ప్రధాన ప్రతిపక్ష నాయకుడు,తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అడ్డ కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా వైఎఎస్సార్ చేయూత మూడో విడత నిధుల ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు.కుప్పం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీ ప్రజలకు మరిన్ని వరాలు ప్రకటించారు. జనవరి నుంచి పెన్షన్ పెంచుతామని ప్రకటించారు.
ఏపీలో ప్రస్తుతం వృద్దులు, వితంతువులకు 2,500 రూపాయల పెన్షన్ వస్తోంది. సీఎం జగన్ తాజా ప్రకటనతో జనవరి నుంచి పెన్షన్ 2,750 రూపాయలు ఇవ్వనున్నారు. ప్రతి ఏటా పెన్షన్ ను 250 రూపాయలు పెంచుతామని ఎన్నికల హామీ ఇచ్చారు జగన్. అందులో భాగంగానే రెండు విడతలుగా పెంచారు. వచ్చే జనవరి నుంచి మూడో విడతగా మరో 250 రూపాయలు పెంచనున్నట్లు ప్రకటించారు.
అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వచ్చె ఎన్నికల్లో కుప్పంలో విజయం సాధించి తీరుతామన్నారు.కుప్పం అభివృద్ధిని జగన్ తన పనుల్లో చూపిస్తున్నారని అన్నారు.ఎమ్మెల్సీ భరత్ కుప్పం ప్రజలను చంద్రబాబు ఇంతకాలం మోసం చేశారన్నారు. జగన్ వల్లే 33 ఏళ్ల తర్వాత చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చిందన్నారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు ఎమ్మెల్సీ భరత్.