– ఆంధ్రవీర చర్చా వేదికలో మేధావుల పోరం అధ్యక్షలు చలసాని శ్రీనివాసరావు
యువశక్తిని సరైన రీతిలో వినియోగించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మేధావుల పోరం అధ్యక్షలు చలసాని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆంధ్రవీర టీమ్ ఆధ్వర్యంలో “రాష్ట్ర రాజకీయాలు – ఎదుర్కుంటున్న సవాళ్లు ” “రాష్ట్ర రాజకీయాల్లో యువత పాత్ర ” అనే అంశాలపై ఒక చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్‌వల్లీ, ప్రత్యేక హోదా ఉద్యమ నాయకులు, మేదావుల ఫోరమ్ అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, ప్రొపెసర్ ఉమాశర్మ, సీపీఎం నాయకులు సీహెచ్ .బాబురావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎదురౌతున్న పరిస్థితులను ప్రశ్నించడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని ఆకాంక్షించారు. యువత ఎదుగుదలకు ప్రభుత్వాలు సరైన మార్గం చూపించాల్సిన బాధ్యత ఉందన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. గతంలో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రంలో ఉండేవని వీటి కారణంగా యువతకు సరైన ఉపాధి అవకాశాలు లభించేవి కానీ నేడు విద్య, వైద్యం, ఉపాధి ఈ మూడు సరిగ్గా అందడం లేదు అన్నారు.
వ్యవసాయం చాలా ముఖ్య వున్నారు. కానీ అలాంటి వ్యవసాయానికి ఏ ప్రభుత్వాలు సరైన రీతిలో సాయం అందించడం లేదు. పంటలు లేవు , రైతులు లేరు అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రొపెసర్ ఉమా శర్మ. వ్యయసానికి రోజులు లేకుండా పోయాయి కాబట్టి వ్యవసాయం లాభసాటి కాదు అనే ఒక భ్రమను కార్పొరేట్ కల్చర్ తీసుకొచ్చిందన్నారు. ఈ కార్పొరేట్ కల్చర్ కారణంగా ఏ రైతూ కూడా తమ పిల్లల్ని రైతులుగా మారాలని కోరుకోవడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యువకులంతా ఆంధ్రవీరులుగా , అల్లూరి సీతారామరాజులుగా మారాల్సిన అవసరం ఉంది అన్నారు. జపాన్ లాంటి దేశాల్లో యువతకు ప్రభుత్వాలు ఎన్నో అవకాశాల్ని కల్పిస్తున్నాయి కాబట్టే అక్కడ యువకులకు విద్య, ఉపాధి అవకాశాలకు లోటు లేకుండా ఉంటోందని…కానీ మన దగ్గర మాత్రం అలాంటి పరిస్థితి ఇంతవరకు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ కుల, మత రాజకీయాలను సృష్టిస్తూ ధర్నాలు, రాస్తారోకోలతో యువత పక్కదారి పట్టిపోతోందని వీటి కారణంగానే యువశక్తి నిర్వీర్యం ఐపోతోంది అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలంటే ప్రజలు ప్రశ్నించడం ముందుగా నేర్చుకోవాలి అన్నారు మాజీ ఎమ్మెల్యే, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్‌వల్లీ పేర్కొన్నారు. ప్రభుత్వాలు ప్రశ్నించే గుణాన్ని తొక్కి పెడుతోందన్నారు. యువత ఎందుకు రాజకీయాల్లోకి రావడం లేదు ? రాజకీయాల్లోకి రావడం అంత కష్టమా ..అన్న ప్రశ్నకు రాజకీయం అంటే అవినీతికి పర్యాయపదంగా మారిపోయింది అన్నారు సీపీఎం నాయకులు సీహెచ్ బాబు రావు.. రాష్ట్రాన్ని రాజకీయాలు ప్రపంచాన్నే శాసిస్తున్నాయి అన్నారు. కార్పొరేట్ అవినీతి అనేది సమాజంలో బాగా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో యువత రాజాకేయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లోకి రావాలాంటే ఎదో ఒక పార్టీలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ జెండా లేకుండా కూడా ఇటీవల రైతు చట్టాలను రద్దు చేసేలా సంఘటితమై ఉద్యమించారు అని ఉదహరించారు. సోషల్ మీడియాని ఎక్కువగా వాడితో సమాజంలో సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావాలన్నారు. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా పాత్ర చాలా కీలకం అన్నారు.
అలాగే హ్యూమన్ రైట్స్ సంస్థ నుంచి వచ్చిన జ్ఞాన సుందరి మాట్లాడారు. ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సభాముఖంగా చెప్పారు. నోటుకు వోటుని అమ్ముకోకుండా, రాష్ట్రానికి ఎవరు సరైన న్యాయం చేసి ప్రజలకు అవకాశాలు కల్పిస్తారో అలాంటివాళ్లనే నేతలుగా ఎన్నుకోవాలని వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో నవతా, అరుణ్, ప్రవీణ్, రామ్ తదితరులు పాల్గొన్నారు.