ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకంలో ఈ సారి లబ్దిదాలు సంఖ్యను తగ్గించారు. అర్హతా నిబంధనలు సాధించలేకపోవడంతో అమ్మఒడి పథకం మూడో విడత సాయంలో 1.29 లక్షల మంది తల్లులకు ప్రభుత్వం కోత పెట్టాలని నిర్ణయించింది. అమ్మఒడి పథకం పొందాలంటే మొత్తం పన్నెండు రకాల షరతులు పూర్తి చేసి ఉండాలి. పాఠశాలలకు వెళ్లకపోవడంతో 51 వేల మందిని అమ్మఒడికి అనర్హులుగా గుర్తించిన జగన్ ప్రభుత్వం. ఈ ఏడాది వేర్వేరు కారణాలతో మరో 50 వేల మందికి అమ్మఒడి నిలిపివేసింది. అంతేకాదు ఈ ఏడాది అమ్మఒడి కింద రూ.13 వేల చొప్పున మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇందుకు ఈ పథకం కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.6500 కోట్లను కేటాయించింది.
జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల్లో అమ్మఒడి ఒకటనే సంగతి తెలిసిందే. విద్యార్థులను బడి బాటపట్టించేందుకు ప్రోత్సాహకంగా ఈ పథకం కింద ప్రభుత్వం.. తల్లుల ఖాతాలో ఏటా రూ.15 వేలు జమ చేస్తోంది. ఈ ఏడాది అమ్మ ఒడి నిధులను జూన్ 27వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.6500 కోట్లను కేటాయించింది. కాగా.. కరెంట్ వాడకం నెలకు 300 యూనిట్లు దాటిన వారికి.. 75 శాతం హాజరు లేకపోయినా అమ్మఒడి అందదని విద్యాశాఖ ఇటీవల స్పష్టం చేసింది. రేషన్ కార్డు కొత్తది ఉండాలని.. కొత్త జిల్లాల నేపథ్యంలో ఆధార్‌లో జిల్లా పేరును మార్చుకోవాలని సూచించింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకు చేసుకోవాలని అకౌంట్ పని చేస్తుందో లేదో చెక్ చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది. అంతేకాదు ఈ ఏడాది అమ్మఒడి కింద రూ.13 వేల చొప్పున మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
మరి మీ పేరు ఏ జాబితాలో ఉందో తెలుసుకున్నారా ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకంలో ఈ సారి లబ్దిదాలు సంఖ్యను తగ్గించారు. అర్హులు తగ్గిపోయారని ప్రభుత్వం చెబుతోంది. అర్హతా నిబంధనలు సాధించలేకపోవడంతో అమ్మఒడి పథకం మూడో విడత సాయంలో 1.29 లక్షల మంది తల్లులకు ప్రభుత్వం కోత పెట్టాలని నిర్ణయించింది. కోవిడ్ కారంణంగా పాఠశాలలకు గైర్హాజరు కావటంతో 51 వేల మందికి అమ్మఒడి పథకానికి అనర్హులుగా ప్రభుత్వం తేల్చింది. మిగతా 50 వేల మంది పైచిలుకు విద్యార్ధులకు వేర్వేరు కారణాలతో పథకం నిలిపివేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అర్హుల జాబితాను పంపించిన ప్రభుత్వం అనర్హుల జాబితాను మాత్రం ఇవ్వలేదు. లబ్దిదారుల జాబితాలో ఉన్న వారు తప్ప మిగతా వారంతా అనర్హులేనని ప్రభుత్వం ప్రకటించింది.
అమ్మ ఒడికి 12 షరతులు !
అమ్మఒడి పథకం పొందాలంటే మొత్తం పన్నెండు రకాల షరతులు పూర్తి చేసి ఉండాలి. 75 శాతం హాజరు, కొత్త బియ్యం కార్డు, కరెంట్ బిల్లు 300 యూనిట్లు కన్నా తక్కువ వాడి ఉండాలి, తల్లి, విద్యార్తి ఒకే ఇంట్లో ఉండాలి, విద్యార్థి ఈకేవైసీ, వాలంటీర్ దగ్గర వివరాలు చెకింగ్, బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులుంచుకోవడం , బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లిం్ చేసుకోవడం ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ తో లింక్ చేసుకోవడం వంటివన్నీ చేయాలి. బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో ఉండాలని ఒక వ్యక్తికి రెండు కన్నా ఎక్కువ అ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లయితే ఎన్‌పీసీఐ చేయించుకోవాలని చేపించుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగి, ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి జగనన్న అమ్మ ఒడి వర్తించదు . ఈ నిబంధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లక్షమందికి పైగా విద్యార్థులు అమ్మఒడి పథకానికి అనర్హులయ్యారు.
ఈ ఏడాది రూ. 13 వేలు మాత్రమే !
ఈ నిబంధనల్లో ఏ ఒక్కటి లేకపోయినా అమ్మఒడి రాదు. ఒకవేళ తప్పుడు వివరాలు ఇచ్చి ఉంటే క్రిమినల్ కేసులు పెడతారు. కొత్త జిల్లాల వారీగా ఆధార్ కార్డు మార్చుకోవాల్సి ఉందన్న షరతు కూడా పెట్టారు. ఇన్ని షరతులు పూర్తి చేసిన వారికే అమ్మఒడి వస్తుంది. ఈ అర్హతలు ఉన్న వారందరికీ అమ్మఒడి ఇస్తున్నామని విద్యా శాఖ అధికారులు ప్రకటించారు. ఈనెల 27న అమ్మఒడి పథకం నిధుల ప్రభుత్వం విడుదల చేయనుంది. ప్రతి సంవత్సరం రూ.15 వేలు తల్లుల ఖాతాలో వేసే ప్రభుత్వం ఈ ఏడాది రూ.13 వేలను ప్రభుత్వం జమ చేయనుంది. నిర్వహణ పేరుతో రూ.2వేల కోత పెట్టింది. .
అర్హులందరికీ ఇస్తున్నామన్న ప్రభుత్వం
అమ్మఒడి పథకం గత ఏడాది జనవరిలో ఇచ్చారు. మళ్లీ ఈ ఏడాది జనవరిలో ఇవ్వాల్సి ఉంది. కానీ జూన్‌కు వాయిదా వేశారు. ఈ క్రమంలో ఈసారి పెద్ద ఎత్తున లబ్దిదారులకు కోత పడుతూండటంతో పలువురిలో ఆందోళన నెలకొంది. తమకు నిధులు వస్తాయా రావా అని ఎక్కువగా వాకబు చేస్తున్నారు. లబ్దిదారుల జాబితాలో పేర్లు లేని వారు సచివాలయాలు, వాలంటీర్లను నిలదీస్తున్నారు.
దళిత విద్యార్థికి స్కాలర్‌షిప్ వస్తే.. ఆ మొత్తం కటింగ్
అమ్మఒడి పథకం మూడో విడత సాయంలో లక్ష మందికిపైగా అనర్హుల జాబితాలోకి చేర్చిన ప్రభుత్వం.. అర్హులకు ఇచ్చే మొత్తంలో సైతం కోత పెట్టేందుకు కొత్త దారులు వెదుకుతోంది. కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థల ద్వారా దళిత విద్యార్థులెవరైనా స్కాలర్‌షి్‌పలు పొందుతుంటే.. అలాంటి విద్యార్థులకిచ్చే అమ్మఒడిలో ఆ మొత్తం కోత పెట్టాలని నిర్ణయించింది. అది మినహాయించుకుని మిగిలిన సొమ్ము మాత్రమే తల్లుల ఖాతాల్లో వేసేందుకు సిద్ధమైంది. అమ్మఒడికి సంబంధించిన అర్హుల జాబితా గ్రామ, వార్డు సచివాలయ కేంద్రాలకు చేరింది. వాటిలో అనర్హుల జాబితా చూసి అక్కడ పనిచేసే సచివాలయ సిబ్బంది సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమకు అమ్మఒడి ఎందుకు తక్కువగా వచ్చిందని ప్రశ్నించే లబ్ధిదారులకు ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు.
27న అమ్మఒడి
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27న అమ్మఒడి పథకానికి ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి తల్లుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమ్మఒడి కోసం దరఖాస్తులు స్వీకరించడం, గతంలో అనర్హత ఉంటే వాటికి కారణాలను సరిచేసి మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, ఆరంచెల వడపోత విధానం ద్వారా ప్రతి దరఖాస్తుల అర్హతను పరిశీలించడం తదతర ప్రక్రియలు చేపట్టి.. తాజాగా అర్హుల జాబితాను రూపొందించారు. ఈ జాబితా చూసిన లబ్ధిదారులతో పాటు సచివాలయ సిబ్బంది సైతం అవాక్కయ్యారు. అమ్మఒడి ఎంపికలో అడ్డగోలు విధానాలు అవలంబించారని, అర్హత కలిగిన సగం మంది లబ్ధిదారులు ఈ సారి అమ్మఒడిలో అనర్హులైనట్లు చూసి గగ్గోలు పెడుతున్నారు. కొత్తగా కొంతమందిని అర్హులుగా చేర్చినప్పటికీ.. గతంలో అమ్మఒడి అర్హుల్లో చాలామందికి ఈ సారి మొండిచేయి చూపారని చెప్తున్నారు. గతేడాది 44,48,865 మందికి అమ్మఒడి అందింది. కానీ ఈ ఏడాది 43,19,090 మందికే మంజూరయినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు 1.29 లక్షల మందికి కోతపడింది.
ఎస్సీ విద్యార్థుల అమ్మఒడిలో కోత…కేంద్ర సామాజిక, సాధికారత మంత్రిత్వశాఖ అందిస్తున్న స్కాలర్‌షిప్పులతో పాటు పలు ప్రఖ్యాత సంస్థల నుంచి స్కాలర్‌షిప్పులు అందుకుంటున్న అమ్మఒడి లబ్ధిదారులకు ఇస్తున్న రూ.13 వేలల్లో కోత పడింది. గతంలో రూ.15 వేలు ఇస్తామని ప్రకటించిన జగన్ ఆ తర్వాత అందులో రూ.1000 ఆయా పాఠశాలల నిర్వహణ, పారిశుధ్యం కోసం ఇవ్వాలని సూచించారు. ఈ సారి ఆ మొత్తాన్ని రూ.2 వేలు చేశారు. అంటే అమ్మఒడి లబ్ధిదారులకు రూ.13 వేలు మాత్రమే అందిస్తారు.
అమ్మఒడి పథకంలో కొత్త కొత్త నిబంధనలు పెట్టి ప్రభుత్వం వడపోతకు శ్రీకారం చుట్టింది. అద్దె ఇళ్లలో ఉంటున్న పలు కుటుంబాలు ఈ సారి అమ్మఒడికి అనర్హులుగా మారారు. గత రెండు దఫాలు అమ్మఒడి పొందిన వారు ఈ సారి జాబితా నుంచి గల్లంతయ్యారు. ఇంటి విద్యుత్ మీటర్లు ఆయా ఇంటి ఓనర్ల ఆధార్‌తో లింక్ చేయడం ఆనవాయితీ. విచిత్రంగా అమ్మఒడిలో అనర్హుల సంఖ్యను పెంచేందుకు నిబంధనలు మార్చారు. ఆయా ఇళ్లల్లో ఉంటున్న అద్దెదారుడి ఆధార్‌తో మీటర్‌ను లింక్ చేశారు. దీంతో ఇల్లు మారినప్పుడల్లా ఆయా అద్దెదారుడి ఆధార్‌తో లింక్ అయిన మీటర్ల సంఖ్య పెరిగింది. ఆయా మీటర్ల రీడింగ్ ఆధారంగా అమ్మఒడికి వారిని అనర్హులను చేశారు. ఆరంచెల వడపోత విధానంలో ఎవరైనా 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించి ఉంటే అలాంటి కుటుంబాలకు నవరత్నాలేవీ దక్కవు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అద్దె ఇళ్లల్లో నివశిస్తున్న పలువురు పట్టణ వాసులు అమ్మఒడిలో అర్హత కోల్పోయారు. గతంలో అమ్మఒడి లబ్ధిదారులు ఇప్పడు తమ పేరు అనర్హుల జాబితాలో రావడంపై గ్రామ, వార్డ్ సచివాలయ సిబ్బందిని నిలదీస్తున్నారు. దీంతో ఏం సమాధానాలు చెప్పాలో?, ఎవరికి చెప్పాలో? అర్థం కాని పరిస్థితిలో సిబ్బంది ఉన్నారు.
అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవం
పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు అమ్మఒడి పథకం ద్వారా అందిస్తారు. ప్రతి తల్లి తన పిల్లలను సంతోషంగా స్కూల్ పంపడానికి, బాలల భవిష్యత్తుకు మంచి పునాది ఏర్పాటు చేయడమే ఈ పథకం లక్ష్యం
అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.అటెండెన్స్ ఆధారంగా అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కు పంపితేనే పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. రూ.2 వేలు కోత అనేది పాఠశాల నిర్వాహణ కోసం ఖర్చు చేస్తామన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. ..అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవం. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు హాజరు శాతం ఆధారంగానే అమ్మ ఒడి లబ్ధిదారుల ఎంపిక జరిగింది. పిల్లలను సక్రమంగా స్కూల్‌కి పంపితే పథకం వర్తిస్తుంది. ఎవరైతే స్కూల్‌కు సక్రమంగా వస్తూ, 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేస్తున్నాం. ఇదే విషయాన్ని గతంలో ముఖ్యమంత్రి, అప్పటి విద్యాశాఖ మంత్రి కూడా అనేకమార్లు స్పష్టం చేశారు, ఇదేమీ కొత్త విషయం కాదు. ఇప్పుడు విద్యా శాఖ మంత్రిగా నేను కూడా అదే చెబుతున్నాను. స్కూల్‌కు వెళ్లకుండా అమ్మ ఒడి పథకాన్ని ఇవ్వాలంటే ఎలా ఇస్తాం. స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఉండకుండా ప్రతి ఒక్క విద్యార్థి చదువుకునేలా ప్రోత్సహించేందుకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించినప్పుడే అమలుపై మార్గదర్శకాలను స్పష్టంగా చెప్పడం జరిగింది.
పిల్లలను బడికి పంపించండి.. అమ్మ ఒడిని సద్వినియోగం చేసుకోండి
మీ పిల్లలను బడికి పంపించండి. అమ్మ ఒడిని సద్వినియోగం చేసుకోండి అని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఇస్తున్న ఈ సౌకర్యాన్ని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలి అని కోరుతున్నాం. స్కూళ్ళకు పంపడం ద్వారా మీ పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పండి. వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దండి. పిల్లలను చదివించేందుకు, వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. నాడు-నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్, ప్రయివేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. విద్యా బోధనతో పాటు, బైజూస్ ద్వారా, వారిలో నైపుణ్యాన్ని పెంచుతున్నాం.
ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత శాతం తగ్గలేదు
ఈ ఏడాది ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత శాతం తగ్గలేదు. 2019 సంవత్సరంలో కంటే ఇప్పుడు ఇంటర్ ఉత్తీర్ణత శాతం పెరిగింది. కొవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి ఫలితాలలో ఉత్తీర్ణత శాతం తగ్గితే, ఇప్పుడు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తూ అదే స్టేటస్‌ను ఇస్తున్నాం. ఉపాధ్యాయుల కొరత ఉంటే తీరుస్తాం. పాఠశాలు, కళాశాలల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. పాఠశాలలల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు, వాచ్ మెన్ ఇతర సౌకర్యాల ఏర్పాటు, వాటి నిర్వహణ కోసమే రెండు వేల రూపాయిలు తీసుకోవడం జరుగుతుంది..
పథకాల్లో కోతతో మహిళలకు అన్యాయం – వంగలపూడి అనిత
సంక్షేమ పథకాల్లో కోత పెట్టి మహిళలకు ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. అమ్మఒడి పథకం నుంచి లక్షలాది మందిని తొలగించారన్నారు. ఇంటర్ ఫలితాలు ఇంత ఘోరంగా ఎప్పుడూ రాలేదని చెప్పారు. ఇంటర్ విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు చెల్లించే ఫీజుతో అమ్మఒడి పథకానికి సరిపడా డబ్బులు వచ్చేస్తాయని ఆశిస్తున్నారా ? అని మండిపడ్డారు. ఇంటర్ సప్లిమెంటరీకి ఫీజు రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.