గంటా శ్రీనివాసరావు.. వాటం ఎటు ఉంటే అటు ఉండే టైప్ అని ఇప్పటికే బాగా పేరొచ్చింది. ప్రజారాజ్యం తరపున గెలిచి కాంగ్రెస్ లో కలిసి.. మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరి మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత వైసీపీలో కూడా అదే చేద్దామనుకున్నారు. కాని శత్రువు అవంతి శ్రీనివాస్ విజయసాయిరెడ్డితో చేతులు కలిపి అడ్డుకున్నారు. లేదంటే వైసీపీలో కూడా మినిస్టర్ అయిపోయేవారే. జస్ట్ మిస్ అయింది. అవంతి శ్రీనివాస్ మినిస్టర్ అయ్యారు. అదే సమయంలో గంటా పవర్ లేని ఎమ్మెల్యేగా ఉన్నారు. మామూలుగా పవర్ లేకపోతే గంటా మనిషి కాదు. అలాంటిది ఈ మూడేళ్లు ఎలా గడిపారో మరి. పైగా మధ్యలో ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఎదురయ్యాయి. బ్యాంకు లోన్ల వ్యవహారంలో చిక్కులొచ్చాయి. అయినా విశాఖ సిటీలో ఇంకా చక్రం తిప్పడానికి అవసరమైన బలం దాచుకుని.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
టీడీపీలోనే ఉన్నా.. ఉంటానని చెప్పరు.. వెళతానని చెప్పరు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు. అధినేత చంద్రబాబు వచ్చినా వెళ్లరు.. ఇలా అటూ ఇటూ కాకుండా టీడీపీలో ఉన్నా లేనట్లే అన్నట్లుగా తయారయ్యారు. ఎప్పటికప్పుడు వైసీపీలోకి వెళతారని ప్రచారం జరగడం.. మళ్లీ అది జరగకపోవడం .. అందరూ చూస్తూనే ఉన్నారు. మధ్యలో జనసేనకు వెళతారని కూడా ప్రచారం జరిగింది. అసలు కాపు నేతలతో ఓ మీటింగ్ కూడా పెట్టాడు బాస్. అది కూడా వర్కవుట్ అవలేదు.
ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు కాస్త నీరసంగా ఉన్న టీడీపీ.. ఇప్పుడు ఉరకలేస్తుంది. తామే మళ్లీ అధికారంలోకి వస్తున్నామని చెబుతున్నారు. చంద్రబాబు, లోకేష్ కూడా వేగం పెంచారు. మరి గంటా శ్రీనివాసరావు కూడా సర్వే చేయించుకున్నారో ఏమో తెలియదు గాని.. ఈసారి టీడీపీదే అధికారం అని తెలిసిందంటున్నారు. అందుకే చంద్రబాబుగారిని కలిసి.. తాను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికే చెప్పేశారంట. ఇక అధికారికంగా కలిసి మాట్లాడటమే మిగిలిందంట.
ఈ న్యూస్ తెలిసి విశాఖలో కలకలం రేగుతుంది. ఎందుకంటే పవర్ ఎటు ఉంటే అటే గంటా ఉంటారని అందరికీ తెలుసు. అలాంటిది ఆయన ఇప్పుడు టీడీపీ వైపే ఉండాలనుకోవడంతో.. వైసీపీ వాళ్లు కూడా ఆలోచనలో పడినట్లు చెప్పుకుంటున్నారు. సర్వేల వార్తలు నిజమేనా అని చెప్పుకుంటున్నారు. మూడు రాజధానులు అని చెప్పి.. విశాఖనే రాజధాని అని చెప్పినా.. విశాఖలో ఉపయోగం లేదా అని వాళ్లలో వాళ్లు చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే విశాఖలో భూకబ్జాలు పెరిగాయని.. సెటిల్ మెంట్లు భారీగా జరిగాయని ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతలే వీటిలో ఇన్ వాల్వ్ అయ్యారని టీడీపీ ఆరోపిస్తుంది. అందుకే విశాఖలోనూ వారికి వ్యతిరేకత తప్పలేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. భూకుంభకోణం భారీ ఎత్తున జరిగాయని గతంలో ఆరోపణలొచ్చి.. కమిటీ నివేదికలు కూడా వచ్చాయి. అందులో గంటా పేరు ఉంది. మరి గంటా టీడీపీ వైపు వెళితే.. వైసీపీ ఇప్పటివరకు దాచి పెట్టిన ఆ నివేదికను బయటకు తీస్తుందేమోనని రాజకీయ వర్గాలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నాయి.