Connect with us

Hi, what are you looking for?

Andhra News

హీరాబెన్ మోదీ 100వ జన్మదినోత్సవం : తల్లి ఆశీర్వాదం తీసుకున్న నరేంద్రమోదీ

ప్రధాని నరేంద్రమోదీ మాతృతల్లి హీరాబెన్ మోదీ శనివారం శతవసంతంలోకి అడుగుపెట్టారు. నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ 100వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్‌లోని…

Share

ప్రధాని నరేంద్రమోదీ మాతృతల్లి హీరాబెన్ మోదీ శనివారం శతవసంతంలోకి అడుగుపెట్టారు. నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ 100వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్‌లోని ఆమె నివాసంలో తన తల్లి హీరాబెన్ మోదీని ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. తన తల్లి కాళ్లను కడిగి ఆ నీళ్లను కళ్ళకద్దుకున్నారు. తల్లికి స్వీట్స్ తినిపించిన ప్రధాని మోదీ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. హీరాబెన్ మోదీ నూరేళ్ళ వయసులో కూడా ఫిట్‌గా, మంచి ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె తన చిన్న కొడుకు పంకజ్ తో కలిసి గాంధీనగర్‌లో నివసిస్తోంది. 100 ఏళ్ల వయస్సులో కూడా హీరాబెన్‌కు ఎలాంటి వ్యాధి లేదు. ఆమె సాధారణ ఆహారాన్ని ఇష్టపడుతుంటారు.  ప్రధాని తల్లి పుట్టినరోజు నేపథ్యంలో గుజరాత్‌లోని ఓ రోడ్డుకు ఆమె పేరు పెట్టనున్నారు. హీరాబెన్ 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందున, రైసెన్ ప్రాంతంలోని 80 మీటర్ల రహదారికి పూజ్య హీరాబామార్గ్ అనే పేరు పెట్టాలని తాము నిర్ణయించుకున్నామని తద్వారా ఆమె జీవితం నుంచి తరువాతి తరం స్ఫూర్తి పొందుతుందని గాంధీనగర్ మేయర్ హితేష్ మక్వానా వెల్లడించారు. ప్రధాని అక్కడ నుంచి బయలుదేరి పంచమహల్ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పావగఢ్‌కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గుజరాత్ సమాచార శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం 15 శతాబ్దంలో నిర్మించిన పావగడ ఆలయ శిఖరం గత ఐదు శతాబ్దాలుగా శిథిలావస్థకు చేరుకుంది. దీనిని ప్రస్తుతం పునరుద్దరించి కొత్త రూపంతో రీడిజైన్ చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం భక్తులను అనుమతిస్తారు. గుజరాత్‌ రాష్ట్ర పర్యటనలో ఉన్న మోదీ పావగఢ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, వడోదరలో జరిగే ర్యాలీలో ప్రసంగించనున్నారు.

ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాంజిట్ కారిడార్ ప్రాజెక్టు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాంజిట్ కారిడార్ ప్రాజెక్టుకు చెందిన ప్రధాన సొరంగాన్ని మరియు అయిదు అండర్ పాస్ లను జూన్ 19వ తేదీ దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఈ సందర్భంలో ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఇంటిగ్రేటెడ్ ట్రాంజిట్ కారిడార్ ప్రాజెక్టు ప్రగతి మైదాన్ పునరభివృద్ధి పథకం లో నుంచి విడదీయలేనటువంటి ఒక భాగం గా ఉన్నది. పూర్తి గా కేంద్ర ప్రభుత్వం అందజేసిన నిధుల తో ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్టు ను 920 కోట్ల రూపాయల కు పై చిలుకు వ్యయం తో నిర్మించడం జరిగింది. ప్రగతి మైదాన్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక నూతనమైన ప్రపంచ స్థాయి ప్రదర్శన మరియు సమావేశ కేంద్రం వరకు సాఫీ గాను మరియు ఎటువంటి ఇక్కట్టులను ఎదుర్కోకుండాను చేరుకొనేందుకు దోహదపడడం ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యంగా ఉంది. అది జరిగితే, ప్రగతి మైదాన్ లో నిర్వహించే కార్యక్రమాల లో ప్రదర్శనదారు సంస్థ లు మరియు ఆగంతుకులు సులభం గా పాలుపంచుకొనేందుకు వీలు ఉంటుంది .. ఏమైనా, ఈ ప్రాజెక్టు యొక్క ప్రభావం ప్రగతి మైదాన్ కే పరిమితం కాబోదు. ఎందుకంటే ఇది వాహనాల రాకపోకల కు అంతరాయాల ను తొలగించడంతో పాటు, తద్ద్వారా వాహనదారుల కు కాలం మరియు రాకపోకల కు అయ్యే ఖర్చు ను చాలావరకు ఆదా చేసుకోవడం లో సహాయం లభించగలదు. ఇది పట్టణ ప్రాంతాల లో మౌలిక సదుపాయాల కల్పన తీరుతెన్నుల ను మార్చివేయడం ద్వారా ప్రజల కు జీవన సౌలభ్యాన్ని కలుగజేయాలన్న ప్రభుత్వ దూరదర్శి ప్రణాళిక లో ఒక భాగం గా ఉంది.

ప్రధాన సొరంగం ప్రగతి మైదాన్ గుండా సాగేటటువంటి పాత కిలా రోడ్ మీదుగా రింగు రోడ్డు ను ఇండియా గేట్ తో కలుపుతుంది. ఆరు దోవలు గా విభాజితం అయినటువంటి ఈ సొరంగానికి బహుళ లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాల లో ప్రగతి మైదాన్ యొక్క విశాలమైనటువంటి బేస్ మెంట్ పార్కింగ్ ను అందుబాటు లోకి తీసుకు రావడం కూడా ఒకటిగా ఉంది. వాహనాల ను నిలిపి ఉంచే స్థలాని కి ఇరు పక్కల వాహనాల రాకపోకల ను సౌకర్యవంతం గా చేయడం కోసమని సొరంగ మార్గాని కి అడుగు న రెండు క్రాస్ టనల్స్ ను కూడా నిర్మించడం ఈ సొరంగం లో ఓ విశిష్టత గా ఉంది. సొరంగం లోపల స్మార్ట్ ఫైర్ మేనేజ్ మెంట్, ఆధునిక వాయు ప్రసరణ వ్యవస్థ, ఆటోమేటెడ్ డ్రైనేజి, డిజిటల్ మాధ్యమం ద్వారా నియంత్రణ జరిగేటటువంటి సిసిటివి మరియు సార్వజనిక ప్రకటన వ్యవస్థల వంటి రాకపోకలను సునాయాసం చేయగల నవీనతమ ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగివుండేటటువంటి సదుపాయాలను జతపరచడమైంది. దీర్ఘకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న ఈ సొరంగం భైరోం మార్గ్ కు ఒక ప్రత్యామ్నాయమైన దారిగా సేవలను అందించనుంది. ప్రస్తుతం భైరోం మార్గ్ పైన దాని రాకపోకల సామర్ధ్యానికి మించి చాలా అధికమైన ఒత్తిడి పడుతోంది. మరి ఈ కొత్త దోవ అందుబాటులోకి వస్తే భైరోం మార్గ్ పైన నడిచే సరకు రవాణా వాహనాల తాలూకు భారం అనేది సగానికి పైగానే తగ్గిపోవచ్చన్న అంచనా ఉంది. ఈ సొరంగంతో పాటుగా ఆరు అండర్ పాస్ లు కూడా ఉన్నాయి. వాటిలో నాలుగు అండర్ పాస్ లు మధుర రహదారిలోను, ఒకటి భైరోం మార్గ్ లోను ఉంటే, మిగతా అండర్ పాస్ రింగు రోడ్డు, భైరోం మార్గ్ ల చౌరస్తాలో ఉంది.

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Alluri Seetharama Raju

Daftar Situs Slot Bonus New Member  100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Uncategorized

Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....

Alluri Seetharama Raju

Prediksi forum Syair cambodia Hari Ini 2023     Forum syair cambodia 2023, kode syair cambodia hari ini, code syair cambodia bd, prediksi cambodia...

Lingual Support by India Fascinates