అద్భుతం..మహాద్భుతం అని అమ్రిష్ పూరి చెప్పిన డైలాగ్ తెలుగు ప్రజలకు ఎప్పుడూ గుర్తే. ఇప్పుడు అదే డైలాగ్ చెప్పి పెదరాయుడు వార్తల్లో నిలిచాడు. ఆర్జీవీ తర్వాత అంతటి స్థాయిలో కాకపోయినా మోహన్ బాబు కూడా ఎప్పుడు ఎదో ఒక కాంట్రవర్సీని మూటగట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన షిర్డీ సాయిబాబును టార్గెట్ చేశారు. విష్ణు బాబు చెప్పాడు ఈ పెదరాయుడు చేసి చూపించాడు అంటున్నాడు గొప్పలు చెప్పుకుంటూ ఆ షిర్డీ సాయినాధుడి మీదే కాంట్రవర్సీ కామెంట్స్ చేసి వార్తల్లో వ్యక్తయ్యాడు మోహన్ బాబు. ఇక ఎవరూ షిరిడికి వెళ్ళకండి..భక్తులంతా మా గుడికే వచ్చేయండి అంటూ పిలుపునిచ్చారు మోహన్ బాబు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో తన సొంత నిధులతో సాయిబాబా టెంపుల్ ని మోహన్ బాబు ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరకు వచ్చే ప్రతీ ఒక్కరూ ఈ గుడికి రావాలి..
అలాంటి గుడిని కట్టండి లేదంటే వద్దు అని విష్ణుబాబు అన్నాడట..ఇంకేముందు మన పెదరాయుడు ఫాలో ఇపోయాడట. తాను కట్టిన ఆలయం షిర్డీ కంటే గొప్పదని అక్కడికి ఇంకెవరూ వెళ్ళక్కర్లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా ఈ ఆలయానికి వచ్చేలా గుడి కట్టించినట్లు చెప్పారు. ఈయన చేసినా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈయన అన్న మాటలు సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయంటున్నారు. రిషికేష్ సహా ఎన్నో పవిత్ర ప్రదేశాల నుంచి, మూలికలు, ఋషులు, మహర్షులు చెక్కలపై రచించిన లిపిని కూడా తాము నిర్మించిన ఆలయంలో పొందుపరిచామని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఐతే ఇదంతా మోహన్ బాబు రాజకీయ ఎత్తుగడ అంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ లో తనకు పెద్దగా ప్రాధ్యానత లేకపోయేసరికి కొంత కాలం నుంచి పార్టీలో ఆక్టివ్ గా ఉండడం లేదు. ఇదే మంచి టైం అనుకుని టీడీపీలోకి వెళ్ళడానికి ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారని వాదనలు వినిపించేసరికి మోహన్ బాబు ఆ కామెంట్స్ ని తోసిపుచ్చారు. ఆలయం కట్టుకోవడానికి స్థలం కేటాయించనందుకు చంద్రబాబుని ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసాను తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ ఎత్తగడ లేదని చెప్పారు. షిర్డీ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుని వెళ్తూ ఉంటారు. అంతటి పవిత్రమైన ఆలయానికి ఇక వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పడానికి ఆయనెవరు అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. బోల్డంత డబ్బుతో కట్టేస్తే గొప్ప గుడైపోతుందా..గొప్ప భక్తులైపోతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మోహన్ బాబు భక్తి తో కాదు వ్యాపారం చేయడానికి ఆలయాన్ని నిర్మించారంటూ అటు సాయిబాబు భక్తులు, ఇటు ప్రజలు అంటున్నారు.