ఏం చేసినా పర్వాలేదు..మనకు ఉపయోగపడతాడు. అక్కడ ఆ జిల్లాలో ఇలాంటోడే కావాలి. అని పిలిచి టిక్కెట్ ఇఛ్చి.. ఎంపీగా గెలిపించుకున్నారు. ఇప్పుడు ఏకు మేకై కూర్చున్నట్లు.. గోరంట్ల మాధవ్ జగన్ కే సవాల్ విసురుతున్నాడు. అవును.. ఇప్పుడు ఇదే టాక్ నడుస్తోంది. గోరంట్ల మాధవ్ వీడియో అంటూ .. వైరల్ అయిన వ్యవహారం జరిగి నాలుగురోజులైపోయింది. రెండో రోజే.. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. వీడియో నిజమైతే కఠిన చర్యలని ప్రకటించారు. కాని అప్పటి నుంచి అది నిజమో కాదో చెప్పటం లేదు. ఎవరూ తేల్చడం లేదు. మరోవైపు టీడీపీ నేతలేమో అసలు ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారా లేదా.. ఎక్కడకు పంపారు.. ఎవరితో పంపారో చెప్పమంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. వైసీపీ నుంచి మాత్రం మౌనమే సమాధానంగా ఎదురవుతుంది. రోజా లాంటి కొందరు మంత్రులు సైతం.. నిజం తేలాలంటున్నారు. ఆ నిజం ఎప్పటికీ తేలుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
గోరంట్ల మాధవ్ వీడియో నిజమేనని.. మెజారిటీ జనం అభిప్రాయపడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మాధవ్ మాత్రం అది ఖచ్చితంగా ఫేక్, మార్ఫింగ్ అని.. ఎవరు చేశారో కూడా పేర్లు బయటపెట్టారు. తన పేరు ఎలా చెబుతావంటూ చింతకాయల విజయ్ అనే టీడీపీ నేతల పరువునష్టం దావా కూడా వేశారు. అయితే జగన్ మాత్రం ఈ విషయంలో సీరియస్ ఉన్నారని చెప్పుకుంటున్నారు. వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా రెడీ అయ్యారంట. కాని.. మాధవ్ నుంచి ఊహించని రియాక్షన్ తోనే ఖంగు తిన్నారంటూ చెప్పుకుంటున్నారు.
అధిష్టానానికే గోరంట్ల మాధవ్ సవాల్ విసురుతున్నాడా? వైసీపీ అధినేత ఆయనపై చర్య తీసుకోవడానికి భయపడే పరిస్థితి వచ్చిందా అంటే.. అవుననే కొందరు టీడీపీ నేతలు అంటున్నారు. తనపై చర్య తీసుకుంటే.. తాను కూడా కొన్ని నిజాలు బయటపెట్టాల్సి వస్తుందని మాధవ్ బెదిరిస్తున్నట్లు టాక్. మరి ఆయన దగ్గర ఎలాంటి నిజాలు ఉన్నాయో.. ఎవరి గురించి ఉన్నాయో తెలియదు. అయితే అసలే సర్వేల రిపోర్టులతో టెన్షన్ లో ఉన్న జగన్ కు ఇది మరింత తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. చర్య తీసుకోకపోతే జనంలో ఇబ్బంది.. తీసుకుంటే మాధవ్ తో ఇబ్బంది.. మొత్తం మీద పార్టీకి మాత్రం డ్యామేజ్ జరిగిపోయినట్లే. అందుకే దీనిని ఎలా డీల్ చేయాలనేదాని కోసమే జగన్ టైమ్ తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే రచ్చ అయింది. దీనిని మరింత రచ్చ చేసుకుంటే .. ఇంకా డ్యామేజ్ జరుగుతుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఇతర నేతలను కూడా దీనిపై మాట్లాడొద్దని ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు. వైసీపీ నేతలు మాత్రం అలాంటివేమీ లేవని.. మాధవ్ హైకమాండ్ ఏ యాక్షన్ తీసుకున్నా సిద్ధమేనని చెప్పారని.. నిజానిజాలు తేలడం కోసమే ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. రెండు, మూడు రోజుల్లో నివేదిక వస్తుందని.. కొంచెం వెయిట్ చేయాలని.. అలా కాకుండా ఇలా ప్రచారాలు చేయడం తగదని వారంటున్నారు. మరి ఏధి నిజమో ఈ వారంలో తేలిపోతుంది.