ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో టీటీడీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ఉచిత సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగష్టు 7న ఉచిత సామూహిక వివాహాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. దాదాపు పుష్కర కాలం తర్వాత టీటీడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
సుదీర్ఘ విరామం తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత కళ్యాణమస్తు కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. దివంగత వైఎస్ రాజేశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ మస్తు ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహించారన్నారు. ఆయన మరణం తరువాత ఈ కార్యక్రమం నిలిపి వేశారనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో ఈ కార్యక్రమం పునఃప్రారంభించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుందని సుబ్బారెడ్డి వివరించారు. పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారమై వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు జరిపించనున్నామని చెప్పారు. ఆగస్టు 7వ తేదీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సరం శ్రావణ శుక్ల దశమి ఆదివారం ఉదయం 8.07 గంటల నుంచి 8.17 గంటల మధ్య అనూరాధ నక్షత్రం సింహ లగ్నంలో వివాహాలు జరిపించాలని పండితులు సుముహూర్తం నిర్ణయించారని చైర్మన్ తెలిపారు. అర్హులైన వారందరూ ఆయా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత వివాహాలు జరిపిస్తామని చెప్పారు.
ఇతర రాష్ట్రాల సీఎంలు ముందుకొస్తే ఆ ప్రాంతాలలో కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించేందుకు టీటీడీ సిద్దంగా వుందన్నారు. కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన అప్పటి సిఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి 6వ విడతలలో కళ్యాణమస్తూ కార్యక్రమం నిర్వహణ ద్వారా 45 వేల జంటలు ఒక్కటయ్యాయి . 2011 మే 20వ తేదిన కళ్యాణమస్తూ చివరి విడత నిర్వహించింది టిటిడి.. ఆర్దిక భారం,ఇతర మతస్థులు, నకీలి జంటలు కళ్యాణమస్తూ కార్యక్రమంలో అందజేసే బంగారు తాళిబోట్టులు కోసం వివాహం చేసుకుంటున్నారని విజిలెన్సు రిపోర్ట్ అందింది. విజిలేన్స్ రిపోర్ట్ మేరకు కళ్యాణమస్తూ కార్యక్రమాని నిలిపివేసిన అప్పటి ఇఓ ఐవైయ్యార్ కృష్ణారావు.. కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని 2013 లో ప్రయత్నించి విఫలమయ్యారు అప్పటి చైర్మన్ బాపిరాజు. ఇక సిఎం జగన్ ఆదేశాలు మేరకు ఎట్టకేలకు కళ్యాణమస్తూ కార్యక్రమాని పున:ప్రారంభిస్తోంది టిటిడి.