టాలీవుడ్ ఇండస్ట్రీలో పోకిరి మూవీ ఒకప్పుడు ఎంత సూపర్ డూపర్టా హిట్టో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ మూవీ 66 కోట్లు వసూలు చేసింది. గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ని వసూలు చేసింది. 299 కేంద్రాల్లో 50 రోజులు, 200 కేంద్రాల్లో 100 రోజులు, 63 కేంద్రాల్లో 175 రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. పోకిరి మూవీ అంటే చాలు ఎవ్వరికైనా గుర్తొచ్చేది “ఎవ్వడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు” అనే డైలాగ్ మస్త్ ఫేమస్ అయ్యింది. మళ్ళీ ఇదే డైలాగ్ తో ఫాన్స్ ని సందడి చేయడానికి పండుగాడు రెడీ ఐపోయాడు. మహేష్ బాబు కెరీర్ లో ఈ మూవీ ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడమే కాదు ట్రెండ్ సెట్ చేసేసింది. అంత క్రేజ్ తెచ్చుకున్న ఈ మూవీ మళ్ళీ థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ ఐపోయింది. ఇక మహేష్ ఫాన్స్ కి పండగే పండగ. మొత్తానికి కొత్త వెర్షన్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
4k రెజల్యూషన్ లోకి రీమాస్టర్ చేసి.. డాల్బీ ఆడియో టెక్నాలజీతో పోకిరిని రూపొందిస్తున్నారు. ఆగస్ట్ 9 న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సెంటర్స్ లో ఉండే థియేటర్స్ లో పోకిరి మూవీని రీరిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. రీ-రిలీజ్ న్యూస్ వచ్చిన దగ్గర నుంచి మహేష్ ఫాన్స్ థియేటర్స్ కి క్యూ కట్టడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈ మూవీ మేనియా అనేది యూఎస్ వరకు పాకిపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మూవీ కోసం ఫ్రీమౌంట్ లోని సినీ లాంజ్ లో త్రీ స్పెషల్ షోస్ కూడా వేయబోతున్నారు. ఈ త్రీ షోస్ లో ఒక షో టికెట్స్ ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. మిగిలిన టు షోస్ కి సంబంధించిన సీట్లు కూడా నెమ్మదిగా ఫుల్ ఐపోతున్నాయి. ఈ స్పెషల్ షోల ద్వారా ఈ చిత్రం ఇప్పటివరకు $819 గ్రాస్ ను వసూలు చేసేసింది. దీన్ని బట్టి అర్థమౌతోంది యుఎస్ లో పోకిరికి ఎంత క్రేజ్ ఉందో అనే విషయం. అక్కడే అలా ఉంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ మూవీ ఫీవర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.