టాలీవుడ్ లో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అని బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. తన ఇమేజ్ వెనుక ఒక సూపర్ స్టైలిస్ట్ ఉందన్న విషయం తెలుసా. ఇటీవల స్టార్స్ స్టైలిస్ట్ గా కనిపిస్తూ ఎవరి ఐడెంటిటీ ని వారు ఓన్ గా క్రియేట్ చేసుకుంటున్నారు. ఫాషన్ రంగం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. గ్రామర్ కి గ్లామర్ టచ్ ఉంటేనే రాణించగలుగుతాం అనేది ఇప్పటి ట్రెండ్. సంథింగ్ డిఫరెంట్ లుక్ లేకపోతే మాత్రం ఈ రోజుల్లో ఏ రంగంలోనూ రాణించలేము అనే విషయం అర్ధమైపోతుంది. ఇక ఈ జెనెరేషన్ మొత్తం యూనిక్ క్వాలిటీస్ మీదే డిపెండ్ ఐనట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు ఈవెంట్స్ లో చాలా సాదాగా కనిపించే వారు కానీ… ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. స్టార్ సెలెబ్రిటీస్ కి స్టార్ స్టయిలిస్టులను పెట్టుకుంటున్నారు. ఎలాంటి ఈవెంట్ ఐనా సరే తమని తాము హైలైట్ చేసుకోవడానికి ట్రెండ్ అవడానికి చూస్తున్నారు. ఏ సెలెబ్రేషన్ ఐనా సరే స్టైలిస్ట్ డిజైన్ చేయాల్సిందే. మరి అలాంటి స్టైలిష్ డిజైనర్స్ లో హర్మాన్ కౌర్ మస్త్ టాలెంటెడ్. దేశంలోని ఫుల్ డిమాండ్ లో ఉన్న స్టయిలిష్ట్స్ లో ఈమె ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మగవారికి దుస్తుల డిజైనింగ్ చెప్పడంలో ఆమె ఫుల్ టాలెంటెడ్ అని ప్రూవ్ అయ్యింది. ఇక ఆమెకు టాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఫేమస్ బ్రాండ్స్ ఐన లాంగిన్స్, ఫ్లిప్ కార్ట్ , జొమాటో, సెలియో, సిగ్నేచర్ వన్ వంటి ఎన్నో ఫేమస్ కంపెనీస్ కి ఆమె వర్క్ చేసింది. ఇక ఈమె తన టాలెంట్ తో forbes , opinion express , jws లాంటి ఫేమస్ మ్యాగజైన్స్ లో కూడా ఆమె మీద ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయి కూడా. ఈమె టాలీవుడ్ స్టైల్ ఐకాన్ అల్లు అర్జున్ స్టైల్ ని మార్చేయడంలో హర్మాన్ సక్సెస్ అయ్యారు.
2014లో ఫ్యాషన్ స్టైలిస్ట్ గా హర్మాన్ తన కెరీర్ స్టార్ట్ చేసింది. గీత గోవిందం- బీష్మ- ABCD- అల వైకుంఠపురములో – A1 ఎక్స్ప్రెస్ వంటి టాలీవుడ్ మూవీస్ కి ఆమె వర్క్ చేసి తన టాలెంట్ ని ప్రూవ్ చేసింది. జైపూర్ లో పుట్టి హైదరాబాద్ కి వచ్చి సెయింట్ మేరీస్ కాలేజ్ లో చదువుకుని సైకాలజీలో అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ నుండి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. హర్మాన్ కి విమానాలంటే చాలా ఇష్టం. దానివల్ల పోస్ట్-గ్రాడ్యుయేషన్ తర్వాత తన కలను సాకారం చేసుకోవడానికి ట్రయల్స్ మీద ట్రయల్స్ వేస్తూనే ఉంది. దీనివల్ల హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీలో కమర్షియల్ పైలట్ లైసెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో చేరడానికి కారణమైంది. దురదృష్టవశాత్తూ ఏవియేషన్ సెక్టార్ లో మంచి జాబ్స్ లేకపోయేసరికి న్యూస్ ప్రెజెంటర్ గా టీవీ టాక్ షో హోస్ట్ గా కొత్త అవతారం ఎత్తింది. తర్వాత తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంది. వన్ ఫైన్ డే సెలబ్రిటీ స్టైలిస్ట్ కాస్ట్యూమర్ గా సెటిల్ ఐపోయింది. ఇక ఈమె ఇప్పుడు టాలీవుడ్ లో అల్లు అర్జున్ -రానా దగుబాటి – విజయ్ దేవరకొండ-కాజల్ అగర్వాల్ లాంటి ఫేమస్ యాక్టర్స్ కి స్టైలిష్ట్ గా పని చేస్తున్నారు. అనుకున్న కల నెరవేర్చుకోవడంలో హర్మాన్ కంప్లీట్ సక్సెస్ అయ్యింది.