సెల్ఫీల పై మోజుతో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సమీపంలో ఉన్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైనుండి రోషన్ అలీ అనే యువకుడు కింద పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. పదవ తరగతి చదువుతున్న యువకుడు తోటి విద్యార్థులతో కలసి బ్రిడ్జి పై సెల్ఫీలు దిగుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇది గమనించి స్థానికులు కొందరు వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు.
అసలు యువత ఎటుపోతోంది
ఇలాంటి సమయాల్లో వివేకానందుడి మాటలు అందరం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అఫ్ అమెరికా అంటూ తన అద్భుత ప్రసంగంతో పాశ్చాత్యుల అభిమానాన్ని చూరగొన్న భారతీయ తత్వవేత్త, మార్గదర్శి విజ్ఞాన యోధుడు భావితరాలకు గొప్ప దార్శినికుడు. గొప్ప మేధావి స్వామి వివేకానందుడు. భవిష్యత్తు తరాలకు ఆయన ఓ మార్గదర్శి. వివేకానందుడి సందేశాలు సూటిగా యువత హృదయాన్ని తాకుతాయి.ఆలోచనలను రేకిత్తిస్తాయి యువశక్తి తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని వివేకానందుడు పేర్కొన్నాడు. ఆయన యువతకు ఇచ్చి సందేశాల్లో ఇదో మచ్చుతునక. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి. లేవండి…మేల్కోండి!.. మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని ఇతరులను మేల్కొల్పండి… ఇకపై నిద్రించకండి…. మీరు మరణించే లోపే జీవిత పరమావధిని సాధించండి. లేవండి.. మేల్కోండి… గమ్యం చేరేవరకూ ఎక్కడా నిలవకండి.. ఎప్పడూ జాగృతంగానే ఉండండి. బలమే జీవితం, బలహీనతే మరణం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలని వివేకానందుడు కోరుకున్నాడు. దేశ సౌభాగ్యం కోసం భవిష్యత్ కోసం యువత ను ఎప్పుడూ ఉత్సహ పరిచే అయన భారత కీర్తి పతాకగా భరత మాత సిగలో అయన నిలిచిపోయారు.
ఆధునిక యువత పై ఆయనకు ప్రగాఢ నమ్మకం
ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం ఉంది… నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తి చేసేది వారే, అలాంటి యువత ముందు బలిష్టంగానూ, జవ సంపన్నులుగానూ, ఆత్మ విశ్వాసులుగానూ, రుజువర్తనులుగానూ మారాలి. ఇలాంటి యువత వందమంది ఉన్నా చాలు, ఈ ప్రపంచాన్నే మార్చేయవచ్చని యువశక్తిని స్వామి వివేకానంద కొనియాడారు.
మీరంతా మహత్కార్యాలు సాధించడానికే జీవించామని విశ్వసించండి. బలం, శక్తి మీలోనే ఉన్నాయని గుర్తించండి. విశ్వాసంతో లేచి నిలబడి ధైర్యంగా బాధ్యతలను మీ భుజ స్కంధాలపై వేసుకోండి. భవిష్యత్తుకు మీరే బాధ్యులమని తెలుసుకోండి…. ప్రారంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలను సాధిస్తారు…. సాహసంతో పని చేయండి అంటూ నిద్రాణమైన ఉన్న యువతను మేల్కొలిపాడు.
నిజంగా ఆ స్ఫూర్తి ఉందా ?
వాస్తవానికి స్వాతంత్ర స్పూర్తితో ఎదగాల్సిన యువతరం నేడు ఆ దారి నుండి మళ్లుతోంది పాశ్చాత్య కల్చర్ మోజులో పడి సర్వస్వం కోల్పోతున్నారు పబ్ డ్రగ్ కల్చర్ తో పాటు మత్తుకు బానిసవుతున్నారు దీంతో పాటు మృగాళ్ళులా తయారయ్యి అభం శుభం తెలియని పిల్లపై ఆడవారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు దీన్ని అందరు ముక్త కంఠం తో ఖండించాల్సిన వసరం ఎంతైనా ఉంది.మరి కొంత మంది డబ్బు మోజులో పడి జల్సాలకు అలవాటు పడి వ్యసనాలకు బానిసై సర్వస్వము కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండటంతో ఆ ప్రాంతంలో పోలీస్ లు ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా యువత అతిగా సెల్ఫీ ల మోజులో పడవద్దని ప్రాణాలు పోగొట్టుకోవద్దని ఇలాంటివి మానసిక దుర్బలత్వానికి సంకేతమని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.