ఇస్తున్నది ఆపరేటర్ శిక్షణ.. ‘పైలెట్’ కంటూ బిల్డప్ …ఏపీ మైనార్టీ సంక్షేమ శాఖపై విమర్శల వెల్లువ
ఆంధ్రప్రభుత్వం మైనార్టీ విభాగం ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. ఆది కూడా సోషల్ మీడియాలో ప్రకటించారు. డ్రోన్ పైలెట్ శిక్షణ తీసుకునేందుకు యువతను ఆహ్వానిస్తూ ఆ ప్రకటన విడుదల చేశారు. అందులో ప్రత్యేకంగా ముస్లింలు, క్రిస్టియన్లకు మాత్రమే అని పేర్కొన్నారని చెబుతున్నారు. ఈ అంశాన్ని నవఆంధ్ర లో – పేరుకు ఉచిత డ్రోన్ శిక్షణ – విద్యార్థులపై సర్టిఫికెట్ భారం- అంటూ ప్రత్యేక కథనం ప్రచరించింది. బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేకంగా ఆ రెండు కమ్యూనిటీస్‌కే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం రెండు వేర్వేరు ప్రకటనలను విడుదల చేసింది.. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కొర్పొరేషన్ చైర్మన్ ఎం. మధుసుధన్ రెడ్డి, సెంట్రర్ ఫర్ ఎడ్యూకేషన్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనార్టీస్ డైరెక్టర్ మస్తాన్ వలీ (CEDM-AP) ప్రత్యేకంగా పత్రికా ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది. మింగ మెతుకు లేదు.. మీసానికి సంపంగి నూనె అన్నట్టుంది ఏపీలో కొన్ని ప్రభుత్వ శాఖల దుస్థితి. కొన్ని శాఖల అధికారుల అనాలోచిత నిర్ణయాలు ప్రజలకు శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా మైనార్టీ సంక్షేమ శాఖ ఇటీవల వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు గురిచేస్తోంది. అన్ని శాఖల మాదిరిగానే మైనార్టీ సంక్షేమ శాఖ నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణనిస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. అంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇటీవల ‘డ్రోన్ పైలెట్’ శిక్షణ పేరిట నిరుద్యోగ యువతకు ఇచ్చిన శిక్షణ మాత్రం నవ్వులపాలైంది.
చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల నిరుద్యోగ యువతకు ఏర్పాటుచేసిన శిక్షణ విషయంలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఏ విషయంలోనూ స్పష్టతనివ్వలేదు. 400 మంది నిరుద్యోగ యువతను ఎంపిక చేసే సమయంలో కనీస నిబంధనలు పాటించలేదు. తొలుత నోటిఫికేషన్ ఇచ్చిన మైనార్టీ సంక్షేమ శాఖ అందులో ‘డ్రోన్ పైలెట్’ శిక్షణ అంటూ పేర్కొంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో ఇప్పుడు కేవలం పైలెట్ ఆపరేటర్ల శిక్షణ అని మాత్రమే చెబుతోంది. తాము శిక్షణ వరకూ మాత్రమే ఇస్తామని.. కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి సర్టిపికెట్ పొందితేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అధికారులు చెబుతుండడంతో నిరుద్యోగ యువత ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ విషయం తెలియక తాము డ్రోన్ పైలెట్లు అయిపోతున్నామని నిరుద్యోగ యువత సంబరపడ్డారు. తీరా ఆపరేటర్ అని తెలిశాక తెగ బాధపడిపోతున్నారు. ప్రభుత్వ తీరును, మైనార్టీ సంక్షేమ శాఖ వ్యవహర శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్ డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ అంజాద్ బాషా శిక్షణను ప్రారంభించి మైనార్టీ నిరుద్యోగ యువతకు ఇదో సువర్ణావకాశంగా చెప్పుకొచ్చారు. కానీ ఇందులో లోటుపాట్లు గ్రహించలేకపోయారు. సరిదిద్దే ప్రయత్నం చేయలేకపోయారు.
ఆ రెండు వర్గాలకే ప్రాధాన్యం..
మరోవైపు ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలి విమర్శలకు దారితీస్తోంది.వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మైనార్టీలకు ఇస్తున్న ప్రాధాన్యత.. మిగతా వర్గాలకు ఇవ్వడంలేదన్న అపవాదు ఉంది. దానిని కొనసాగించేలా కేవలం మైనార్టీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు మాత్రమే శిక్షణనిస్తుండడంపై ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ ముస్లింలు, క్రిస్టియన్ వర్గాలకే ప్రాధాన్యమివ్వడంపై సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారశీకులు వంటి ఇతర మైనార్టీ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో మైనార్టీ సంక్షేమ శాఖ రాజకీయ లబ్ధి కోసమే ప్రాకులాడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు అధికంగా ఉన్నాయి. వాటిని పదిలం చేసుకోవడంలో భాగంగానే హడావుడిగా డ్రోన్ పైలెట్ అంటూ హడావుడి చేసింది. శిక్షణ పొందిన వారికి నేరుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. 45 రోజుల శిక్షణలో అభ్యర్థులే వసతి, భోజనం సమకూర్చుకోవాలని పేర్కొంది. అయితే ఉద్యోగం వచ్చి దండిగా జీతాలు పొందవచ్చన్న భావనతో చాలా మంది యువకులు శిక్షణకు దరఖాస్తు చేసుకున్నారు. తీరా పైలెట్ కాదు ఆపరేటర్ కి శిక్షణనిస్తున్నారని తెలిసి నీరుగారిపోయారు. వాస్తవానికి డ్రోన్ పైలెట్ శిక్షణకు సంబంధించి కేంద్ర పౌర విమాన శాఖ డైరెక్టర్ జనరల్ ( DGCA ) సర్టిఫకెట్ జారీచేస్తేనే విలువ ఉంటుంది. ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలు దక్కుతాయి. కానీ ఇక్కడ కేవలం శిక్షణనిస్తామని.. డీజీసీఏ సర్టిఫికెట్ కు సంబంధించి పరీక్ష రాయాల్సి ఉంటుందని మైనార్టీ సంక్షేమ శాఖ చెబుతోంది. అదేదో డీసీజీఏ అనుమతులు, మార్గదర్శకాలను తీసుకొని శిక్షణ ఏర్పాటు చేసుకొని ఉంటే బాగుండేది. కానీ అవేవీ చేయకుండా అదరాబాదరగా నిరుద్యోగ యువతను రప్పించి శిక్షణనివ్వడమేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 45 రోజుల పాటు శిక్షలో భోజనం, వసతికే దాదాపు కనిష్టంగా రూ.20 వేలకుపైగా ఖర్చవుతోంది. ఆపై డీజీసీఏ సర్టిఫికెట్ కు మరో రూ.60 వేట నుంచి లక్ష వరకు ఖర్చవుతుందని తెలియడంతో నిరుద్యోగ యువకులు లబోదిబోమంటున్నారు.
మిగతా వర్గాలు లేరా?
అయితే ఈ శిక్షణపై మైనార్టీ సంక్షేమ శాఖ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని బిల్డప్ ఇవ్వడంతో ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన యువత తెగ బాధపడుతున్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ శాఖలు ఉన్నాయి. కేవలం మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా మాత్రమే ఎందుకు శిక్షణనిస్తున్నట్టు అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. విష్ణువర్దన్ రెడ్డి చేసిన ట్వీట్.. . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనార్టీ శాఖ జారీ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. అందరికీ సమాన అవకాశాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని.. నెటిజన్లుఅంటున్నారు. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణుకుమార్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హాట్ కామెంట్స్ చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదమన్నారు. సమాజంలో మత, కుల వర్గాలను విడదీసే ప్రయత్నంగా అభివర్ణించారు. తాము మైనార్టీ నిరుద్యోగ యువతకు వ్యతిరేకం కాదంటూనే.. అన్ని శాఖలు దీనిపై స్పందించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మైనార్టీ సంక్షేమ డైరెక్టర్ మస్తాన్ వలీ ప్రత్యేకంగా పత్రికా ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొత్తానికి మైనార్టీ సంక్షేమ శాఖ ఇచ్చిన శిక్షణ నిరుద్యోగ యువతను నైరాశ్యంలో పెట్టేసింది. అనాలోచిత నిర్ణయాలు బూమరంగ్ అయ్యాయి.
YS Jagan Mohan Reddy govt launches free Drone Pilot training, placement program only for Christians and Muslims, BJP leader shares ad https://t.co/DAULWbfSL2 via @OpIndia_com@JPNadda / @blsanthosh
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) June 23, 2022