రైతులకు మేలు చేయడంలో ప్రతిపక్షాలతో కాదు..దేశంతో పోటీ పడుతున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఏరువాకతో సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించారు. దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని చెప్పారు. మూడేళ్లలో రైతన్నల కోసం లక్షా 28 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అన్నదాతలకు అండగా నిలిచిన ప్రభుత్వం మనదని వైయస్ జగన్ మోహన్ రెడ్డి సగర్వంగా చెప్పారు. 2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేశారు.
దేవుడి దయతో ఈ రోజు ఇక్కడ కొత్త జిల్లా స్థాపించిన తరువాత సత్యసాయిబాబా జిల్లాగా పేరు పెట్టి ఇక్కడికి రావడం..2978 కోట్ల మేరకు అక్షరాల రూ.15.60 లక్షల మంది రైతులకు మేలు చేస్తూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతోంది. ఇంతకు ముందు నానుడి ఉండేది. రాయలసీమ అంటే కరువు సీమ అని..అనంతపురం జిల్లాను ఏకంగా ఎడారి జిల్లా అనేవారు. కానీ ఈ రోజు దేవుడి దయవల్ల అలాంటి వాతావరణం మారిపోయింది. దారాళంగా గంగమ్మ పైకి లేచినట్లుగా ఈ రోజు నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. రిజర్వాయర్లు దేవుడి దయతో నిండాయి. దేవుడి దయతో చెరువులు నిండాయి. గంగమ్మ తల్లి మనందరికీ కూడా కనిపిస్తోంది.
ఈ రోజు ఇక్కడ రూ.2900 కోట్లు బీమా పరిహారంగా 15.60 లక్షల మంది రైతులకు మేలు చేస్తూ ఈ కార్యక్రమం తలపెట్టాం. ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇన్సూరెన్స్ కింద వస్తున్న సొమ్ము అక్షరాల రూ.880 వేల కోట్లు అందుతున్నాయి. అప్పట్లో నాన్నగారి హాయంలో 800 కోట్లు ఇవ్వడం చూశామని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. అంతకుమించి ఈ రోజు మీరు ఇస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు.
ఒక్కసారి మార్పును గమనించండి
గతంలో పంట నష్టపరిహారం వస్తుందో, రాదో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఏ సీజన్‌లో నష్టం జరిగితే మళ్లీ మరుసటి ఏడాది అదే సీజన్ రాకముందే ఇన్సూరెన్స్ సొమ్ము నేరుగా మీ ఖాతాల్లోకి వస్తుంది. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాబితాను ప్రదర్శిస్తున్నాం. మార్పులను గమనించాలని మీ అందరిని కోరుతున్నా.
పంటలకు బీమా ఉండకపోతే, ఆ బీమా అందకపోతే రైతు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో గత పాలనలో చూశాం. పంట నష్టపోతే, రైతు నష్టపోతే ఆ రైతు కుటుంబాలే కాదు..రాష్ట్రం మొత్తం కూడా నష్టపోతుంది. రైతును ఆదుకోవాలని ఉచిత పంటల బీమాపై ప్రత్యేక ధ్యాస పెట్టాం. కరువు,వరదో, తెగులో మరో ఏ కారణంగా నష్టపోయిన రైతుకు మనందరి ప్రభుత్వం గడిచిన మూడేళ్లుగా ఎంత తోడుగా, అండగా నిలబడిందో రెండు మాటల్లో చెబుతాను.
ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా
గత టీడీపీ పాలనలో అక్షరాల ఐదు సంవత్సరాలకు కలిపి పంటల బీమా కింద 30.85 లక్షల మంది రైతులకు రూ.3411 కోట్లు మాత్రమే. ఈ రోజు మీ బిడ్డ పాలనలో ఏం జరుగుతోందో గమనించమని కోరుతున్నాను. ఈ మూడేళ్లలో అక్షరాల 44.28 లక్షల మంది రైతులకు ఉచితంగా ప ంటల బీమా చేయించడమే కాకుండా రూ.6,685 కోట్లు ఇచ్చామని సగర్వంగా చెబుతున్నాను. తేడాను గమనించమని కోరుతున్నాను.
చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు గతంలో అనంతపురం జిల్లాలో పర్యటించారని, ఆత్మహత్య చేసుకున్న రైతుకు నష్టపరిహారం అందని వారిని ఒక్కరిని కూడా చూపించలేకపోయారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాను సవాలు చేసినా వారిద్దరూ స్పందించలేదని చెప్పారు. అంత పారదర్శకంగా తాము రైతుల పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో చంద్రబాబు హాయాంలో రైతు బీమా డబ్బులు చాలా మందికి ఇవ్వలేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను పరామర్శించాలన్న ఆలోచన దత్తపుత్రుడికి ఎందుకు రాలేదని అన్నారు.
‘‘గతంలో చంద్రబాబు ఎన్నికల్లో హామీలిచ్చి రైతులను మోసం చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. చంద్రబాబుకు ఏం చేస్తే మంచి జరుగుతుందో లెక్కలు వేసుకొని పరిగెత్తే వ్యక్తి దత్తపుత్రుడు. వీరిద్దరూ రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా అని నేను అడుగుతున్నాను. ఎన్నికల మేనిఫెస్టోను పక్కన పారేసి మోసం చేసే వ్యక్తి చంద్రబాబు.ఒకప్పుడు అనంతపురం కరువు జిల్లా అని అన్నారు. ఇవాళ దేవుడి దయ వల్ల నీళ్లు కూడా పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి.’’ అని జగన్ అన్నారు. గతంలో రైతులకు ఇస్తామన్న బీమా సొమ్మును చంద్రబాబు ఇవ్వకుండా పోయారని గుర్తు చేశారు. అప్పటికి ఇప్పటికీ మార్పును గమనించాలని కోరారు.
పంటల బీమా చెల్లింపు వివరాలు- గత ప్రభుత్వం
2014 – 15 లో 1.03 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 132.24 కోట్ల పరిహారం
2015 –16 లో 4.35 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 339.70 కోట్ల పరిహారం
2016 – 17 లో 8.70 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 954.75 కోట్ల పరిహారం
2017 – 18 లో 6.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 720.60 కోట్ల పరిహారం
2018 – 19 లో 10.00 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 1,263.91 కోట్ల పరిహారం ( ఈ ఏడాది పూర్తిగా చెల్లించలేదు)
మొత్తం 30.85 లక్షల మంది లబ్ధిదారులకు 3,411.20 కోట్ల పరిహారం
శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం
శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించిన గత ప్రభుత్వ బకాయిలు 6.19 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 715.84 కోట్ల పరిహారం
2019 – 20 లో 9.48 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 1,252.18 కోట్ల పరిహారం
2020 – 21 లో 13.00 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 1,739.00 కోట్ల పరిహారం
2021 – 22 లో 15.61 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 2,977.82 కోట్ల పరిహారం.
మొత్తం 44.28 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 6,684.84 కోట్ల పరిహారం
ఈ నెల 22న ఏపీ కేబినెట్ భేటీ
ఈ నెల 22న ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.