ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 44వ చెస్ ఒలింపియాడ్ కు టార్చ్ రిలే కార్యక్రమాన్ని జూన్ 19 న న్యూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ చదరంగం నిర్వాహక సంస్థ అయిన ‘ఫెడె’.. ‘ఎఫ్ఐడిఇ’ చెస్ ఒలింపియాడ్ టార్చ్ ను ప్రవేశపెట్టింది. ఇది ఒలింపిక్స్ సంప్రదాయంలో ఒక భాగంగా ఉంది. కానీ, చెస్ ఒలింపియాడ్ లో దీనిని ఇంతవరకు ఎన్నడూ పాటించడం జరుగలేదు. చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలేను అనుసరించే ప్రప్రథమ దేశంగా భారతదేశం నిలవబోతోంది. భారతదేశంలో చదరంగం క్రీడను ఒక గొప్ప శిఖర స్థాయికి తీసుకెళ్లే క్రమంలో ఈ టార్చ్ రిలే సంప్రదాయాన్ని ఇకపై భారతదేశంలోనే ఎల్లప్పుడూ ఆరంభించి, అది ఆతిథ్య దేశాన్ని చేరుకునేకంటే ముందుగా అన్ని ఖండాల గుండా పయనిస్తుంది.
ఫిడె అధ్యక్షుడు అర్ కాడే డ్వోర్ కోవిచ్ కాగడాను ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి అప్పగించనున్నారు. ఆయన దానిని తన వంతుగా గ్రాండ్ మాస్టర్ శ్రీ విశ్వనాథన్ ఆనంద్ చేతి కి అందించనున్నారు. ఈ కాగడాను అటు తరువాత 40 రోజుల వ్యవధి లో 75 నగరాలకు తీసుకుపోయి చివరలో చెన్నై కు సమీపంలోని మహాబలిపురంలో ఉంచుతారు. ప్రతి మజిలీలో ఆ రాష్ట్రానికి చెందిన చదరంగం గ్రాండ్ మాస్టర్ లు కాగడాను అందుకుంటారు.
44వ చెస్ ఒలింపియాడ్ ను ఈ సంవత్సరం జూలై 28వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీల మధ్య చెన్నైలో నిర్వహించనున్నారు. 1927వ సంవత్సరం నాటి నుంచి నిర్వహిస్తూ వస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీని ప్రప్రథమంగా భారతదేశంలో జరుపుతున్నారు. ఈ పోటీ ని 30 సంవత్సరాల తరువాత ఆసియాలో నిర్వహిస్తున్నారు. మొత్తం 189 దేశాలు పాలుపంచుకునేటువంటి ఈ పోటీ ఏ చెస్ ఒలింపియాడ్ లో అయినా చూసుకుంటే అతిపెద్ద భాగస్వామ్యం కలిగిందిగా లెక్కకు రానుంది.