స్టార్స్ బర్త్ డేస్ కి ఆడియన్స్ కి గిఫ్ట్స్ గా వాళ్ళు నటించిన మూవీస్ ని 4k రెజల్యూషన్స్ లోకి మార్చి అందించడం అనేది ఇప్పుడు టాలీవుడ్ లో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ అన్ని ఇప్పుడు 4k రెజల్యూషన్స్ లో రిలీజ్ అయ్యి ఆడియన్స్ మరో సారి ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఐతే ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి మూవీ ఇప్పుడు 4 కె ప్రింట్ తో రిలీజ్ కి రెడీ ఐపోయింది. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగష్టు 9 న రీలీజ్ కాబోతోంది. ఈ మూవీ విదేశాల్లో కూడా రిలీజ్ అవడానికి సిద్దమయ్యింది.
రికార్డు స్థాయిలో అడ్వాన్సు బుకింగ్స్ కూడా ఐపోయాయి. ఇక ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ కూడా మంచి హుషారు మీదున్నారు. తమ జనసేనాని నటించిన జల్సా మూవీని కూడా 4k రెజల్యూషన్స్ లో విడుదల చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా గీత ఆర్ట్స్ కి అభిమానులు రిక్వెస్ట్ లు పెడుతుండేసరికి గీత ఆర్ట్స్ వర్గాలు ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాయి. ఐతే జల్సా ఒరిజినల్ ప్రింట్ మిస్ అయ్యింది కానీ ఎలాగోలా సంపాదించి దాన్ని 4k రెజల్యూషన్స్ లో మార్చి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఐన సెప్టెంబర్ 2 నాటికి విడుదల చేస్తాం అనేసరికి ఫాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో పోకిరి ఆ తర్వాత జల్సా అంటూ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన జల్సా మూవీ ఎప్పటికీ సూపర్ డూపర్ హిట్ గా ఇండస్ట్రీలో నిలిచిపోతుంది. ఇదే వరసలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన వర్షం ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టో తెలిసిందే. ఇక ఈ మూవీని కూడా ప్రభాస్ పుట్టినరోజు నాటికి అంటే అక్టోబర్ 23 నాటికి రిలీజ్ చేయాలంటూ ఆడియన్స్ అడుగుతున్నారు. ప్రభాస్ కెరీర్లో ఈ మూవీ ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. తర్వాత రాంచరణ్ నటించిన మగధీరను కూడా 4k లో రిలీజ్ చేయాలనీ అభిమానులు కోరుతున్నారు. ఇక పోకిరి మూవీకి సంబంధించి కొత్త కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ మహేష్ ఫాన్స్ లో హైప్ క్రియేట్ చేస్తోంది. అలాగే పోకిరి తరహాలో ఒక్కడు మూవీని కూడా చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.