175 గెలుస్తాం.. అది కుప్పంతోనే మొదలెడదాం. కుప్పం కూడా నా నియోజకవర్గమే..అభ్యర్ధి భరత్ ను గెలిపించండి.. మంత్రిని చేస్తా. ఇవన్నీ జగన్ అన్న మాటలు. ఇవి వింటుంటే ఏమనిపిస్తోంది.. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారు.. లేకపోతే అలా ఎలా చెబుతారు అనిపించట్లా.. అలా అనిపించటానికి ఇలా అంటున్నారని జగన్ సంగతి తెలిసినవాళ్లు చెబుతున్నారు. ఎన్నికలకు చాలా ముందే మైండ్ గేమ్ మొదలెట్టేశారని అనుకుంటున్నారు. లేకపోతే 175 గెలవడం సాధ్యం కాదనీ ఆయనకు తెలుసు.. కుప్పం గెలవడం కష్టమేనని తెలుసు.. అయినా అలా మాట్లాడుతున్నారంటే .. అది మన మైండ్ మేకప్ చేయడం కోసమే. అవును జనం మైండ్ సెట్ చేయడం కోసం… ఇలా డైలాగులు వేస్తున్నారని ప్రత్యర్ధులు అంటున్నారు.
అంతే కాదు.. దుష్టచతుష్టయం అంటూ పదే పదే మాట్లాడి దానిన బ్రాండింగ్ చేయాలని చూస్తున్నారు. దుష్ట చతుష్టయం అనగానే ఆయన చెప్పే నాలుగు పేర్లు గుర్తుకు వచ్చేలా.. జనం మెదళ్లలో రిజిస్టర్ చేసే ప్రయత్నమే అది. మరోటి ముఖ్యంగా సానుభూతి. ఇంతమంది తనపై అటాక్ చేస్తున్నారని.. నేను మాత్రం మీ కోసమే చూస్తున్నానని చెప్పండి సింపతీ గెయిన్ చేయడం కోసమే. అప్పులైనా, ఆర్ధిక వ్యవస్ధలో చేసే తప్పులైనా ప్రజల సంక్షేమ పథకాల కోసమేనని వైసీసీ ప్రచారం చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా అలాంటివాటిని జనం పట్టించుకోరు.. మన కోసమే కదా అనుకుంటారు. అలా అనుకోవాలనే అలాంటి ప్రచారం చేస్తున్నారు.
వాస్తవానికి జగన్ కు పీకె టీమ్ తో చేయించుకున్న సర్వేలతో .. నెగెటివ్ రిజల్ట్స్ ఉన్నాయని అర్ధమైంది. అప్పటి నుంచే జగన్ స్టయిల్ మార్చారని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ నెగెటివిటీని తగ్గించుకోవడం కోసం.. కొత్త రకం మైండ్ గేమ్ మొదలెట్టారనే కామెంట్లు వస్తున్నాయి. అయితే 2019లో వర్కవుట్ అయినట్లుగా పీకె మార్క్ మైండ్ గేమ్స్ ఇఫ్పుడు వర్కవుట్ అవ్వవనే కామెంట్లు కూడా వస్తున్నాయి. అప్పుడు చంద్రబాబుపై వ్యతిరేకతతోపాటు.. సోషల్ మీడియా ప్రచారం తోడై… అన్నీ వర్కవుట్ అయ్యాయని.. ఇప్పుడు వ్యతిరేకత జగన్ పైనే ఉందని.. అందుకే అవి వర్కవుట్ అవ్వవని.. చెప్పేస్తున్నారు.
జగన్ మాత్రం కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్ధులను మారిస్తే చాలు.. తాము గెలిచేస్తామని అనుకుంటున్నారు. అందుకే నేను బటన్ నొక్కుతున్నా.. మీ పనే మీరు చేయటం లేదని ఎమ్మెల్యేలను తిట్టడం వంటివి చేస్తున్నారు. అంటే అప్పుడు జనం తప్పంతా ఎమ్మెల్యేలదే..జగన్ ది ఏం లేదు అనుకోవాలన్నమాట. అలా చేసి.. ఓ 50 మంది అభ్యర్ధులను మార్చేస్తే.. తప్పు చేసినవాళ్లను మేం క్షమించలేదని బిల్డప్ ఇస్తే.. మళ్లీ అధికారంలోకి రావొచ్చనే ఆశ వైసీపీలో కనపడుతుంది. కాని గడపగడపకు వెళ్లిన వైసీపీ నేతల అభిప్రాయం వేరేలా ఉంది. కర్త, కర్మ, క్రియ అన్నీ తానై జగన్ చేస్తూ.. మా పై నెట్టేస్తన్నారని.. ఆ ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు. ప్రజల్లో ఆగ్రహం మామూలుగా లేదని.. ఆ విషయం పట్టించుకోకుండా.. మమ్మల్ని ముందు పెట్టి ఆయన బయటపడాలని చూస్తున్నారని.. వారు మండిపడుతున్నారు. చూడాలి మరి జగనన్న వ్యూహాలు, కొత్త రకం మైండ్ గేమ్స్ ఏ మేరకు వర్కవుట్ అవుతాయో.