2022 మే నెలలో 11.713 మిలియన్ టన్నుల సరుకు లోడింగ్ జరగగా, 21 మిలియన్ ప్రయాణికులు ప్రయాణించారు. రైలులో ఎక్కువ లగేజీని తీసుకెళితే ఇకపై అదనపు ఖర్చు భారం తప్పదు. ఎక్కువ లగేజీ ఉంటే, ప్రయాణం యొక్క ఆనందం సగానికి తగ్గిపోతుంది. అదనపు సామాను ఉంటె గనక, పార్శిల్ కార్యాలయానికి వెళ్లి లగేజీని బుక్ చేసుకోండి. రైల్వే కొత్త లగేజీ నియమాలు: అదనపు సామాను తీసుకెళ్లినందుకు రైల్వే మీకు ఛార్జీ విధించింది.
అసలు విషయానికి వస్తే చైన్ పుల్లింగ్ సంఘటనలు కూడా బాగా పెరిగాయి. దీని కారణంగా తోటి ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే యంత్రాంగం ఆల్రెడీ హెవీ లగేజ్ ని తీసుకెళ్లవద్దు అంటూ గట్టిగానే హెచ్చరించింది కూడా. ఏప్రిల్ 1 నుంచి 30 మధ్య ముంబై డివిజన్‌లో 332 అలారం చైన్ పుల్లింగ్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 53 కేసులు మాత్రమే పరిష్కరించబడ్డాయని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. చైన్ పుల్లింగ్ కేసులు పెరగడం వెనుక ఉన్న ప్రధాన కారణాలలో ఒకటి. మే 29న రైల్వే మంత్రిత్వశాఖ తన ఆఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక ట్వీట్ చేసింది “లగేజ్ ఎంత తక్కువ ఉంటె జర్నీ కూడా అంతే హ్యాపీ గా ఉంటుంది. కాబట్టి ఎక్కువ లగేజ్ తో ట్రైన్ లో ప్రయాణించవద్దు అని చెప్పింది. అదనపు సామాను ఉంటె, పార్శిల్ కార్యాలయానికి వెళ్లి లగేజీని బుక్ చేసుకోండి”. ప్రస్తుత రైల్వే నిబంధనల ప్రకారం రైలు ప్రయాణంలో ప్రయాణికులు 40 నుంచి 70 కిలోల లగేజీని మాత్రమే తీసుకెళ్లాలి. వాస్తవానికి, రైల్వే కోచ్‌ను బట్టి లగేజీ బరువు భిన్నంగా ఉంటుంది.
స్లీపర్‌లో, AC చైర్ కార్ మరియు AC 3 టైర్ కోచ్‌ల ప్రయాణికులు 40 కిలోల వరకు మోయవచ్చు. 2వ ఏసీ కోచ్‌లలో ప్రయాణికులు 50 కిలోల వరకు, 1వ ఏసీ క్లాస్ ప్యాసింజర్ 70 కిలోల వరకు తీసుకెళ్లొచ్చు . సాధారణ తరగతిలో ఈ పరిమితి కేవలం 35 కిలోలు అని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
2022 మే నెలలో 11.713 మిలియన్ టన్నుల సరుకు లోడింగ్ జరగగా, 21 మిలియన్ ప్రయాణికులు ప్రయాణించారు. దక్షిణ మధ్య రైల్వే నూతన ఆర్థిక సంవత్సరాన్ని అసాధారణ ప్రతిభ కనబర్చి ఆశాజనకంగా ప్రారంభించింది. 2022 మేలలో ప్రయాణికులు, సరుకు రవాణా రంగాల ఆదాయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తమమైన నెలవారీ ఆదాయాలను సాధించింది. 2022 మేలో రూ.423.98 కోట్ల ప్రయాణికుల ఆదాయాన్ని నమోదు చేసింది. గతంలో నమోదైన రూ.414.48 కోట్ల అధిక ఆదాయాన్ని అధిగమించింది. అలాగే జోన్ 2022 మే నెలలో రూ.1,067.57 కోట్ల సరుకు రవాణా ఆర్జించింది. ఇది ఒక నెలలో సాధించిన ఆదాయంలో ఇది అత్యధికం.
దక్షిణ మధ్య రైల్వే వేసవి కాలంలో ప్రయాణికుల భారీ రద్దీకి అనుకూలంగా సరైన నిర్ణయాలను తీసుకొని 2022 మే నెలలో 66 ప్రత్యేక రైళ్లను (266 ట్రిప్పులను) నడిపించగా, 2.65 లక్షల మంది ప్రయాణించారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి అదనపు కోచులను ఏర్పాటు చేసి ఎక్కువమంది ప్రయాణించేందుకు అవకాశం కలిగించింది. 2022 మే నెలలో 1533 అదనపు కోచులు ఏర్పాటు చేయడంతో మొత్తం 1,14,835 మంది ప్రయాణించారు. ఈ చర్యల ఫలితంగా మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఒక నెలలో రికార్డు స్థాయిలో అత్యధిక ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. జోన్ గతంలోనే కోవిడ్ ముందు నడిపినట్లు అన్ని మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను పునరుద్ధరించిందనేది ఇక్కడ గమనించాల్సిన అంశం.
ఇదే కాలంలో జోన్ సరుకు రవాణాలో నూతన సరుకు రవాణా లక్ష్యాలను జోడిరచి ఈ రంగం పటిష్టతకు చర్యలు తీసుకుంది. ఈ దిశగా నిరాటంకంగా చేపట్టిన కృషితో 2022 మే నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక నెలలో రూ.1,067.57 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నిజానికి, దక్షిణ మధ్య రైల్వేలో 2022 మే నెలలో 11.713 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగింది. ఇది గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండో అత్యుత్తమ లోడిరగ్. నడికుడి నుండి క్లింకర్, రెడ్డిపాలెం మరియు నర్సారావుపేట నుండి మొక్కజొన్న, సదాశివపేట్ రోడ్ నుండి క్వార్ట్జ్ మరియు ట్యాంక్ కంటైనర్లలో సిమెంట్ మొదలగు నూతన రంగాలు సరుకు రవాణాలో జోడిరచబడ్డాయి. అదేవిధంగా 6.037 ఎమ్‌టీల బొగ్గు లోడ్ కాగా, సిమెంట్ (3.147 ఎమ్‌టీలు), ఎరువులు (0.719 ఎమ్‌టీలు) మరియు ఆహార ధాన్యాలు (0.558 ఎమ్‌టీలు) సరుకుల లోడిరగ్ జరిగింది.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) శ్రీ అరుణ్ కుమార్ జైన్ నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మెరుగైన ఆదాయాలను సాధించడానికి కృషి చేసిన ఆపరేటింగ్ మరియు కమర్షియల్ బృందాలను అభినందించారు. బృందం సభ్యులు నిబద్ధతతో అవిశ్రాంతంగా చేసిన కృషితో ఈ విజయాలు సాధ్యమయ్యాయన్నారు. ఇకముందు కూడా ప్రయాణికులతో పాటు సరుకు రవాణా రెండు రంగాలలో అవసరాల మేరకు క్రియాశీలకంగా వ్యవహరించాలని డివిజన్లకు ఆయన సూచించారు.