“జానకి కలగనలేదు” హీరో అమరదీప్ చౌదరి అలియాస్ రామచంద్ర ఒక ఇంటివాడయ్యాడు. కోయిలమ్మ ఫేమ్ తేజస్వినితో తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీళ్ళు ఇప్పుడు జంట కాబోతున్నారు. బుల్లితెర నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అమరదీప్ చౌదరి. ఎన్నో తెలుగు సీరియల్స్ ద్వారా, స్పెషల్ షోస్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. వీళ్లిద్దరి నిశ్చితార్థానికి సంబంధించి ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తేజస్విని కోయిలమ్మ, కేరాఫ్ అనసూయ సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన అమ్మాయి. ఈమె కన్నడ నటి ఐనప్పటికీ తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. ఇలా సీరియల్స్ లో ఒక పాపులారిటీ సంపాదించుకున్న వీళ్ళ ఇద్దరు ఒక ఇంటి వారు కాబోతున్నారు. ఇక వీళ్ళ నిశ్చితార్థానికి టీవీ ఆర్టిస్టులు, యూట్యూబర్స్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లంతా హాజరయ్యారు. వీళ్ళ జంట ఇలా ఎంగేజ్మెంట్ చేసుసుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇక వీళ్ళ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు మెస్సేజీలు వెల్లువెత్తుతున్నాయి. అందరి లవ్ స్టోరీలు తెలిసాయి కానీ వీళ్ళ లవ్ స్టోరీ గురించి కొంచెం కూడా అభిమానుల ముందు లీక్ కాకుండా కాపాడుకుని ఇప్పుడు సడన్గా ఎంగేజ్మెంట్ చేసేసుకోవడం ఏమన్నా బాగుందా అంటూ క్యూట్ గా అడుగుతున్నారు నెటిజన్స్.
వీరి నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరి తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో అమర్‌దీప్, తేజస్విని పూలదండలు మార్చుకుని కనిపించారు. దీంతో ఈ కొత్త జంటకు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు అభిమానులు. అయితే అమర్ దీప్ చౌదరి కానీ.. తేజస్విని కానీ.. వారి వారి వ్యక్తిగత సోషల్ మీడియాలో వీరి నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫొటోలు వీడియోలు షేర్ చేయలేదు. కేవలం అరియానా మాత్రమే తన ఇన్ స్టాగ్రామ్‌లో వీరి నిశ్చితార్ధానికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అమర్ దీప్, అరియానా గ్లోరీ క్లోజ్ ఫ్రెండ్స్.. వీరి మధ్య మంచి అనుబంధం కూడా ఉండటంతో అరియానా గ్లోరి అమర్ దీప్ నిశ్చితార్ధ వేడుకలో సందడి చేస్తూ కనిపించింది. అరియానాతో పాటు మరికొంత మంది టెలివిజన్ నటీనటులు ఈ వేడుకలో కనిపించి.. కొత్త జంటను ఆశీర్వదించారు. సిరిసిరిమువ్వ, `ఉయ్యాల జంపాల` సీరియల్స్‌తో పాపులర్ అయిన అమర్ దీప్.. ప్రస్తుతం ‘జానకి కలగనలేదు’ సీరియల్‌లో రామాగా లీడ్ రోల్ చేస్తున్నాడు. బెంగళూరులో జన్మించిన తేజస్విని బీటెక్ పూర్తి చేసి.. తమిళ్, కన్నడలో ఎన్నో సీరియల్స్ చేసి.. తెలుగులో కోయిలమ్మ సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకుంది. అమర్ దీప్‌ది అనంతపురం కాగా తేజస్విని బెంగుళూరు అమ్మాయి.. వీళ్లిద్దర్నీ బుల్లితెర కలపడంతో రియల్ లైఫ్ కపుల్‌గా మారబోతున్నారు.