అమెరికా దేశంలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం ఎపిఎన్ఆర్టిఎస్, పలు ప్రవాసాంధ్రుల సంఘాల సహకారంతో జూన్ 18 నుంచి తొమ్మిది నగరాల్లో నిర్వహించిన శ్రీనివాస కల్యాణాలు జూలై 11వ తేదీన సోమవారం ముగిశాయి. ప్రవాసాంధ్రులు స్వామివారి కల్యాణాలను కనులారా దర్శించి తరించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి ఈ కల్యాణాలు జరిగాయి.
జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో నగరాల్లో స్వామివారి కల్యాణాలు జరిగాయి. అదేవిధంగా, జూలై 2న న్యూ ఆర్లిన్,
3న వాషింగ్టన్ డిసి, 9వ తేదీ అట్లాంటా జులై 10న బర్మింగ్ హమ్ నగరాల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించారు. ఆయా నగరాల్లో నిర్వహించిన శ్రీనివాస కల్యాణాలకు విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంపతులు పలుచోట్ల జరిగిన కల్యాణాల్లో పాల్గొన్నారు.