“రామారావు ఆన్ డ్యూటీ” ప్రపంచవ్యాప్తంగా విడుదలై పర్వాలేదనిపించుకుంది. నటుడిగా రవితేజకు ఇది 68వ సినిమా. ఈ చిత్రంలో మాస్ మహారాజ్ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో హీరో పాత్ర మినహా మిగతావి అవినీతి పాత్రల్లో చూపించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అవినీతిని, కుట్రలు, కుతంత్రాలను హీరో ఎలా ఫేస్ చేసాడనేది ఈ చిత్రం కథ. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్‌లో ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమింగ్ కానుంది.
ఈ మూవీలో చాలా రోజుల తర్వాత వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించారు. ఆయన ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మిగతా ముఖ్య పాత్రల్లో నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, సర్పట్ట జాన్ విజయ్, చైతన్యకృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ కనిపించారు. రామారావు ఆన్ డ్యూటీ ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్‌గా సోనీ లివ్ ఉంది. రవితేజ టైగర్‌తో పాటు మరో రెండు చిత్రాలను లైన్‌లో పెట్టారు. రవితేజ కెరీర్‌లో 70వ సినిమాగా ‘రావణాసుర’ చేస్తున్నారు.