ఆపరేషన్ తెలుగుదేశం మొదలెట్టి.. ఫస్ట్ హిట్టింగ్ అమరావతికే కొట్టారు జగన్మోహన్ రెడ్డి. మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ఆశలను ముక్కలు చేసేశారు. ఏదో తమ బిడ్డలు బాగుపడతారని.. రాష్ట్రం బాగుపడేందుకు పొలాలిస్తే తమకు కూడా పేరు వస్తుందని.. పొలాలిచ్చిన రైతులంతా దిగాలుపడిపోయారు. పట్టు వదలని విక్రమార్కుల్లా ఇక్కడికీ పోరాడుతూనే ఉన్నారు. అయితే సీఎం కూడా పట్టు వదలని విక్రమార్కుడి బాబాయ్ లా .. ఆయన కూడా వైజాగ్ వెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ముందు శాసనమండలి ఆపింది. ఆ తర్వాత హైకోర్టు ఆఫింది. అయినా ఈయన మాత్రం తన ప్రయత్నం ఆపలేదు.
లేటెస్టుగా .. ఆగస్టు నెలలో జగన్ వైజాగ్ వెళ్లిపోతారంట.. అక్కడి నుంచే పాలనంట అంటూ వార్తలొచ్చి వారం పైనే అయింది. కాని ఆ ఊసు ఏమీ వినపడటం లేదు. ఆయన వెళ్లాలంటే ముందు ఉద్యోగులు కొందరైనా వెళ్లాలి. మరి ఇప్పటివరకు అలాంటి కదలికలేమీ లేవు. అసలు హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఆయన వెళ్లటానికి లేదే అని కొందరు అనుమానపడ్డారు. అయితే క్యాంప్ ఆఫీసు పెడితే ఎవరూ ఆపలేరని.. ఆ పేరుతో వెళ్లి క్యాంప్ ఆఫీసు అంటూనే పనంతా నడిపించొచ్చని ప్లాన్. అయితే ఈ ప్లాన్ కొత్తదేమీ కాదు. ఎప్పటి నుంచో వినపడుతున్నదే. అయినా ఈసారి మాత్రం పక్కా అంటూ ప్రచారం చేశారు.
బిజెపికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నారు కాబట్టి.. ఏదో అగ్రిమెంట్ కుదిరిందని.. అందుకే స్పీడు పెంచారని కూడా టాక్ వినపడింది. కాని రాష్ట్రపతి ఎన్నిక అయిన మరుక్షణం నుంచి బిజెపి రివర్స్ గేర్ లో వస్తుంది. మరి అది పైకి కనిపించేది.. నిజంగానే సిన్సియర్ గా చేస్తున్నారా అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. ఏమైనా వైసీపీకి బిజెపి అండ మాత్రం బాగానే ఉందని.. వైజాగ్ వెళతారని ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. అంతే కాదు.. ఆగస్టులో ఇద్దరు ప్రముఖులు పదవీ విరమణ చేస్తారని.. వారిద్దరి వల్ల చాలా అడ్డంకులు వస్తున్నాయని.. ఆ పదవీ విరమణలు అయిపోతే.. ఇక జగన్ కు చిక్కులేమీ ఎదురయ్యే అవకాశం లేదని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అందుకే వారి పదవీ విరమణ అయిపోగానే వైజాగ్ కి షిఫ్ట్ అవడం ఖాయమని వారు ప్రచారం చేస్తున్నారు.
అయితే టీడీపీ నేతలు మాత్రం ఇదంతా విశాఖలో రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికేనని.. అంతే తప్ప వేరే ఏమీ లేదని.. ఇప్పటికే అమరావతి ఎఫెక్టుతో మూడు జిల్లాల్లో వైసీపీ ఓడిపోబోతుందని .. ఇప్పుడు వైజాగ్ షిఫ్ట్ అయితే అది కన్ఫ్మార్మ్ చేసుకోవచ్చని.. అందుకే వెళ్లలేక.. ఉండలేక గిలగిలలాడుతున్నారని అంటున్నారు. పైగా వైజాగ్ షిప్ట్ అయితే ఇప్పటికే అక్కడ వచ్చిన వ్యతిరేకత పోయేది లేదు.. వీళ్లు కొత్తగా గెయిన్ అయ్యేది లేదని.. అందుకే వెళదామనుకున్నా గాన వెళ్లలేకపోతున్నారు. మళ్లీ వెనక్కు తగ్గారనుకుంటున్నారని.. అప్పుడప్పుడు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని వారంటున్నారు. మరి ఏధి నిజమో.. ఈ ఆగస్టు నెల అయిపోతే గాని తెలియదు.