గృహహింస నిత్యం మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో ప్రధానమైనది. పితృస్వామ్య భావజాలం ఉన్న భారతదేశంలో స్త్రీ అనాదిగా హింసను ఎదుర్కొంటుంది. పురుషుల నుండి అత్తమామల నుండి లేదా కుటుంబం నుండి హింస ను ఎదుర్కొనే మహిళ ఎక్కువ శాతం మౌనం గానే రోదించడం నిజంగా శోచనీయం. తన హక్కుల కంటే కుటుంబ పరువు. బిడ్డల భవిష్యత్తుకే. సదరు మహిళ ప్రాధాన్యతనిస్తూ కుటుంబ హింసను నిశ్శబ్దంగా అనుభవిస్తున్నది .అయితే గృహహింస అంటే ఏమిటి??? అని మనం ఒకసారి పరిశీలిస్తే ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నిర్వచనం ప్రకారం తనతో అతి దగ్గరగా మసిలే భాగస్వామి మీద అధికారం సంపాదించుకోవడానికో ఉన్న అధికారాన్ని. తనమీద బలవంతంగా కొనసాగించేలా చేయటానికి ప్రవర్తించే విధానాన్ని గృహహింస అంటారు. ఈ ప్రవర్తనలో మహిళను భయపెట్టడం. బాధ పెట్టడం, కించపరచడం. బెదిరించడం, నిందించడం, గాయాలపాలు చేయడం. హాని చేయడం ఉపాయంగా వ్యవహరించడం వంటివి అన్నీ వస్తాయి. అలాగే ఈ హింస కేవలం. శారీరక హింసకు మాత్రమే పరిమితమై ఉండదు . ఈ హింస లైంగిక, భావోద్వేగ, మానసిక హింస కూడా కావచ్చు. ఎలాంటి ప్రవర్తనను గృహహింస అనవచ్చును.
గృహహింసలు కొన్ని ప్రవర్తనా పద్ధతులు ఉంటాయి. వీటిని గుర్తించడం ద్వారా తర్వాత దాని మీద పూర్తి అవగాహనతో ఉండడం ద్వారా గృహహింస జరుగుతుందో, లేదో తెలుసుకోవచ్చు. ఆ ప్రవర్తన ఎలా ఉంటుందంటే కుటుంబసభ్యులు కానీ, భాగస్వామి కానీ మిమ్మల్ని అవమానపరచడం, మాటలు అనడం, కించపరచడం లేక మిమ్మల్ని తక్కువ చేసే విధంగా ప్రవర్తించడం. మీరు చదువుకోడానికి ఉద్యోగం చేయడానికి ఫ్యామిలీని ఫ్రెండ్స్ కలవడానికి అభ్యంతరం పెట్టడం, వారి మాటే నెగ్గాలని పట్టుబట్టడం. అలాగే మీరు డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారు. ఎక్కడకు వెళ్తున్నారు ? ఏం మెడిసిన్స్ తీసుకుంటున్నారు ఎలాంటి బట్టలు ధరిస్తున్నారు అనే విషయాల మీద కంట్రోల్ చేయడం లేదా కుటుంబ సభ్యుల్లో కానీ భాగస్వామి కానీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు డ్రగ్స్ వాడినప్పుడు తన మీద తనకు కంట్రోల్ కానప్పుడు కోపంగా ఉండడం అసభ్యంగా ప్రవర్తించడం అశ్లీల చిత్రాలు చూడమని బలవంతం చేయడం ఇవన్నీ కూడా గృహహింస కిందకు వస్తాయి. మిమ్మల్ని పిల్లల్ని పెంపుడు జంతువులను కూడా శారీరకంగా బాధించడం గృహహింస కిందకే వస్తాయి.
గృహ హింస బాధితులు కేసు ఎలా ఫైల్ చేయాలంటే
గృహహింసకు గురైన మహిళ స్థానిక మహిళా కోర్టు మహిళా పోలీస్ స్టేషన్ లేదా ఫస్ట్ క్లాస్. మెజిస్ట్రేట్. వద్ద తనపై జరిగిన హింస గురించి వివరిస్తూ కేసు ఫైల్ చేయవచ్చు. నిందితులపై కేవలం క్రిమినల్ కేసులు మాత్రమే కాకుండా సివిల్ కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. గృహహింస బాధితులు కేసు ఫైల్ చేయగానే ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎంక్వైరీ ప్రారంభిస్తారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి దగ్గర సమాచారాన్ని సేకరించి. ఆ తర్వాత జరిగిన సంఘటనల గురించి. సాక్షులను ప్రశ్నించి రిపోర్టు తయారుచేస్తారు. ఈ రిపోర్ట్ ని ఇన్సిడెంట్ రిపోర్ట్ అని అంటారు.

గృహ హింస బాధితులకు సహాయం చేసే చట్టాలు
గృహహింస బారిన పడి న మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం 2005లో గృహహింస నిరోధక చట్టాన్ని తీసుకువచ్చింది. అంతే కాదు సెక్షన్ 498 ఏ 406 , 323 354 ల ప్రకారం గృహ హింస కేసు లో నిందితులకు శిక్ష పడుతుంది. యీ నిందితుల్లో ఆడవారు ఉంటే వారి పై కూడా యీ చట్టం ద్వారా శిక్ష అమలు చేసే వీలుంటుంది.

ఎలాంటి సాక్ష్యాలు అవసరం ???
గృహహింస జరిగిందని నిర్ధారించేందుకు. దాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి వాంగ్మూలం, డాక్యుమెంటరీ ప్రూఫ్ ఆడియో, వీడియో ప్రూఫ్ వంటివి సాక్ష్యాలుగా పనికి వస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మహిళ ల రక్షణ చట్టాల అమలులో చాలా లోపాలు కనపడుతున్నాయి. నిత్యం మహిళల పైన దాడులు జరగడం ఏపీలో సర్వసాధారణమైపోయింది. దిశా యాప్ ఏర్పాటు చేసిన మహిళలపై నేరాలు ఆగడం లేదు. బలహీన వర్గాలు దళిత మహిళలపై ముఖ్యంగా. ఇలాంటి ఘోరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెం, గుంటూరు, కర్నూలు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాలలో జరిగిన సంఘటనల ద్వారా ఏపీలో మహిళల రక్షణ పై ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పకనే చెప్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి మహిళా చట్టాలను పటిష్ట పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మహిళలపై జరుగుతున్న అరాచకాలు అన్యాయాల గురించి ప్రముఖ సామాజిక కార్యకర్త లా విద్యను అభ్యసిస్తున్న శోభ మాట్లాడుతూ మహిళలపై గృహహింస అనేక రూపాల్లో జరుగుతుందని శారీరక మరియు మానసిక హింసతో పాటు లైంగిక హింస కూడా ఆడవారి పట్ల ఎక్కువైందని మరి ముఖ్యంగా పని ప్రదేశాల్లో ఈ హింస తీవ్రతరమైనదని అన్నారు గృహహింస నిరోధక చట్టాలు దిశా యాప్ లో ఎన్ని ఉన్నా ఆడవారి మీద హింస అనేక రూపాలలో ఎక్కువైంది అన్నారు .అశ్లీలత కూడా దీనికి ఒక కారణం అని కనుక అశ్లీల వెబ్సైట్ల మీద. నిఘా ఉంచాలని అలాగే ప్రభుత్వము పోలీసులు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, మద్యం, డ్రగ్స్ కు బానిసై ఆ మత్తులో ఉన్న యువతలో అవగాహన పెంచే విధంగా కృషి చేయాలని తద్వారా వారు చెడు అలవాట్లు మానేలా చేయాలన్నారు. దీని ద్వారా కొంతలో కొంత మహిళలపై జరిగే హింసను తగ్గించవచ్చు అన్నారు. మహిళలు కూడా తమ హక్కుల సాధన కోసం చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అన్యాయం జరిగినప్పుడు బాధపడుతూ ఏడుస్తూ. ఇంట్లో కూర్చోకుండా చట్టాన్ని న్యాయస్థానాలను ఆశ్రయించాలని కోరారు.
In this article:abusewebsites, court, dishaapp, domesticviolence, gruhahimsa, sobha
Click to comment