ కళ్యాణ్ ‘నవసందేహాలు’

జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు.  వైసీపీ ప్లీనరీ సమావేశాలు వేళ కొత్త చర్చను లేవనెత్తారు. ప్లీనరీ వేదికగా గత మూడేళ్లుగా చేపట్టిన సంక్షేమ పథకాలు…

Share

జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు.  వైసీపీ ప్లీనరీ సమావేశాలు వేళ కొత్త చర్చను లేవనెత్తారు. ప్లీనరీ వేదికగా గత మూడేళ్లుగా చేపట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలపై సీఎం జగన్ ప్రసంగించనున్న సమయంలోపవన్ హీట్ పెంచేలా నవరత్నాలపై నవసందేహాల పేరిట ప్రశ్నల వర్షం కురిపించారు. సందేహాలను నివ్రుత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

2017 ప్లీనరీ వేదికగా జగన్ నవరత్నాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అవి ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి. ప్రజలు నవరత్నాలను నమ్మి జగన్ వైపు మొగ్గుచూపారు. 2019 ఎన్నికల్లో ఘన విజయం కట్టబెట్టారు. అయితే గత మూడేళ్లుగా నవరత్నాల్లో ప్రకటించిన పథకాలను అమలు చేస్తున్నట్టు జగన్ సర్కారు చెబుతూ వస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం చాలామంది అర్హులను వివిధ కారణాల తో  పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. నవరత్నాలపై నవ సందేహాల పేరిట ప్రత్యేక కరపత్రాన్ని విడుదల చేశారు. లోపాలను ఎత్తిచూపారు. నవరత్నాల పేరిట లబ్ధిదారుల కోత, అర్హులకు జరుగుతున్న అన్యాయంపై నేరుగా ప్రశ్నించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో ప్రజలను దారుణంగా వంచించిందని ఆరోపించారు. అంతటితో ఆగకుండా నవసందేహాల పేరిట పథకాల్లో కోత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గణాంకాలను ప్రస్తావిస్తూ వైసీపీ సర్కారును నిలదీసినంత పనిచేశారు.

మొదటి రత్నం – రైతు భరోసా

64 లక్షల మందికి మేలు అని చెప్పి.. 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా?
మూడేళ్లలో 3 వేలమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొంటే కేవలం 700మందికే ఆర్థిక సాయాన్ని పరిమితం చేయలేదా?

రెండో రత్నం – అమ్మ ఒడి

అమ్మ ఒడి 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి.. 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు?

మూడో రత్నం –  పెన్షన్లు

పెన్షనర్ల జాబితాను కుదించి 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా?

నాలుగో రత్నం – సంపూర్ణ మద్యపాన నిషేధం

మద్యం ఆదాయం 2018-19లో రూ.14 వేల కోట్లు… 2021-22లో రూ.22 వేల కోట్లు – ఇదేనా మద్య నిషేధం? ఈ ఆదాయం చూపించే రూ.8 వేల కోట్లు బాండ్లు అమ్మలేదా?

అయిదో రత్నం – జల యజ్ఞం

పోలవరం ప్రాజెక్టును ‘యుద్ద ప్రాతిపదిక’న ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా?

ఆరో రత్నం – ఆరోగ్యశ్రీ

ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆసుపత్రులు ఎందుకు పక్కకు తప్పుకొంటున్నాయి? సి.ఎమ్.ఆర్.ఎఫ్. నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదు?

ఏడో రత్నం – ఫీజు రీయింబర్స్ మెంట్  

రీయింబర్స్ మెంట్  చేయకపోవడం వల్లే విద్యార్థులకు హాల్ టికెట్స్ ఆపేస్తున్న మాట నిజం కాదా? పీజీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారు?

ఎనిమిదో రత్నం – పేదలందరికీ ఇళ్లు

చెరువుల్లో, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమే కదా? ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎందుకు మంజూరు చేయలేదు?

తొమ్మిదో రత్నం – ఆసరా

పొదుపు సంఘాల సంఖ్యను ఏటేటా లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారు? అభయ హస్తం నిధులు రూ.2 వేల కోట్లు ఎటుపోయాయి?

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Alluri Seetharama Raju

Daftar Situs Slot Bonus New Member  100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Uncategorized

Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....

Alluri Seetharama Raju

Prediksi forum Syair cambodia Hari Ini 2023     Forum syair cambodia 2023, kode syair cambodia hari ini, code syair cambodia bd, prediksi cambodia...

Lingual Support by India Fascinates