పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్నివిధాలా సాయపడుతుందని సీఎం జగన్ అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రామ్‌కో సిమెంట్ పరిశ్రమను సీఎం జగన్ ఈ రోజు ప్రారంభించారు. వరుసగా మూడో ఏడాది కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రామ్‌కో పరిశ్రమతో స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయని సీఎం జగన్ అన్నారు.
పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం పూర్తి చేయూతనిస్తోంది. ఒక పరిశ్రమ వచ్చిందంటే అనేక ప్రయోజనాలు వస్తాయి.రామ్‌కో పరిశ్రమతో స్థానికులకు ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. పరిశ్రమలకు ప్రభుత్వం అన్నివిధాలుగా సహకారం అందిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడో ఏడాది ప్రథమంగా ఉన్నాం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ప్రథమ స్థానంలో ఉంటున్నాం అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
నంద్యాల జిల్లా, కొలిమిగుండ్లలో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్. #CMYSJagan #BuildAP #InvestInAP pic.twitter.com/PYjwiffw31
— YSR Congress Party (@YSRCParty) September 28, 2022
టైటిల్: ఈ యేడు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం ప్రధమ స్థానంలో ఉన్నాం: సీఎం జగన్