టాలీవుడ్ లో ప్రేమకథలకు సంబంధించి ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఏ జానర్ లో ఐనా ఒక లిమిట్ వరకు మూవీస్ తియ్యగలుగుతాం కానీ ప్రేమ, కామెడీ విషయాల్లో అన్ లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది. ఎందుకంటే లవ్ స్టోరీస్ ని ఎన్ని రకాలుగా తీసినా హిట్ అవుతూనే ఉంటాయి. ఐతే ఇటీవల ఏదో ఒక బ్యాక్ డ్రాప్ పెట్టి లవ్ స్టోరీస్ తియ్యడానికి డైరెక్టర్స్ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల అలాంటిదే నక్సల్ బ్యాక్ డ్రాప్ లో వేణు ఊడుగుల తీసిన విరాట పర్వం లవ్ స్టోరీ హిట్ కొట్టి సక్సెస్ అందుకుంది. కానీ కమర్షియల్ గా పెద్దగా డబ్బులు మాత్రం తెచ్చి పెట్టలేదు ఈ మూవీ. ఇక ఇప్పుడు యుద్ధం బ్యాక్ డ్రాప్ లో క్యూట్ లవ్ స్టోరీ మన ముందుకు రాబోతోంది.
ఫీల్ గుడ్ మూవీగా ఎంటర్టైన్ చేస్తుంది : హను రాఘవపూడి
హను రాఘవపూడి ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్. ఈయన పేరు వింటే చాలు “సీతారామం” అని టక్కున చెప్పేస్తున్నారు ఆడియెన్స్. ఈ చిత్రం మరి కొన్ని గంటల్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. హను రాఘవపూడి గురించి చెప్పాలంటే సింపుల్ గా సీతారామంకి ముందు ఆ తర్వాత అని చెప్పుకోవాలి. అందాల రాక్షసితో డైరెక్టర్ గా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. తర్వాత కృష్ణగాడి వీరప్రేమగాధతో కనిపించాడు. రెండు సినిమాలు ఓకే అనిపించాయి కానీ సెకండ్ హాఫ్ చెడగొట్టేసాడు అనే ఒక బాడ్ టాక్ ని మాత్రం తన ఖాతాలో వేసుకోక తప్పలేదు హను రాఘవపూడి. తర్వాత నితిన్ తో లై, శర్వానంద్ తో పడి పడి లేచే మనసు తీసాడు కానీ అవి బిగ్ డిజాస్టర్స్ గా ఆయన కెరీర్లో మిగిలిపోయాయి.
హిట్ కొడుతుందంటూ ఇన్సైడ్ టాక్
ఇక ఇప్పుడు వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై ఈ మూవీని సి.అశ్వినీదత్ ప్రొడ్యూస్ చేశారు. మలయాళం స్టార్ దుల్కర్ , మృణాల్ ఠాకూర్ తో కలిసి “యుద్ధంతో రాసిన ప్రేమకథ” అనే టాగ్ లైన్ తో “సీతారామం” మూవీని తెరకెక్కించారు. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీలో 1965 వార్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఒక అందమైన ప్రేమ కథ ఆడియన్స్ ని మెస్మోరిజ్ చేయబోతోంది. ఈ ట్రైలర్ ని, టీజర్ ని చూస్తూ ఉంటె మాత్రం ఆడియన్స్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేసారు. లవ్ స్టోరీస్ ని తియ్యడంలో హను రాఘవపూడిది అందె వేసిన చేయి అనే పేరుంది. క్యూట్ మ్యూజికల్ లవ్ స్టోరీగా ఈ మూవీని జనాలు ఆదరిస్తారని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అన్ని చోట్ల ఈ టీమ్ సందడి చేస్తోంది.
స్మాల్ స్క్రీన్ మీద కూడా ప్రమోషన్స్
స్మాల్ స్క్రీన్ మీద కూడా ప్రతీ షోలో కనిపించి ఈ మూవీ తప్పనిసరిగా చూడాల్సిందే అంటూ ప్రమోట్ చేస్తున్నారు. క్యాష్ షో కి, జీ తెలుగు బోనాల జాతర షోలో ఈ టీం సాంగ్స్ పాడి, డాన్సులు చేసి మస్త్ ఎంటర్టైన్ చేసింది. ఇక మూవీలో అందమైన ప్రేమ కథ మాత్రమే కాదు అద్భుతమైన యుద్ధం సీన్స్ కూడా ఉన్నాయని చెప్పారు. రష్యాలో చిత్రీకరించిన ఫస్ట్ తెలుగు మూవీ కూడా ఇదేనని అంటున్నారు,. ఓపెన్ చేయని ఒక లెటర్ ఇన్స్పిరేషన్ తో పీరియాడికల్ ఫిక్షన్ డ్రామాని క్రియేట్ చేసాడు డైరెక్టర్. ఇక ఈ మూవీతో డైరెక్టర్ గ్రాఫ్ మళ్ళీ గాడిలో పడుతుందా లేదా అనే విషయం తెలియాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.