తెలంగాణ మెదక్ జిల్లా కేంద్రంలోని అర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో బస చేసేందుకు వచ్చిన మత్స్య శాఖ, పాడి పరిశ్రమ శాఖ మంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్‌కు తాళం వేసిన అతిథి గృహం దర్శనం ఇవ్వడం పై మంత్రి తో పాటు బీజేపీ నేతలు అవాక్కు అయిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది.
కేంద్ర మంత్రి మెదక్ పర్యటనకు వచ్చారు. శుక్ర వారం రోజంతా పర్యటించి, రాత్రి బీజేపీ దళిత మహిళ నేత ఇంట్లో భోజనం చేశారు. అప్పటికే మంత్రి కోసం స్థానిక బీజేపీ నేతలు రహదారులు, భవనాల అతిధి గృహం బుక్ చేసి పెట్టారు. మంత్రితో పాటు బీజేపీ నేతలు వచ్చి అర గంట పాటు వేచి చూశారు. అర్ అండ్‌బీ అధికారులను సంప్రదిస్తే ఎవరు ఫోన్‌కి స్పందించలేదు. మెదక్ ఆర్డీవో, తహసీల్దార్లను సంప్రదించగా వారి నుంచి కూడా స్పందన రాలేదని వారు పేర్కొన్నారు. దీంతో అధికారుల తీరు పై ఆగ్రహించిన బీజేపీ నేతలు తాళం పగల కొట్టి లోపలికి వెళ్లారు..
అత్యున్నత స్థానంలో ఉన్న ఓ కేంద్ర మంత్రి వస్తే కనీస గౌరవం లేకుండా తాళం వేసి అధికారులు అందుబాటులో లేకుండా అవమానం చేయడం పై పలువురి నుంచి విమర్శలు వస్తున్నాయి. మంత్రి ఇదేం అతిథి గృహం.. కనీసం నీళ్లు కూడా ఇవ్వర అన్నట్లుగా కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి వస్తె ఇలాగేనా ప్రవర్తించడం అని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.