విజయవాడ చిట్టినగర్ లో వేంచేసివున్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వరస్వామివార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుంచి 18 వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానము అధ్యక్ష,కార్యదర్శి లింగిపిల్లి అప్పారావు, మరుపిళ్ల హనుమంతురావు తెలిపారు.
శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీమహాలక్ష్మీ అమ్మవార్ల దేవస్థానము పాలకమండలి ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి యేట వైభవోపేతంగా నిర్వహించు ప్రక్రియలో భాగముగా కోవిడ్ అనంతరము ఈ యేట శ్రీ వారి బ్రహ్మోత్సవాలను అతివైభవముగా నిర్వహించుటకు నిర్ణయము జరిగినది అని తెలియజేస్తూ శ్రీ స్వామివారి భక్తులు ఉహీంచని విధముగా కమిటీ వారికి సహకరిస్తూ నిర్వహనలో భాగస్వాములు కావడము ఆనందదాయకము.
ఈ సందర్భముగా దేవస్థానం కమిటీ వారు యావత్తు భక్తజనులకు మరియు రాష్ట్ర ప్రధమపౌరులు గౌ:శ్రీ హరిచందన్ విశ్వభూషన్ గారిని విశిష్ట అతిథిగా ఆహ్వానించడం జరిగినదని తెలియజేయడమైనది. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులను, ప్రముఖులను, అధికారులను ఆహ్వానించడం జరిగినది.
లోకకల్యాణం నిమ్మితము నిర్వహించు బ్రహ్మోత్సవాలలో స్వామివారి కైంకర్యానికి నిర్వహించు క్రతువులలో యవన్మంది భక్తులు విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ ఆహ్వానించడం జరిగినదని తెలియజేయడము జరిగింది.