సింహాచలం అడవివరం గ్రామ పొలిమేర దేవత, సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి సోదరి మరిడమ్మ (సత్తెమ్మ) పండగ ఘనంగా జరిగింది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే మరిడమ్మ పండగ ఎంతో ప్రాచుర్యం పొందింది. అమ్మవారి పండగను వైభవంగా నిర్వహిస్తూ గ్రామ స్తులు తమ సంప్రదాయాన్ని చాటిచెప్పారు.. పైడితల్లమ్మ, బంగారమ్మ, ముత్యాలమ్మ, మరిడమ్మ, రాసపోలమ్మ, పురటాలమ్మ, పోలమ్మ ఏడుగురు అక్కచెల్లె ళ్లు. వీరిలో మరిడమ్మ గ్రామ పొలిమేర దేవతగా విరాజి ల్లుతోంది…
మరిడమ్మ పండుగ గ్రామంలోకి ఎలాంటి క్షుద్రశక్తులు రాకుండా పొలి మేర వద్ద కాపలా అమ్మవారు కాస్తుంటుందని గ్రామస్తుల విశ్వాసం. గ్రామస్తులంతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. అయితే మిగతా అమ్మవార్లెన తమ అక్కచెల్లెళ్లపై ఉన్న ఆప్యాయతతో పొలిమేర నుంచి మరిడమ్మ గ్రామంలోకి వచ్చేస్తుంటుంది. అలా గ్రామంలోకి వచ్చే అమ్మవారిని మళ్లీ పొలిమేరకు గ్రామస్తులంతా సాగునంపుతారు. ప్రతీ ఇంటి నుంచి గ్రామస్తులు వచ్చి అమ్మవారిని సాగనంపే కార్యక్ర మాన్ని ప్రతీ రెండేళ్లకోసారి పెద్ద ఎత్తున పండగ నిర్వహిస్తుంటారు. మరిడమ్మ ప్రతిరూపంగా చెక్కబొమ్మను తనసోదరి అయిన అడవివరంలోని గాంధీనగర్ లో ఉన్న పైడితల్లి సతకంపట్టు వద్దే అప్పటికప్పుడు తయారుచేస్తారు. అక్కడి నుంచి పాత గోశాల వద్ద ఉన్న పొలిమేర దాటించి సమీపంలో ఉన్న అమ్మవారి ఆలయం వద్దకు చేర్చడం జరిగింది. అలా అమ్మవారి చెక్కబొమ్మను పొలిమేరకు సాగనంపే క్రమంలో అనేక దుష్టశక్తులు అమ్మవారిని ముందుకు సాగనీయకుండా అడ్డుపడుతుంటాయి. పొలిమేరకు చేరనీయకుండా వెనక్కు నెట్టేస్తుంటాయి. దీంతో గ్రామస్తులంతా అమ్మవారి వద్దకు ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఈటెలు, కర్రలు వలయంగా పెట్టి పొలిమేరకు తీసుకు వచ్చి భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకున్నారు..