మూలిగే నక్క మీద తాటిపండు రాలినట్లుంది గోరంట్ల మాధవ్ పరిస్థితి. అసలే వీడియో చికాకులో ఉన్నాడు మాధవ్. పైగా పార్టీ నేతలు కనీసం జాలి కూడా చూపించటం లేదు. అధినేత జగన్ అయితే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. యాక్షన్ తప్పదు.. వేటు తప్పదు.. తన కెరీర్ ఖతమ్ కాక తప్పదని ఇప్పటికే దాదాపు ఏడ్చినంత పని చేస్తుంటే… టీడీపీ నేత చింతకాయల విజయ్ ఆయనపై పరువునష్టం దావా వేశాడు. హైకోర్టులో తనను అనవసరంగా లాగారంటూ పిటిషన్ వేశాడు చింతకాయల విజయ్. 50 లక్షల నష్టపరిహారం డిమాండ్ చేశాడు. గోరంట్ల మాధవ్ వీడియో బయటకు రాగానే ఏం చేయాలో అర్ధం కానట్లుంది. వెంటనే టీడీపీ సోషల్ మీడియా చూస్తున్న చింతకాయల విజయ్ పేరు చెప్పేశారు. ఆయనే కుట్ర చేసి ఈ వీడియోను మార్ఫింగ్ చేసి వదిలారని.. సోషల్ మీడియాలో కనపడుతున్నది ఫేక్ వీడియా అని ఆగ్రహంతో ఊగిపోతూ చెప్పారు. పైగా కాస్త శృతి తప్పి ఫౌల్ లాంగ్వేజ్ కూడా వాడారు. దీనిపై సాయంత్రానికే చింతకాయల విజయ్ ఫేస్ బుక్ లో వీడియో పోస్ట్ చేశారు.
మాధవ్ దరిద్రాన్ని చూపించాల్సిన అవసరం తనకేంటని.. ఆయన ఎందులోనో ఇరుక్కుని మా పేరు ఎందుకు చెబుతున్నాడంటూ చింతకాయల విజయ్ మండిపడ్డారు. అప్పుడే కోర్టులో పరువునష్టం దావా వేస్తానని ప్రకటించారు కూడా. ఇప్పుడు చెప్పినట్లుగానే హైకోర్టులో ఫైల్ చేశారు. దీంతో గోరంట్ల మాధవ్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. అసలే కెరీర్ స్టాపర్ లా ఆ వీడియో వచ్చిందని బాధపడుతుంటే.. 50 లక్షలు కట్టాలని పరువు నష్టం వేయడంతో.. ఇదొక కొత్త తలనొప్పి అనుకుంటూ బాధఫడుతున్నారంట. ఎందుకంటే రేపు వైసీపీ ఆయనపై వేటు వేస్తే.. ఎంపీ పదవిని కోల్పోతే.. మొత్తం దారులన్నీ మూసుకుపోతాయి. ఇప్పటివరకు తెచ్చుకున్న ఆదాయం ఇక రాదు. ఆ వీడియో నిజమో కాదో ఆయనకే తెలుసు. సో కోర్టులో ఏ తీర్పు వస్తుందో కూడా ఆయనకే తెలుస్తుంది. అది ఫేక్ వీడియో అయితే.. 50 లక్షలు కట్టాల్సిన పని ఉండదు.. కాని రియల్ అయితే.. మాత్రం 50 లక్షలు పోయాల్సి వస్తుంది. ఇదే ఇప్పుడు మాధవ్ కొచ్చిన కొత్త చిక్కు..
మొత్తం మీద చాలా స్పీడుగా ఎదిగిన మాధవ్.. ఇంత త్వరగా తన నిచ్చెన తానే కూల్చేసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. కియా లాంటి మల్టీ నేషనల్ కంపెనీనే వణికించిన ఎంపీ.. ఈ రోజు ఏం చేయాలో తెలియని దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాడంటే.. అది విధి వైచిత్రం అనుకోవాలి లేదా మాధవ్ స్వయంకృతాపరాధం అనుకోవాలి. గతంలో ఎన్ని కేసులు వచ్చినా.. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఎవరినీ లెక్క చేయలేదు. లెక్క చేసే మెంటాలిటీ కూడా కాదు. కాని ఒక్క రోజులో అన్నీ తలకిందులైపోయాయి. తననే ఎవరూ లెక్క చేయని స్టేజికి ఒక్కరోజులోనే వెళ్లిపోయాడు.