తిరుపతి : అధికారంలోకి రాకముందు వైసీపీ ఇచ్చిన వాగ్దానాల్లో మద్యపాన నిషేధం చేస్తామని కచ్చితంగా చెప్పింది. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తోంది. కానీ ప్రజలకు ఇచ్చిన మాట మాత్రం ఇంతవరకు నెరవేర్చలేదు. దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తాం, ప్రభుత్వం ద్వారానే మద్యం అమ్మకాలు చేపడతాం అని చెప్పారు. కానీ ఇంతవరకు మధ్య నిషేధం ఊసే లేదు. ఇకపోతే వినియోగదారుడు ఏం కావాలని కోరుకుంటాడో అది మాత్రం తప్పనిసరిగా అందించాలి. కానీ ఈ ప్రభుత్వ హయాంలో అలా ఏమీ జరగడం లేదు. మీరు అడిగిన బ్రాండ్ మా దగ్గర ఉండదు..మేం ఇచ్చిందే పుచ్చుకో అంటూ ప్రభుత్వం చెప్తోంది. వినియోగదారుడి రాజైనప్పుడు అతన్ని ఆకర్షించడానికి ఏ దుకాణదారుడైన ప్రయత్నిస్తాడు. వినియోగదారుడు ఏది కొనుక్కోవాలనుకుంటాడో వాటిని అందుబాటులో ఉంచటానికి ప్రయత్నిస్తాడు. ఇదే పద్దతి డబ్బిచ్చి మందు కొనుక్కునే మందుబాబులకు కూడా వర్తిస్తుంది. కానీ ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కనిపించదు. డబ్బిచ్చి కావాల్సిన బ్రాండ్ కొందామనుకుంటాడు కానీ అవి తప్ప మిగతావి దొరుకుతాయి. గతంలో ఉన్న లిక్కర్ బ్రాండ్స్ ఏవీ కూడా ఇక్కడ దొరకవు. లిమిటెడ్ బ్రాండ్స్ ని మాత్రమే అమ్మలంటూ ప్రభుత్వం టార్గెట్స్ పెట్టేసరికి మందుబాబులు తమకు కావాల్సిన బ్రాండ్స్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులు, సన్నిహితులకు చెందిన కంపెనీ బ్రాండ్ల మద్యాన్నే అమ్ముతోంది తప్ప వినియోగదారుడికి కావాల్సిన ఆ పాత బ్రాండ్స్ ని మాత్రం అమ్మడం లేదు. ఇకపోతే 2020 జనవరి నుంచి 2021 నవంబర్ మధ్య రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఏఏ బ్రాండ్లను ఎక్కువగా సేకరించి, అమ్మారు అనే విషయాల గురుంచి సహ చట్టం కింద పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. గతంలో అత్యధికంగా అమ్ముడైన వాటి జాబితాలో ఉన్న ఆఫీసర్స్ ఛాయిస్ రిజర్వ్ విస్కీ, ఓల్డ్ ట్రావెల్ ఫైన్ విస్కీ, శీగ్రమ్స్ ఇంపీరియల్ బ్లూ క్లాసిక్ గ్రైన్ విస్కీ, ఎస్ పివై ఛాంపియన్ స్పెషల్ విస్కీని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ సరఫరా చేస్తోంది.
ఎంఎస్ .బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, జెఆర్.సంస్థలు మంజీరా క్లాసిక్ రిజర్వు విస్కీని సరఫరా చేస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు ఒకే ప్రాంగణంలో, ఒకే భవనంలో నడుస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల జాబితాలో ఇవి ముందు వరుసలో ఉన్నాయి. ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో అమిరెడ్డి జైపాల్ రెడ్డి, అమిరెడ్డి స్నేహారెడ్డి, యోగేష్ కుమార్ జాజు డైరెక్టర్లుగా ఉన్నారు. ఐతే నాకౌట్, బడ్ వైజర్ బ్రాండ్స్ అనేవి కనిపించవు. “బ్రిటిష్ ఎంపైర్” “బూమ్” బీర్లు తప్పనిసరిగా కొనుక్కోవాల్సిందే. మద్యం ప్రియుల్లో బాగా పేరొందిన “కింగ్ ఫిషర్ స్ట్రాంగ్” “ప్రీమియం బీరు” “నాకౌట్ హైపంచ్” స్ట్రాంగ్ బీరు, “బడ్ వైజర్”, “కాల్స్ బర్గ్”, “ఎలిఫెంట్” సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్లు ప్రభుత్వ దుకాణాలలో అస్సలు దొరకడం లేదు. ఉదాహరణకు 2018లో 64.56 లక్షల కేసుల నాకౌట్ హైపంచ్ స్ట్రాంగ్ బీరు విక్రయించారు. 2020లో 40 వేల కేసుల 2021 లో నవంబర్ వరకు ఒకే ఒక్క కేసు విక్రయించారు. బీరు 2018లో 21.11లక్షల కేసులు విక్రయించగా ప్రభుత్వ దుకాణాలలో 2020లో కేవలం 27 వేల కేసులు 2021 లో నవంబర్ వరకు 8888 కేసులు మాత్రమే అమ్మారు. ఇప్పుడు బీరు అడిగితే “బ్రిటిష్ ఎంపైర్” సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీరు, “ఒరిజినల్ బీరా”, 91 బూమ్ సూపర్ స్ట్రాంగ్ బీరు, ఎస్ ఎన్ జే 10 వేల స్పెషల్ సూపర్ స్ట్రాంగ్ బీరు మాత్రమే ఉన్నాయని అవే ఇస్తున్నారని మద్యంప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలలో ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్ (2020 జనవరి నుంచి 2021 నవంబర్ వరకు విక్రయించిన కేసులు వివరాలు ఇలా ఉన్నాయి.) 9 సి హార్సెస్ విస్కీ 22 24 019 , టిఐ మెన్షన్ హౌస్ ట్రూ స్పిరిట్ ప్రెంచ్ బ్రాందీ 7.87.656 , ఎస్ పీవై గెలాక్సీ ప్యూర్ గ్రేయిన్ విస్కీ 5.53.741 , రాయల్ ప్యాలెస్ విఎస్ వోపి బ్రాందీ 12.18.921 , మలబార్ హౌస్ విఎస్ ఓపి బ్రాందీ..9.75.433 , సదరన్ బ్లూ సుప్రీం విస్కీ 11 26 53 3 కేసులను ప్రభుత్వ దుకాణాలలో విక్రయించారు. సామాన్యుడి సంపాదన మద్యం దుకాణాలలో ఖర్చు పెట్టి ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వస్తున్నారని మహిళలు వాపోతున్నారు. “మంచినీళ్ల కన్నా మద్యం మిన్న” అన్నచందాన ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.