వైసీపీ ప్రభుత్వం పై ఆ పార్టీ కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన నియోజకవర్గ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలయ్యారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తుండేసరికి చంటి బాబు అసహనానికి గురై ప్రభుత్వం తనకు సహకరించడం లేదని, సమస్యలను పరిష్కరించడం లేదంటూ మండిపడ్డారు. పెన్షన్ తీసుకునే సామాన్యుడు అసలు ఇన్కమ్ టాక్స్ ఎలా కడతాడండీ అంటూ ప్రశ్నించారు. ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలుసు..పార్టీ లేదు గాడిద గుడ్డు లేదు.. రేపటి రోజున ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియదు అంటూ ఎమ్మెల్యే చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఐతే ఆయన్ని టార్గెట్ చేసిన టీడీపీ, జనసేన నోరు మూయించేందుకు ప్రభుత్వం పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే విషయాన్ని పరిశీలిస్తే వైసీపీ రాబోయే ఎన్నికల్లో ఓడిపోతుందని తెలిసే పార్టీలోంచి పక్కకు తప్పుకుని, మరో పార్టీలోకి జంప్ చేయడానికి లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైసీపీకి వ్యతిరేక గాలులు వీయడం మొదలైనట్టే కనిపిస్తోంది. “గడపగడపకు ప్రభుత్వం” పేరుతో ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ఇస్తున్న పధకాల గురించి, ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి ఫీడ్ బ్యాక్ అడుగుతుంటే మాత్రం ప్రజలు వాళ్లకు సరిగా రెస్పాండ్ కావడం లేదనే విషయాన్నీ సర్వేలు చెబుతున్నాయి. ఐతే దాదాపు నూటికి 75 శాతం మంది ప్రజలు మాత్రం పధకాలను ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో ఖర్చులు పెంచి వాటిని మళ్ళీ తీసేసుకోవడం కరెక్టేనా అని ప్రజలు ప్రశ్నింస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఎన్నో హామీలు ఇచ్చింది. మేము వాటిని నమ్మి గద్దెనెక్కిస్తే చివరికి ఇలా మా జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది అంటున్నారు రాష్ట్ర ప్రజలు.
హామీలే ఇచ్చినట్టే ఇచ్చే వాటిని వెనక్కి తీసేసుకుంటున్నారు..ప్రజల సంక్షేమమే మా సంక్షేమం అని నినాదాలు చేసింది కానీ వాటిని సరిగా అమలు చేయడంలో విఫలమయ్యిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.. దేశంలో ఏ ప్రభుత్వం చేయనంత ద్రోహం వైసీపీ ప్రభుత్వం చేసిందంటూ కాపు వర్గీయులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే కరెంటు చార్జీలు పెంచం అని కరెంటు బిల్లుల్ని రెండింతలు చేసేసి, నిత్యావసరాల ధరలు పెంచేసి, మద్యనిషేధం అని చెప్పి నాసిరకం మద్యం అమ్మకాల్లో ఏపీ ప్రభుత్వం ముందుంది అంటూ సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది, అమ్మ ఒడి అంటూ మొదట్లో బాగానే ఖాతాల్లోకి డబ్బులు చేశారు కానీ అటెండెన్స్ వంకతో, కరెంటు బిల్లు 300 ల యూనిట్లు దాటితే అమ్మ ఒడి, పెన్షన్, 200 యూనిట్లు దాటితే రేషన్ కట్ అంటూ మెలికలు పెట్టేసరికి ప్రజలు ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులో పెద్ద విషయం కనిపించకపోయినా 175 కి 175 సీట్లు వస్తాయని జగన్ కలలు కంటున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, సర్వేలు కూడా అవే చెప్తున్నాయి.