విజయనగరం : అధికారపార్టీకి చెందిన ఇద్దరు కీలక ఎంపీలు తమపరపతిని ఉపయోగించి ప్రజలకు ఏమి చేశారో తెలీదు కానీ ఫెసుబుక్కు ట్విట్టర్లలో మాత్రం బీరాలు బాగానే పలుకుతున్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు విశాఖను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్న విజయ సాయి రెడ్డి గత కొన్ని నెలలుగా ఉప్పూ నిప్పూ మాదిరిగా ఒకరిమీద ఒకరు చితపటలాడుతున్నారు.
పార్లమెంట్ సభ్యులన్న తరువాత కాసింతైనా హుందాతనం ఉండాలన్న సోయి లేకుండా నోటికొచ్చినట్లు మాటలు విసురుకోవడం చూస్తుంటే రాజకీయాలు ఇంత నాసిరకమా అనిపిస్తోంది. ఎంపీగా గెలిచిన రోజునుంచి పార్టీలో అసమ్మతి రాగాన్ని అలపించే రఘురామ కృష్ణం రాజు అంటే మొదటినుంచి విజయసాయికి కుదరడం లేదు. దీంతో ఆయన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు.పోనీ విధానపరమైన విమర్శలు చేశారంటే అర్థం ఉంది. దానివల్ల సదరు నాయకుడు పొరపట్లను దిద్దుకునే వీలుంటుంది. ఫైనల్ గా ప్రజలకు . సమాజానికి మేలు కలుగుతుంది. కానీ ఇక్కడ ఈ ఇద్దరు ఎంపీలు పూర్తిగా వ్యక్తిగత ఆరోపణలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
రఘురామరాజు విగ్గు పెడతారని అంటూ విజయసాయి పోష్టులు పెడుతుండగా ఎస్..అది నా ఇష్టం .. దమ్ముంటే వచ్చి చూసుకో అన్నట్లుగా ఆయన సమాధానం ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ రాయలేని విధంగా బూతులు..అసభ్యపదాలు వాడుతూ దాడులుచేసుకుంటున్నారు. మొత్తానికి వీళ్ళిద్దరూ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ఏమి చేశారంటే చెప్పడానికి ఏమి లేదు. ప్రభుత్వపరంగా వచ్చే పెన్షన్లు..అమ్మఒడి, రైతు భరోసా, ఇల్లు వంటివి కాకుండా ఈ ఇద్దరు ఎంపీలు వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేసిన పని ఒక్కటీ లేదని ప్రజలే అంటున్నారు.
నరసాపురం..విశాఖపట్నం.. ఈ రెండు పట్టణాలూ సముద్రపు తీరాన ఉన్నావ్. కాబట్టి టూరిజం ఇంకా మత్స్యకారుల సంబంధ అంటే చేపలు..రొయ్యలు..సముద్ర ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు.. అనుబంధ పరిశ్రమలు వంటివి ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నా వీరు అటువైపు దృష్టి పెట్టనేలేదు. ఈ విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టి ఆయా రంగాల్లో పెట్టుబడులు వచ్చేలా చేసిందీ లేదు. కేవలం ఒకరిమీద ఒకరు బురద పోసుకోవడానికి..ట్విట్టట్, ఫెసుబుక్ లో పోష్టులు పెట్టడానికి తప్ప ఈ నాయకులు ఎందుకూ పనికిరాకుండా పోయారని అంటున్నారు.