కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్ బ్రతికే ఉన్నాడు అని, వైఎస్సార్ పథకాలు ప్రతి గడపను…ప్రతి గుండెను తాకాయి అని వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. చివ్వెంల మండలం మోదింపురం గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష ప్రాంగణం నుంచి వైఎస్ షర్మిల మాట్లాడారు… నిరుద్యోగుల విషయం లో 3 సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు.నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసిన కేసీఅర్ అన్నారు. రుణమాఫీ,ఉచిత విద్యుత్, పావులా వడ్డీకి రుణాలుఫీజు రీయింబర్స్మెంట్,ఆరోగ్య శ్రీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకం అద్భుతంగా అమలు చేసి చూపించారు. ప్రైవేట్ రంగంలో సైతం లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఇప్పుడు 8 ఏళ్లుగా ముఖ్యమంత్రి గా ఉన్న కేసీఆర్ ప్రతి వర్గాన్ని మోసం చేశారు. ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు, నిరుద్యోగుల విషయంలో తీరని అన్యాయం చేశారు అన్నారు. నిరుద్యోగ సమస్య తెలంగాణ అత్యధికంగా ఉందన్నారు. అందుకు కెసీఅర్ నిర్లక్యమే కారణం అన్నారు. కళ్ళ ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దున్నపోతు మీద వానపడ్డట్లు… కేసీఅర్ కు చీమ కుట్టినట్లు కూడా లేదు. వందల మంది కేసీఅర్ పేరు రాసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
ఇవి ఆత్మహత్యలు కాదు. కేసీఅర్ చేస్తున్న హత్యలు అన్నారు. ముష్టి 35 వేలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి కేసీఅర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కేసీఅర్ కు భాధ్యత లేదు… ఉంటే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేవారు. కేసీఅర్ నిజంగా మనిషి కాదు…మృగం అన్నారు. ఒక తల్లి నాతో అన్నది…నా కొడుకు ను చదివించి చంపుకున్నాను అని ఆవేదన వ్యక్తం చేసింది. చదవక పోతే నా కొడుకు బ్రతికే వాడు అన్నారు. తెలంగాణ కోసం వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ వచ్చాక కూడా అవే బలిదానాలు జరుగుతున్నాయి. కేసీఅర్ ను ఇందుకే పనికి రాని ముఖ్యమంత్రి అనాలి..