రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అయితే యూత్ ఫోకస్ అంతా కొడాలి నాని మీద ఉంది. వైసీపీ మద్దతుదారులేమో కొడాలి నానిని ఎవరూ ఓడించలేరని సవాల్ చేస్తుంటే.. వ్యతిరేకులు మాత్రం ఈసారి కొడాలి నాని ఓడిపోవటం ఖాయమని అంటున్నారు. ఇంతకీ అభ్యర్ధి ఎవరు అంటే మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. కొడాలి నాని గెలవటానికి అక్కడ లోకల్ గా తనకున్న బలం, తన సామాజికవర్గం, దూకుడుతో వచ్చిన యూత్ ఫాలోయింగ్. అందుకే కొడాలి నాని.. పార్టీ ఏదైనా సరే.. వ్యక్తిగతంగా తనకున్న బలంతోనే గుడివాడలో వరుసగా గెలుస్తున్నారు.
కాని ఇఫ్పుడు ఓడిపోవడానికి కావాల్సినన్ని కారణాలు ఉన్నాయని ప్రత్యర్ధులు అంటున్నారు. ముఖ్యంగా కొడాలి నాని ఈసారి మంత్రి పదవిలో ఉన్నా… బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నారని అంటారు. ఆయన ప్రత్యేకంగా చంద్రబాబునాయుడిని, లోకేష్ ను తిట్టడానికే తన టైమ్ అంతా కేటాయించారు. దీంతో ఆయన సొంత సామాజికవర్గంలోనే వ్యతిరేకత పెరిగందంటున్నారు. ఇది మొదటి కారణం. ఇక వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయకుండా.. కేవలం సంక్షేమ పథకాల పేరుతో అకౌంట్లలో డబ్బులు వేయడానికే పరిమితం అయిందని.. కాని గుడివాడలో రోడ్లు ఉన్నంత దారుణంగా ఎక్కడా ఉండవని జనం అంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఒకసారి దీనిపై ప్రత్యేకంగా కామెంట్ చేశాడు. అయినా రోడ్లు బాగుపడింది లేదు.
ఇక అమరావతి ఎఫెక్టుతో కృష్ణాజిల్లాలో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉందని అంటున్నారు. దీని ప్రభావం కూడా గుడివాడలో బాగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. మరో ముఖ్యమైన కారణం.. ఆయనకు మంత్రి పదవి పోవడం. ఎందుకంటే జగన్ సర్వే చేయించుకున్నాకే.. మంత్రివర్గంలో మార్పులు చేశారు. అందులో ఓడిపోతారు.. వ్యతిరేకత వచ్చినవారికే ఊస్టింగ్ అయ్యాయి మంత్రి పదవులు. కాబట్టి కొడాలి నానిపై వ్యతిరేకత ఉందన్న విషయం వైసీపీ వారికే బాగా తెలుసని కూడా చెప్పుకుంటున్నారు.
మరి కొడాలి నానిని ఓడించే అభ్యర్ధి ఎవరు? గత ఎన్నికల్లో ప్రత్యేకంగా దేవినేని అవినాష్ ని తెచ్చి అక్కడ పోటీకి దింపారు తెలుగుదేశం వాళ్లు. కాని ఓడిపోయాడు. పైగా ఇప్పుడు వైసీపీలో చేరిపోయి.. విజయవాడ ఎంపీ లేదా.. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో దగ్గుబాటి పురందేశ్వరి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆవిడ ఎన్టీఆర్ ఫ్యామిలీ కావడం.. సామాజికవర్గం ఒకటే కావడంతో పాటు.. ఆమెకు కాస్త మంచి పేరు ఉంది. గుడివాడలో ఎన్టీఆర్ అభిమానులు చాలామంది కొడాలి నానితో ఉన్నారు. వారంతా డైలమాలో పడిపోయే ఛాన్స్ ఉంది. దగ్గుబాటి కుటుంబానికి చంద్రబాబుకు సయోధ్య కుదిరితే.. అదే జరగబోతుందని చెప్పుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు నాని అనుచరులు జనసేనలో చేరారు. ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుందని అంటున్నారు. ఉండటానికి వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశంలో ఉన్నా.. ఆయన కొడాలి నానికి క్లోజ్ ఫ్రెండ్. కాబట్టి ఆయనకు వర్కవుట్ అవదు. మొత్తం మీద అటు తెలుగుదేశం, ఇటు జనసేన రెండూ గుడివాడపై ఫోకస్ పెట్టాయి. కరెక్ట్ క్యాండేట్ ను పెట్టి.. కొడాలి నానిని ఏమైనా ఈసారి ఓడించాలని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాయని చెప్పుకుంటున్నారు.
In this article:ap, cm, daggubatipurandheswari, devineniavinash, Featured, jagan, kodalinani, ycp

Click to comment