కార్పొరేషన్ పేరు పెట్టి గిరిజనుల నోరు కొట్టే పనిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిటీ మాజీ సభ్యులు, టీడీపీ నాయకులు డాక్టర్ కొండారెడ్డి నరహరివరప్రసాద్ అన్నారు. దుగ్గిరాలలో జరిగిన టీడీపీ రాష్ట్ర గిరిజన విభాగం ఆత్మీయసమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నరహరివరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం గిరిజనులను అణగదొక్కుతోంది. గిరిజనుల అభున్నతి 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల జీవో నెం.3 సుప్రీంకోర్టులో కొట్టి వేయగా, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోకుండా రివ్యూ పిటిషన్ వేయకుండా చోద్యం చూస్తుందని ఆరోపించారు. 5వ షెడ్యూల్ లో ఉండే ఫలాలను గిరిజనులకు అందకుండా జగన్ ప్రభుత్వం కాలరాస్తోంది. సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నాడు. మూడేళ్ల పాలనలో గిరిజనుడికి ఒక్క లోనూ కూడా ఇవ్వని పరిస్దితులు కల్పించాడు. మైదాన ప్రాంతంలోని గిరిజనులకు అన్యాయం జరుగుతోంది. రాజ్యాధికారం గిరిజనులకు అందని దాక్ష్రలా మారింది. మైదాన ప్రాంత గిరిజనులను విస్మరిస్తున్నారు. 1962 నుంచి మైదాన ప్రాంతంలో గిరిజనులకు 4 ఎమ్మెల్యే స్దానాలు ఉన్నాయి. గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్య ఆరోగ్యం కరువయ్యింది.
గిరిజనుల పట్ల జగన్ కు చిత్తశుద్ధి లేదు
టీడీపీ హయాంలో వేల కొట్ల రూపాయలు 50 శాతం, 90 శాతం సబ్సిడీలు కల్పించి గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఏకలవ్య గురుకుల, ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటుచేశారు. 1986లో ఎన్టీఆర్ గిరిజనులకు 4 శాతం ఉన్న రిజర్వేషన్లలను 6 శాతం పెంచి రిజర్వేషన్లు కల్పించారు. నోరు లేని గిరిజనులను అణగదొక్కుతూ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లిస్తున్నారని ఆరోపించారు. అనంతపురం కదిరి ఎస్టీ నాయకులు సోమ్లా నాయక్ మాట్లాడుతూ రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. జగన్ మూడేళ్ల పాలనలో ఎస్టీ నిధులు ఎక్కడని ? ప్రశ్నించారు. ఎస్టీ కార్పొరేషన్ పేరు పెట్టి గిరిజనుల నోరు కొట్టి వారి జేబు నింపుకుంటున్నారు. గిరిజనుల పట్ల జగన్ కు చిత్తశుద్ధి లేదన్నారు.
గిరిజనుల ఐక్యతకు ముందడుగు
గిరిజనుల ఆత్మీయ సదస్సు గిరిజనుల ఐక్యతకు అభ్యున్నతికి ముందడుగు అని పలువురు వక్తలు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన గిరిజన నాయకులు అక్కడి రాజకీయ సామాజిక పరిస్దితులు , జరుగుతున్న పరిణామాలు, గిరిజనుల అభ్యున్నతికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. మైదాన ప్రాంతంలో గిరిజనులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని పలువురు డిమాండ్ చేశారు.