అసలు కశ్మీర్ లో ఏం జరుగుతోంది.ఇప్పుడు ఎవ్వరికీ అర్ధం కానీ సమస్య.ఎందుకంటే వరుస హత్యలతో కశ్మీర్ వణికిపోతోంది.హిందువులే లక్ష్యంగా హత్యాకాండ కొనసాగుతోంది.దీనికి కారణం ఏమిటో తెలియక కశ్మీర్ పండిట్ లు తలలు పట్టుకుంటున్నారు.నెల వ్యవధిలో నలుగురు హిందువులను హతమార్చారు.గతనెలలో ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ ను హత్య చేశారు.తర్వాత టీవి నటిని,మొన్న టీచర్ రజనీ బాలానీ,నిన్న బ్యాంక్ మేనేజర్ విజయ్ ను హత్య చేశారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు తమను వేరే ప్రాంతాలకు బదీలీ చెయ్యాలని ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. కశ్మీర్ పండిట్ లు ఏం జరుగుతోందో తెలియక, ఎప్పుడు ఎవరు హత్య చేయబడతారో తెలియక ఆందోళన చెందుతున్నారు.
కాగా కశ్మీర్‌లో కొన్ని రోజులుగా హిందువులపై ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. ఒక్క మే నెలలోనే అయిదుగురుప్రభుత్వ ఉద్యోగులను హతమార్చారు. అసలు ఎందుకు చంపుతున్నారో ,కారణం ఏంటో తెలపకుండా మనుషుల ప్రాణాలను తీస్తున్నారు. అసలు కశ్మీర్‌లో ఏం జరుగుతుందో తెలియని ఆందోళన నెలకొంది.ఎవరు ఎక్కడ నుంచి వచ్చి చంపుతారో అని అక్కడ హిందువులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గజగజ వణికి పోతున్నారు.మరోవైపు ఈ హత్యలను కాశ్మీరీ పండిట్లు తీవ్రంగా నిరసిస్తున్నారు.వరుస హత్యలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
కశ్మీర్‌లో హిందువులపై, ముఖ్యంగా పండిట్లపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగిపోయాయి. అందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది కశ్మీర్‌ను విడిచిపెట్టి వెళ్లిపోతున్నట్టు సమాచారం. కొన్ని రోజుల వ్యవధిలో.. 100కుపైగా హిందువుల కుటుంబాలు.. కశ్మీర్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బారాముల్లాలోని హిందూ కశ్మీరీ పండిట్ కాలనీలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నట్టు, సగానికిపైగా మంది వలస వెళ్లిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.
ఓ పక్క కశ్మీర్ లో అల్లర్లకు కేంద్రప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు,విపక్షాలు విమర్శిస్తున్నాయి.1989 లో చేసిన తప్పులనే ప్రధాని మోదీ చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి.సినిమాలను ప్రమోట్ చెయ్యకుండా దేశాన్ని పాలించండి అంటూ విమర్శిస్తున్నారు.కేంద్రప్రభుత్వ ఆదీనంలో వున్న కశ్మీర్ లో జరుగుతున్న వరుస హత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత అంటూ ఆరోపిస్తున్నాయి.కశ్మీర్ పండిట్ల రక్షణ లో కేంద్రప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందంటూ మండిపడుతున్నారు.ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం చొరవ తీసుకుని ఈ హత్యాకాండకు కారణమైన వారిని శిక్షించాలని, ఇది కేవలం కశ్మీర్ సమస్య మాత్రమే కాదని, దేశ భద్రతకు సంబంధించిన సమస్య అంటూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు.