యువకుడిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు హుకుం జారీ…ప్రజలు ప్రశ్నిస్తే అరెస్టులా -పోతిన
గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో తాజా మాజీ మంత్రి వెల్లంపల్లి కి ఎదురుదెబ్బ తగిలింది. గడప గడపకూ వెళ్లిన సమయంలో మీరు పదిహేను వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఓ ఇంజనీర్ వెల్లడించారు. దీంతో వెల్లంపల్లి రెచ్చిపోయారు. వెంటనే స్థానిక సీఐని పిలిపించి సదరు ఇంజినీర్‌ను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సాక్ష్యాలు లేకుంటే కేసు పెట్టాలని హుకుం జారీ చేశారు. ఎవడో చెప్పింది విని మాట్లాడవద్దని వెల్లంపల్లి అనుచరులు సైతం ఇంజినీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీర్ మాటలకు కంగుతిన్న వెల్లంపల్లి అనుచరులు హంగామా సృష్టించారు. ఇంజినీర్ వ్యాఖ్యలతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. పోలీసులు ఇంజనీర్‌ను ప్రశ్నిస్తున్నారు…
ప్రజలు ప్రశ్నిస్తే అరెస్టులా -పోతిన వెంకట మహేష్
స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించిన ఇంజనీర్ నాగబాబు పై కేసులు మోపాలని హుకుం జారీ చేసిన వెల్లంపల్లి తీరును జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఖండించారు. విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నాగబాబు ను పరామర్శించిన అధికారులతో మాట్లాడి తక్షణమే నాగబాబు విడిపించి బయటికి తీసుకు వచిన పోతిన మహేష్. పోతిన మహేష్ మాట్లాడుతూ ప్రశ్నించే ప్రతి గొంతును అరెస్టు చేస్తే పోలీస్ స్టేషన్ లు చాలవని సమాధానం చెప్పలేకే వెల్లంపల్లి పారిపోయారన్నారు. వెల్లంపల్లి అవినీతి అక్రమాలు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా ప్రశ్నించినందుకు ఆగ్రహంతో ఊగిపోయారన్నారు. ప్రశ్నించే గొంతులను పోలీసు వారిని అడ్డంపెట్టుకుని అరెస్టు చేస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సామాన్య ప్రజల తరఫున ఎంత వరకైనా పోరాటం చేస్తామన్నారు. వెల్లంపల్లి ఇదే చివరి ఎన్నికలని రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. గెలిచేది జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్ అని వెల్లంపల్లి అవినీతిపై తప్పక విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక పాలన పై ఇది ప్రజల తిరుగుబాటు అని రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పదన్నారు.
మాజీ మంత్రి వెలంపల్లి స్పందన
నేను అవినీతి చేశాను అని ఎవరైనా నిరూపించకలిగితే నేను రాజకీయల నుండి తప్పుకుంటా అని తెలిపారు. అర్హత వున్నా ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకం అందాలనేదే జగన్నా లక్ష్యం. అన్ని శాఖల సమన్వయంతో పర్యటించి అక్కడిక్కడే ప్రజా సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. ప్రజలు ప్రతిపక్షాలు చేప్పే మాటలను త్రిప్పికొట్టి మాకు అడుగు అడుగున హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ప్రజలు మాతో వున్నత సేపు ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని కూతంతరాలు పన్నినా ఏమి చేయలేవు. నా పైన కానీ ప్రభ్యుత్వం పైన గాని అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. జగనన్న నాయకత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేందుకు కృషి చేయడం జరుగుతుంది. ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తున్న జగనన్నకు ప్రజలు జైజైలు పలుకుతున్నారు. ప్రతిపక్షాలు చేసే చౌకబారు ఆరోపణలు మానుకోవాలి లేకపోతే సరైన రీతిలో బుద్ధి చెపుతాము..