Connect with us

Hi, what are you looking for?

Andhra News

ఉద్యోగుల జీపీఎస్ ఖాతాల్లో సొమ్ము మాయం- ఆర్థిక మాయ  

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లోని సొమ్ము వారికి తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. 2018 తర్వాత బకాయి ఉన్న పెండింగ్‌ డీఏల్లో ఒక డీఏ బకాయిని…

Share

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లోని సొమ్ము వారికి తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. 2018 తర్వాత బకాయి ఉన్న పెండింగ్‌ డీఏల్లో ఒక డీఏ బకాయిని రాష్ట్ర ప్రభుత్వం ఐదు విడతలుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా ఆ మొత్తాన్ని ఒకేసారి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. జీపీఎఫ్‌ స్లిప్పులను కొందరు  డౌన్‌లోడ్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కలకం రేగింది. పలు సంఘాలు ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించాయి. రాష్ట్రంలో ఉన్న 4.20 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ చర్య ద్వారా బాధితులుగా మారారని, ఇలా అనుమతి లేకుండా విత్‌ డ్రా చేసిన మొత్తం 800 కోట్ల పైనే ఉంటుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేసిన రూ.వందల కోట్లు మాయమైన విషయం  రగులుతూనే ఉంది. దీన్ని సాంకేతిక తప్పిదంగా రాష్ట్ర ప్రభుత్వం చూపే ప్రయత్నం చేసినా.. ఇందులో అనేక సందేహాలకు సమాధానం లభించడం లేదు. ఆర్థిక మాయకు ‘సాంకేతిక తప్పిదం’ అనే ముసుగు వేసి ప్రస్తుతానికి మమ అనిపించే ప్రయత్నాలు సాగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కిందటి ఏడాది నవంబరులో కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ ఈ అంశంపై దృష్టి సారించారని, దీనిపై రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులకు, ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయానికి మధ్య ఉత్తర, ప్రత్యుత్తరాలు సాగుతున్నాయని తెలిసింది. ఇది సాంకేతిక తప్పిదమే అయితే ఇంత సుదీర్ఘంగా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాల్సినంత అవసరం ఏముంటుందనేది చర్చనీయాంశమవుతోంది.

ఉద్యోగుల డీఏ బకాయిల బిల్లులు జీపీఎఫ్‌కు జమచేసేవి, నగదు రూపంలో చెల్లించేవి పేమెంట్‌ అప్లికేషన్‌కు పంపించాం. ఖజానా శాఖ డైరెక్టర్‌ మార్గదర్శకాల ప్రకారం ఆమోదించిన తర్వాతే పేమెంట్‌ అప్లికేషన్‌కు పంపాము. అందులో మేము చెల్లింపులు చేయకపోయినా పొరపాటున ఆ మొత్తాలు జీపీఎఫ్‌ ఖాతాలకు జమయ్యాయి. ఇది సాంకేతిక తప్పిదమే. ట్రెజరీ నిబంధనల ప్రకారం మార్చి 31 నాటికి జమకాని ఏ బిల్లు పెండింగులో ఉన్నా అది రద్దయిపోతుంది. అందుకే పొరపాటున జీపీఎఫ్‌ ఖాతాలకు జమ అయిన మొత్తాలు మళ్లీ డెబిట్‌ అయ్యాయి’ అని ఆర్థికశాఖ అధికారులు వివరణ ఇచ్చారు.* ఉద్యోగుల్లో సీపీఎస్‌ ఉద్యోగులు, పాత పెన్షన్‌ విధానం ఉద్యోగులు ఉన్నారు. కరవు భత్యం బకాయిలు పాత పెన్షన్‌ విధానం ఉద్యోగులకు వారి ఖాతాలకు జమచేసి పదవీవిరమణ తర్వాత చెల్లిస్తారు. సీపీఎస్‌ ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లిస్తారు. సాంకేతిక తప్పిదం అయితే సీపీఎస్‌ ఉద్యోగులకు నగదు ఎందుకు జమ కాలేదు? పుస్తకాల్లో సర్దుబాటు చేసే చోట మాత్రమే సాంకేతిక తప్పిదం ఎలా జరిగిందన్న ప్రశ్నకు సమాధానం లేదు.

ఇది పూర్తిగా ఒక ఆర్థిక మాయ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చాలా రోజులుగా ఖాతాలకు జమ చేసినట్లు చూపించిన మొత్తాలకు.. అసలు తాము ఆ బిల్లులు పాస్‌ చేయలేదని చెప్పడం విశేషం. అనేక రోజుల పాటు సాగిన వ్యవహారాన్ని ఎలా సాంకేతిక తప్పిదంగా పేర్కొంటారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు మళ్లీ ఎప్పుడు ఉద్యోగుల ఖాతాలకు జమ చేస్తారని ప్రశ్నిస్తే ఉద్యోగులంతా మళ్లీ డీఏ ఎరియర్స్‌ బిల్లులు పెట్టుకుని పంపిస్తే వాటిని ఆమోదించాక వారి ఖాతాలకు జమ చేస్తామని చెబుతున్నారు. ప్రజాపద్దు (పబ్లిక్‌ అకౌంట్‌)లో ఎక్కువ మొత్తాలు ఉంటే దాన్ని ప్రభుత్వ రుణంగా చూపించాల్సి వస్తుందన్న కారణంతోనే తరచూ ఈ వ్యవహారాలు సాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మొత్తం మీద ప్రభుత్వ రుణమూ, ఖర్చు కూడా తగ్గించి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఒక ఆర్థిక మాయకు సాంకేతిక తప్పిదం అనే ముసుగు తగిలిస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఉద్యోగులకు తెలియకుండా వారి జీపీఎఫ్ ఖాతాల డబ్బు విత్ డ్రా చేయడం క్రిమినల్ చర్యగా పేర్కొంటున్న ఉద్యోగసంఘాల నేతలు.. ఇవాళ సీఎస్ తో భేటీ తర్వాత కూడా క్లారిటీ రాకపోవడం.తో ప్రభుత్వంపై మండిపడ్డారు. సాంకేతిక కారణాలతో డబ్బు విత్ డ్రా అయినట్లు ప్రభుత్వం ఇస్తున్న వివరణతో తాము సంతృప్తి చెందడం లేదని ఉద్యోగసంఘాల నేతలు తెలిపారు.

ఉధ్యోగుల ఖాతాల్లో నుంచి నగదు డెబిట్ అయిన వ్యవహారంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు. ఈ వాజ్యంలో సీఎస్ తో పాటు ఆర్దికశాఖ ఉద్యోగులు, సీఎఫ్ఎంఎస్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ను ప్రతివాదులుగా చేరుస్తామని హెచ్చరించారు.

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Alluri Seetharama Raju

Daftar Situs Slot Bonus New Member  100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Uncategorized

Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....

Uncategorized

Beşiktaş su kaçak tespiti Beşiktaş’ta Su Kaçağı Tespiti ve Onarımı Kameralı Su Kaçağı Tespiti ve Onarımı Beşiktaş’ta su kaçağı tespiti ve onarımı firmamız tarafından...

Lingual Support by India Fascinates