కడపలోని వేంపల్లి ఆర్ ఎంఎస్ వీధిలో నివాసముంటున్న షేక్ పరహాన్ (28 ) అనే మహిళ గురువారం హత్యకు గురయ్యింది. ఈమెకు ఇద్దరు పిల్లలు. పరహాన్ భర్త కువైట్ లో ఉంటున్నారు. వివాహేతర సంబంధాల వలన ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య వెనుక గల కారణాలను త్వరలోనే తెలుసుకుని నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
అసలు ఎందుకు ఈ హత్యలు
కుటుంబ వ్యవస్థకు మూలాధారం వివాహం. అది సనాతన భారతీయ జీవన విదానానికి మణిహారం అందుకే పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు ప్రధానంగా భారతీయ వివాహ బంధానికి ప్రపంచమే తలవంచుతుంది ప్రపంచంలో ఏ చోటుకు వెళ్లినా భారతీయ సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, కుటుంబ జీవనంపై అమితమైన మక్కువ చూపిస్తుంటారు అంతేకాకుండా భారతీయుల ఫై ఉన్న గౌరవం, ఆచార వ్యవహారాలు సామాజిక అంశాలు ఇందుకు కారణం. ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతి అంటే భారతీయులు పెద్దగా ఇష్టపడే వారు కాదు అలాంటిది ఇప్పుడు ఆ పరిస్థితి పోయి వాటి పట్ల మనం ఆకర్షితులమయ్యే పరిస్థితి ఇకపోతే పెళ్లిళ్ల విషయానికొస్తే పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు ఒకరంటే ఒకరు ఇష్టపడి చేసుకునే ప్రేమ పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్తున్న ఈ తరం దంపతుల పోకడ పాతతరం వారికి ఆందోళనకు కలిసాగిస్తోంది అదేసమయంలో కొందరు మహిళలు పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందంగా పరాయి పురుషులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం కూడా పెళ్లి పెటాకులవడానికి ఓ కారణంగా ఉంది. ఈ క్రమంలో తాజాగా కొందరు మహిళలు భర్త ఉండగా, పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడానికిగల కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.
కుటుంబం – వివాహేతర సంబంధాలు
దంపతుల్లో చాలామందికి ఇతరులతో తమ జీవిత భాగస్వామిని పోల్చి చూసుకునే బలహీనత ఉంటుంది. తాను ఆశించినట్టు భర్త లేడనో, సంసారాన్ని వాటి బాధ్యతల విషయాన్ని పట్టించుకోవడం లేదనో అసంతృప్తికి లోనవుతుంటారు. ఈ అసంతృప్తిలో వివాహేతర సంబంధాల ఉచ్చులో పడుతుంటారు. విషయం బయటపడ్డాక కాపురాలు కూలుతుండటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. వివాహేతర సంబంధాలు విభేదాలకు కారణమై చివరికి విడాకుల వరకు వెళ్తున్నాయి.కొంత మంది ఏకంగా హత్యల కు కూడా వెనుకాడని పరిస్థితి ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారిలోనూ ఈ సమస్య ఉండటం, అదీ పెళ్లయ్యాక గోల్డెన్ పీరియడ్‌గా చెప్పుకునే మూడేళ్లలోపే ఈ సమస్యలు రావడం గమనార్హం.
విడాకులు – కుటుంబాల విచ్చినం
ఓ సర్వే ప్రకారం మన దేశంలో ఏటా విడాకులు తీసుకుంటున్న జంటలు 13 లక్షల 60 వేల మంది వరకు ఉన్నారని అంచనా. విడాకులు తీసుకుంటున్న వారిలో విడిగా ఉండేందుకు ఇష్టపడుతున్న మహిళల సంఖ్య అధికం. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. మిజోరాంలో విడాకుల కేసులు అధికంగా ఉంటున్నాయి. అలాగే కులాంతర వివాహాలు అక్కడే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలా ఒంటరిగా ఉండే మహిళలు కూడా పరాయి పురుషుని సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు.చివిరికి ఈ అక్రమ సంబంధాలే వారి ప్రాణం మీదకి తెస్తున్నాయి కుటుంబ విచ్ఛిన్నానికి కారణం అవుతున్నాయి.
ఇంతకూ వివాహేతర సంబంధాల చట్టం ఏమిటి ?
ప్రస్తుత వివాహేతర సంబంధాల చట్టం 150 ఏళ్ల నాటిది. ఐపీసీ సెక్షన్ 497 దీనిని నిర్వచిస్తోంది.
ఎవరైనా పురుషుడు మరో వివాహిత అయిన మహిళతో, ఆమె అనుమతితో శారీరక సంబంధం పెట్టుకుంటే, దీనిపై ఆమె భర్త ఫిర్యాదు చేస్తే, ఈ చట్టం కింద ఆ పురుషుణ్ని దోషిగా పరిగణించి అతనికి ఐదేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు శిక్షలూ విధించవచ్చు.
అయితే, ఈ చట్టంలో ఉన్న ఒక మెలిక ఏమిటంటే, ఒక వివాహితుడు అవివాహితతో కానీ, వితంతువుతో కానీ శారీరక సంబంధం ఏర్పరచుకుంటే మాత్రం దానిని నేరంగా పరిగణించరు.ఐతే తాజాగా వివాహితులైన వారు (అడల్ట్రీ )ఇష్ట పూర్వకంగా వివాహేతర సంబంధం పెట్టుకుంటే.. అది నేరం కాదు అని ఐతే విడాకులు తీసుకోవటానికి అది ఒక కారణంగా చూపవచ్చని కోర్టు పేర్కొంది.